Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

idiyE hAyi kalupumu - ఇదియే హాయి కలుపుము

చిత్రం : రోజులు మారాయి (1955)
రచన : తాపీ ధర్మారావు
సంగీతం : మాస్టర్ వేణు
గానం : ఘంటసాల, జిక్కి
08 May - నేడు తాపీ ధర్మారావు వర్ధంతి


పల్లవి :
ఇదియే హాయి కలుపుము చేయి
వేయి మాటలేలనింక... (2) ॥
చరణం : 1
ఓ... ఆ చూపులోనే కురియును తేనె
చిరునగవాహా వెలుగున వాలి
మనసుకు హాయి సోలునే... (2)
నీవాడిన మాట సాటిలేని పూలబాట
సాటిలేని పూలబాట... ఓ... ॥
చరణం : 2
అందాలలోన నడివడిలోన
తొలుతను నీవే తెలియగరావే
బ్రతుకున మేలు చూపవే... (2)
నీ చూపే చాలు అదే నాకు వేనవేలు
అదే నాకు వేనవేలు... ఓ... ॥
చరణం : 3
ఈ లోకమేమో మరో లోకమేమో
మనసులతోనే తనువులు తేలే
బ్రతుకిక తూగుటూయలే... (2)
ఈనాటి ప్రేమ లోటులేని మేటి సీమ
లోటులేని మేటి సీమ... ఓ... ॥

Special Note:
పూర్తిపేరు : తాపీ ధర్మారావు నాయుడు
జననం : 19-09-1887
జన్మస్థలం : ఒరిస్సాలోని బరంపురం
తల్లిదండ్రులు : నరసమ్మ, డాక్టర్ అప్పన్న
చదువు : బి.ఏ.(పచ్చయ్యప్ప కాలే జ్ , చెన్నై)
తోబుట్టువులు : అన్నయ్య (నరసింగరావు), తమ్ముడు (తులసీరావు), చెల్లెళ్లు (వెంకటనరసమ్మ, తిరుపతమ్మ)
వివాహం : 1902
భార్య : అన్నపూర్ణమ్మ
పిల్లలు : కుమార్తెలు (లక్షుమమ్మ, బంగారమ్మ), తర్వాత కవలలు పుట్టి చనిపోయారు. కుమారులు (మోహనరావు, కీ॥అహోబలరావు, చాణక్య)
పాటలు రాసిన తొలిచిత్రం : రైతుబిడ్డ (1939)
ఆఖరిచిత్రం : భీష్మ (1962)
పాటలు : సుమారు 250
గౌరవ పురస్కాలు : శృంగేరీ పీఠాధిపతులు జగద్గురు చంద్రశేఖర భారతీ శంకరాచార్యుల వారి నుండి 1926లో ‘ఆంధ్రవిశారద’ బిరుదు, చేమకూరి వెంకటకవి రచించిన ‘విజయవిలాసం’ కావ్యానికి చేసిన ‘హృదయోల్లాస వ్యాఖ్య’ కు 1971లో కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు. మరెన్నో సాహిత్య అవార్డులు.
ఇతర విషయాలు : ‘తాతాజీ’ గా అందరికీ సుపరిచితులు. ఈయన గిడుగు రామమూర్తి పంతులు గారి శిష్యులు. కొండెగాడు, సమదర్శిని, జనవాణి, కాగడా వంటి పత్రికలలో పనిచేశారు. కళాశాల, సర్వే డిపార్ట్‌మెంట్‌లలో పలు ఉద్యోగాలు చేశారు. ఈయన తొలి రచన 1911లో ‘ఆంధ్రులకొక మనవి’ అనే పేరుతో వెలువడింది. తరువాత అనేక రచనలు చేశారు. మాలపిల్ల (1938) సినిమా రచనతో సినీరంగ ప్రవేశం జరిగింది. 1943లో జరిగిన మొదటి అభ్యుదయ రచయితల సమావేశానికి అధ్యక్షత వహించారు. రచయితగా, భాషాపండితుడిగా, హేతువాదిగా, సంఘసంస్కర్తగా ప్రసిద్ధులు.
మరణం : 08-05-1973

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |