Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

rekkalu toDigi - రెక్కలు తొడిగి

చిత్రం : చుట్టాలొస్తున్నారు జాగ్రత్త(chuTTAlostunnAru jAgratta) (1980)
రచన : డా॥సి.నారాయణరెడ్డి
సంగీతం : ఎం.ఎస్.విశ్వనాథన్
గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల
31 May - కృష్ణ బర్త్‌డే(Krishna Birthday)


పల్లవి : రెక్కలు తొడిగి రెపరెపలాడి
రివ్వంటుంది కోరిక
దిక్కులు తోచక చుక్కలదారుల
చెలరేగింది వేడుక॥
వయసు దారి తీసింది
వలపు ఉరకలేసింది॥
మనసు వెంబడించింది
నిమిషమాగక॥
చరణం : 1
చెంతగా చేరితే...
చెంతగా చేరితే వింతగా ఉన్నదా
మెత్తగా తాకితే కొత్తగా ఉన్నదా (2)
నిన్న కలగా ఉన్నది
నేడు నిజమౌతున్నది (2)
అనుకున్నది అనుభవమైతే
అంతకన్న ఏమున్నది॥
చరణం : 2
కళ్లతో నవ్వకు...
కళ్లతో నవ్వకు ఝల్లుమంటున్నది
గుండెలో చూడకు గుబులుగా ఉన్నది
గుండెలో చూడకు గుబులుగా ఉన్నది
తొలిచూపున దాచింది
మలి చూపున తెలిసింది
ఆ చూపుల అల్లకతోనే
పెళ్లిపిలుపు దాగున్నది
వయసు దారి తీసింది
వలపు ఉరకలేసింది
మనసు వెంబడించింది
నిమిషమాగక (2)॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |