Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

chEtilO cheyyEsi - చేతిలో చెయ్యేసి చెప్పు

చిత్రం : దసరా బుల్లోడు(dasarA bullODu) (1971)
రచన : ఆచార్య ఆత్రేయ(achArya atrEya)
సంగీతం : కె.వి.మహదేవన్(K.V.mahadEvan)
గానం : పి.సుశీల(P.suSeela)
07 May - నేడు ఆత్రేయ జయంతి


పల్లవి :
చేతిలో చెయ్యేసి చెప్పు బావా (2)
చేసుకున్న బాసలు చెప్పుకున్న ఊసులు
చెరిపివేస్తానని మరచిపోతానని॥
చరణం : 1
పాడుకున్న పాటలు పాతవనీ ఊరుకో (2)
ఆ మాటలన్నీ మాపేసి కొత్తపాట పాడుకో॥
చరణం : 2
మాట తప్పిపోయినా
మనిషి బ్రతికితే చాలు (2)
మన మమత చంపుకున్నా
ఒక మంచి మిగిలితే చాలు॥
చరణం : 3
తెలియక మనసిచ్చినా
తెలిసి కుమిలిపోతున్నా (2)
మిమ్ము కలపమని ముక్కోటి దేవతలకు
మొక్కుతున్నా॥

Special Note:
అసలు పేరు :కిళాంబి వేంకట నరసింహాచార్యులు
జననం : 07-05-1921
జన్మస్థలం : నెల్లూరు జిల్లా, సూళ్లూరుపేట తాలుకా మంగళంపాడు
స్వస్థలం : సూళ్లూరుపేట తాలుకా ఉచ్చూరు
తల్లిదండ్రులు : సీతమ్మ, కృష్ణమాచార్యులు
చదువు : ఎస్.ఎస్.ఎల్.సి.
వివాహం - భార్య : 1940 - పద్మావతి
తొలిచిత్రం - పాట : దీక్ష (1951) -పోరా బాబూ పో పోయి చూడు లోకం పోకడ
ఆఖరిచిత్రం - పాట : ప్రేమయుద్ధం (1990) - ఈ మువ్వలగానం మన ప్రేమకు ప్రాణం
పాటలు : సుమారు 1400
దర్శకునిగా : వాగ్దానం (1961)
నటించిన సినిమా : కోడెనాగు (1974)
గౌరవ పురస్కారాలు : 1989 మే లో అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేటు పొందారు. తొలి కోడి కూసింది (1981) లో ‘అందమైన లోకమనీ’ పాటకు నంది అవార్డు అందుకున్నారు.
ఇతరవిషయాలు : గోత్రనామం ఆత్రేయను, పేరులో ఆచార్యను కలిపి ‘ఆచార్య ఆత్రేయ’ అని పెట్టుకున్నారు. చిన్నప్పుటి నుండే చదువు మీద కన్నా నాటకాల మీదనే మక్కువ చూపేవారు. రాజన్ అనే మిత్రుని సాయంతో మద్రాసు చేరుకున్నారు ఆత్రేయ. అక్కడ ఒకసారి వీధి దీపం కింద కూర్చొని ‘గౌతమబుద్ధ’ అనే నాటకం రాసి దానిని యాభైరూపాయలకు అమ్మి, దానితో తన అవసరాలను తీర్చుకున్నారు. ‘తెనాలి రామకృష్ణ’ సినిమాలో చిన్న వేషానికి అవకాశమొచ్చినా అది నచ్చక వెనక్కి వ చ్చేశారు. ఆ తర్వాత షావుకారు చిత్రానికి డైలాగులు రాసే అవకాశం వచ్చినా అప్పుడు ఆరోగ్యం సహకరించలేదు. కొన్నాళ్ల తర్వాత ‘మనోహర’ అనే చిత్రానికి డైలాగ్ అసిస్టెంట్‌గా మాటసాయం చేశారు. చివరికి ‘దీక్ష’ సినిమాతో ఆత్రేయ సినీరంగంలోకి తెరం గేట్రం చేశారు. చాలా పద్యాలు, నాటకాలు, నాటికలు రచించారు. దాదాపు 400 చిత్రాలకు రచన చేశారు. వివిధ విశ్వవిద్యాలయాల్లో ఆత్రేయ మీద 12 మంది పరిశోధనలు చేశారు. ‘మనస్విని’ సంస్థ ఆత్రేయ సాహిత్యాన్ని 7 సంపుటులుగా 1990లో ప్రచురించారు, ఆయన ‘మనసుకవి’గా ప్రజల మన్ననలు పొందారు.
మరణం : 13-09-1989

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |