okariki okarai - ఒకరికి ఒకరై
చిత్రం : స్టూడెంట్ నెం:1(student no.1) (2001)రచన : చంద్రబోస్(chandrabOse)
సంగీతం : ఎమ్.ఎమ్.కీరవాణి(M.M.keeravaNi)
గానం : కె.కె., వ ర్ధిని(K.K,varthini)
ఒకటిగ ముందుకు వెళుతుంటే
అడిగినవన్నీ ఇస్తుంటే
అవసరమే తీరుస్తుంటే
ప్రేమంటారా... కాదంటారా!॥
చరణం : 1
దిగులే పుట్టిన సమయంలో
ధైర్యం చెబుతుంటే
గొడవే పెట్టిన తరుణంలో
తిడుతూనే వేడుకుంటే
కష్టం కలిగిన ప్రతిపనిలో
సాయం చేస్తుంటే
విజయం పొందిన వేళలలో
వెన్నుదట్టి మెచ్చుకుంటే
దాపరికాలే లేకుంటే
లోపాలను సరిచేస్తుంటే
ఆటాపాటా ఆనందం
అన్నీ చెరి సగమౌతుంటే
ప్రేమంటారా... కాదంటారా!॥
చరణం : 2
ఓ మనోహరీ చెలీ సఖీ
ఓ స్వయంవరా దొరా సఖా
మనసు నీదని మనవి సేయనా సఖీ
బ్రతుకు నీదని ప్రతినబూననా సఖా
నినుచూడలేక నిమిషమైన
నిలువజాలనే సఖీ సఖీ...
నీ చెలిమిలేని క్షణములోన జగతిని
జీవింపజాలనోయ్ సఖా...
ఆ... ఆ... నటనకు జీవం పోస్తుంటే
ఆ ఘటనలు నిజమనిపిస్తుంటే
అటుపై శెలవని వెళుతుంటే
నీ మనసే కలవర పడుతుంటే
ప్రేమంటారా... జౌనంటాను...