Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

mAmiLlatOpukADa - మామిళ్ల తోపుకాడ

చిత్రం : డ్రైవర్ రాముడు(driver rAmuDu) (1979)
రచన : వేటూరి(vETuri)
సంగీతం : చక్రవర్తి(chakravarthi)
గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల(S.P.bAlu,P.suseela)

పల్లవి : మామిళ్ల తోపుకాడ పండిస్తే
మరుమల్లె తోటకాడ పువ్విస్తే ॥మామిళ్ల॥
ఏలికేస్తే కాలికేసి కాలికేస్తే ఏలికేసి
ఎత్తీ కుదేశాడే అబ్బాడి దెబ్బ
చిత్తు చిత్తు చేశాడే
అమ్మమ్మమ్మమ్మ ఎత్తీ కుదేశాడే
అబ్బాడి దెబ్బ చిత్తు చిత్తు చేశాడే
నిమ్మకూరు రోడ్డుదాటి నే వస్తే
నిడుమోలు లాకుకాడ ఆపేస్తే
॥నిమ్మకూరు॥
ఏలికేస్తే కాలికేసి కాలికేస్తే ఏలికేసి
ముద్దిచ్చిపోవేమే బజ్జీల బుజ్జి
ముచ్చటైన తీర్చవేమే (2)
చరణం : 1
గజ్జెల గుఱ్ఱమంటి కుర్రదానా
ఈ మద్దెళ్లు ఆపలేను మనసులోనా
సజ్జా చేనల్లే ఎదిగి ఉన్నదానా
ఈ పిట్ట పొగరు చూడవేమే వయసులోనా
ఆ... ముని మాపు వేళకొస్తే
ముడుపులన్నీ కట్టిస్తా
చుక్క పొడుపు చూసివస్తే
మొక్కులన్నీ తీరుస్తా
వలపులన్నీ వడ్డిస్తా వయస్సువడ్డి చెల్లిస్తా
వలపులన్నీ వడ్డిస్తా వయస్సువడ్డి చెల్లిస్తా

॥ఏలికేస్తే॥ ॥అమ్మమ్మమ్మమ్మ ॥
చరణం : 2
ఏడు నిలువులెత్తువున్న కోడెకాడా
నీ చుట్టుకొలత చూడలేను బీడుకాడా
దిక్కులన్నీ ఒక్కటైన చక్కనోడా
నీ ట్రక్కు జోరు ఈడ కాదూ ఇంటి కాడ
ఆ... పంటకెదిగే వయసు కాస్తా
కుప్పవేసి నూర్చేస్తా
జంటకొదిగే సొగసులన్నీ
ఇప్పుడే నే కాజేస్తా
వయసు నేనై వాటేస్తా మనసులోనే చోటిస్తా
వయసు నేనై వాటేస్తా మనసులోనే చోటిస్తా
॥ఏలికేస్తే॥ ॥నిమ్మకూరు॥ ॥అమ్మమ్మ॥
పల్లవి : దొంగ... అమ్మో... అరెరెరే...
వంగమాకు వంగమాకు
వంగి వంగి దొంగలాగ పాకమాకు॥వంగమాకు॥
వంగుతుంటే కొంగులోని
గుట్టంతా రట్టమ్మో చుక్కమ్మో వంగమాకు
లాగమాకు లాగమాకు
లాగిలాగి పైటకొంగు జారనీకు (2)
లాగుతుంటే కొంగుచాటు
గుట్టంతా రట్టయ్యో రామయ్యో లాగమాకు'
చరణం : 1
ఈతముల్లు గుచ్చుకుంటే
ముంజలాంటి లేతవళ్లు గాయం (2)
తోటమాలి చూశాడా బడిత పూజ ఖాయం
మాలి నాకు మామేలే తోటకూడ మాదేలే మాలి నాకు మామేలే తోటకూడ మాదేలే
ముల్లయినా నన్ను తాకి పువ్వై పోతుందిలే
రామయ్యో వెళ్లి రావయ్యో (2)॥వంగమాకు॥
అరెరెరే...
చరణం : 2
చేనుమీద చొరవచేస్తే
చెంపమీద చేతిముద్ర ఖాయం (2)
నేను గొడవ చేశానా ఎవరు నీకు సాయం
ఆడచెయ్యి తగిలితే హాయి నాకు రగిలితే
ఆడచెయ్యి తగిలితే హాయి నాకు రగిలితే
వంగతోటలో సరసం వరసే అవుతుందిలే
చుక్కమ్మో నాకు చిక్కమ్మో... (2)
॥వంగమాకు॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |