Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

EveTTi chESADE - ఏవెట్టి చేశాడే


చిత్రం : స్టూడెంట్ నెం:1(Student No.1) (2001)
రచన : చంద్రబోస్(chandrabOse)
సంగీతం : కీరవాణి(keeravANi)
గానం : ఉదిత్ నారాయణ్, చిత్ర(udit nArAyaN,chitra)

పల్లవి :
ఏవెట్టి చేశాడే ముద్దుగుమ్మ
నిను ఆ బ్రహ్మ
నీ ఒళ్లే నాజూకు
పూలరెమ్మ ॥
పాలతోనా పూలతోనా
వెన్నతోనా జున్నుతోనా
రంభ ఊర్వశి మేని చెమటతోనా
ఏవెట్టి ఏవెట్టి... టీ టీ టీ టీ॥
చరణం : 1
నిన్ను చూసినప్పుడే
కనకదుర్గకు నేను మొక్కుకున్నా
నీకు కన్ను కొట్టుకుంటానని
నిన్ను కౌగిలించుకుంటానని
నిన్ను కలిసినప్పుడే సాయిబాబాకు నేను మొక్కుకున్నా
నీతో సంధి చేసుకుంటానని
నీతో సందులోకి వస్తానని
రాఘవేంద్రస్వామికి మొక్కుకున్నా నీతో భాగస్వామినౌతానని
మూడుకళ్ల శివుడికి మొక్కుకున్నా నీతో మూడు రాత్రులవ్వాలని
ఆఖరికి... ఆఖరికి నీకే మొక్కుకున్నా నీ నౌకరుగా ఉంటానని
తీపి చాకిరులే చేస్తానని
ఏవెట్టి... ఏవెట్టి... టీ టీ టీ టీ...
ఏవెట్టి పెంచిందోయ్ ఓ మావా
నిను మీ అమ్మ
నీపైనే పుట్టిందోయ్
పిచ్చప్రేమ
ఉక్కుతోనా ఉగ్గుతోనా
నిప్పుతోనా పప్పుతోనా
కాముడు పంపిన
కోడి పులుసుతోనా ॥
చరణం : 2
నువ్వు కట్టుకొచ్చిన
గ ళ్ల చీరతో ఒకటి చెప్పుకున్నా
నేను చూడగానే జారాలని
ఆ మాటనోరు జారొద్దని
నువ్వు పెట్టుకొచ్చిన
కళ్లజోడుతో ఒకటి చెప్పుకున్నా
మేము అల్లుకుంటే చూడొద్దని
ఈ లొల్లి బైట చెప్పొద్దని
చెవులకున్న దుద్దులతో చెప్పకున్నా
చిలిపి మాటలన్ని వినొద్దేయని
కాలికున్న మువ్వలతో చెప్పుకున్నా
మసక చీకటేళ మూగ బొమ్మని
నీ కన్నెతనానికే చెప్పుకున్నా
తనకేవేవో చెబుతానని
అవి నీక్కూడా చెప్పొద్దని ॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |