abhinandana mandAra mAla - అభినందన మందారమాల
చిత్రం : తాండ్రపాపారాయుడు(tANDra pApArAyuDu) (1986)రచన : డా॥సి.నారాయణరెడ్డి
సంగీతం : సాలూరు రాజేశ్వరరావు
గానం : కె.జె.ఏసుదాస్, పి.సుశీల
పల్లవి :
అభినందన మందారమాల... (3)
అధినాయక స్వాగతవేళ...
అభినందన మందారమాల
స్త్రీ జాతికీ ఏనాటికీ స్మరణీయ మహనీయ వీరాగ్రణికి
అభినందన మందారమాల...
అధినాయక స్వాగతవేళ...
అభినందన మందారమాల
చరణం : 1
వేయి వేణువులు నిన్నే పిలువగ
నీ పిలుపు నావైపు పయనించెనా॥
వెన్నెల కన్నెలు నిన్నే చూడగా (2)
నీ చూపు నా రూపు వరియించెనా
నీ చూపు నా రూపు వరియించెనా
నా గుండెపై నీవుండగా...
దివి తానే భువిపైన దిగివచ్చెనా
అభినందన మందారమాల...
అలివేణీ స్వాగతవేళ...
అభినందన మందారమాల
సౌందర్యమూ సౌశీల్యమూ నిలువెల్ల
నెలకొన్న కలభాషిణికి
అభినందన మందారమాల
చరణం : 2
వెండి కొండపై వెలసిన దేవర
నెలవంక మెరిసింది నీ కరుణలో॥
సగము మేనిలో ఒదిగిన దేవత (2)
నునుసిగ్గు తొణికింది నీ తనువులో
నునుసిగ్గు తొణికింది నీ తనువులో
ప్రియ భావమే లయరూపమై
అలలెక్కి ఆడింది అణువణువులో
అభినందన మందారమాల
ఉభయాత్మల సంగమ వేళ
అభినందన మందారమాల