Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

mAyA samsAram - మాయా సంసారం

చిత్రం : ఉమా సుందరి(umA sundari) (1956)
రచన : సదాశివబ్రహ్మం(sadASivabrahmam)
సంగీతం : అశ్వత్థామ(aSwatthAma)
గానం : పిఠాపురం నాగేశ్వరరావు(piThApuram nAgESwararao)
05 March - నేడు పిఠాపురం నాగేశ్వరరావు వర్ధంతి


పల్లవి :
మాయా సంసారం తమ్ముడు
ఇది మాయా సంసారం తమ్ముడు
నీ మదిలో సదాశివుని మరువకు తమ్ముడు॥
చరణం : 1
ముఖము అద్దము ఉందీ
మొగమాటమెందుకు
సుఖదుఃఖములు లెక్క
చూసుకో తమ్ముడు॥
సకల సమ్మోహన సంసారమందున (2)
సుఖాలు సున్నా దుఃఖాలే మిగులన్నా (2)॥
చరణం : 2
కోరి తెచ్చుకున్న భారమంతే కానీ
దారా పుత్రులు నిను దరి జేర్చుతారా॥
పేరు చూసి నిజము తెలుసుకో తమ్ముడు
పేరు చూసి నిజము తెలుసుకో తమ్ముడు
భారము సత్యం సర్వం పరమాత్మ॥
చరణం : 3
వచ్చినప్పుడు వెంట తెచ్చినదేముంది (2)
పోయేటప్పుడు కొని పోయేదేముంది (2)
అద్దె కొంప లోకమంతేరా తమ్ముడు (2)
వద్దు పొమ్మనగానే వదిలేసి పోవాలి॥


Special Note:
పూర్తిపేరు : పాతర్లగడ్డ నాగేశ్వరరావు (పిఠాపురం నాగేశ్వరరావు)
జననం : 05-05-1930

జన్మస్థలం : తూర్పుగోదావరి జిల్లా, పిఠాపురం

తల్లిదండ్రులు : అప్పయమ్మ, విశ్వనాథం

చదువు : ఎస్.ఎస్.ఎల్.సి.

తొలిచిత్రం-పాట-పారితోషకం : మంగళసూత్రం (1946) - హాయిగా పాడవే కోయిలా - 250 రూపాయలు
ఆఖరిచిత్రం-పాట : బొమ్మరిల్లు (1978) - చల్లని రామయ్య చక్కని సీతమ్మ
పాటలు : సుమారు 7000 (తెలుగు, తమిళ, హిందీ, సింహళ, కన్నడ)
గౌరవసత్కారాలు : 50 ఏళ్ల సినీ గాయకునిగా ఆయన సేవలకు గుర్తింపుగా మద్రాసు సంగీత అకాడమీ ‘ఆంధ్రా మహమ్మద్ రఫీ’, కళాసాగర్ ‘జనతాసింగర్’, యువకళావాహిని ‘గానగంధర్వ’ బిరుదులతో సత్కరించింది. హెచ్.ఎం.వి. సంస్థచే కూడా సన్మానం అందుకున్నారు.
ఇతర విషయాలు : తండ్రి రంగస్థల నటుడు కావడంతో చిన్నప్పటి నుండే నాటకాలంటే అభిరుచి ఏర్పడింది. నవకళాసమితి వారి నాటకాల్లో వైవిధ్యభరితమైన పాత్రలను పోషించారు. 16 ఏళ్లకే గాయకునిగా సినీరంగ ప్రవేశం చేసి 1975 వరకు పాటలు పాడారు. ముఖ్యంగా మాధవపెద్ది సత్యంతో కలిసి పాడిన పాటలు ఈనాటికీ మరపురానివి. ఘంటసాలగారి ప్రోత్సాహంతోనే ఆయన ఎక్కువ పాటలు పాడినట్లు పిఠాపురం చెప్పుకునే వారు. ఏయన్నార్‌కు తొలినాళ్లలో గాత్రం అందించిన వారిలో పిఠాపురం కూడా ఒకరు. కన్నడంలో... రాజ్‌కుమార్, ఉదయ్‌కుమార్, తమిళంలో శివాజీగణేశన్‌లకు కూడా పాడారు. ఆంధ్రదేశంలో మాత్రమే కాకుండా, కలకత్తా, ముంబై... ఇలా చాలాచోట్ల స్ట్రేజ్ ప్రోగామ్స్ ఇచ్చారు. సినీ హాస్యగాయకునిగా శ్రోతల మదిలో చెరగని ముద్రవేసుకున్నారు.
మరణం:05-03-1996

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |