nallavADE ammammO - నల్లవాడే అమ్మమ్మో
చిత్రం : దసరా బుల్లోడు(dasarA bullODu) (1971)రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : కె.వి.మహదేవన్
21 June - నేడు కె.వి.మహదేవన్ వర్ధంతి
పల్లవి :
నల్లవాడే... అమ్మమ్మో అల్లరి పిల్లవాడే
చిన్నవాడే... అయ్యయ్యో
మన చేత చిక్కినాడే ॥
ఓలమ్మి చిన్నవాడనుకొని చేరదీస్తే (2)
ముంచుతాడే... కొంప ముంచుతాడే
చరణం : 1
సున్నమైన వెన్నలా మింగుతాడే
చద్దినీళ్లైనా చల్లలా తాగుతాడే
అహా... ॥
వెన్నముద్దకని వెనకెనక వస్తాడే (2)
వచ్చాడే వచ్చాడే వచ్చాడే...
ఇచ్చాడే ఇచ్చాడే ఇచ్చాడే...
వెచ్చంగ ఒక్కటిచ్చి వెక్కిరించిపోతాడే॥
చరణం : 2
నెమలి ఈక పెట్టవే... డుడుం డుడుం డుం
మురళి చేతికివ్వవే... ॥
అబ్బో వాయిస్తాడిప్పుడు ఉండవే (2)
వదలగొడతాడు తుప్పులు
చూడు చూడు చూడవే ॥
చరణం : 3
ఆ ముద్దు కృష్ణుడే ఈ ముద్దుగుమ్మడే
ఆలమంద ఎక్కడే కోతిమూక ఉన్నదే
॥ముద్దు కృష్ణుడే॥
ఆనాడు నాకున్న ఆరువేల భామల్లో
మీరిద్దరెవ్వరూ
మీలో నాముద్దుగుమ్మ ఎవ్వరూ॥
నువ్వా నా ముద్దుగుమ్మా... ఆ...
అయితే ఓ ముద్దు ఇమ్మా ఆహా..॥
ఇవ్వనా... ఇవ్వనా... ఇచ్చింది చాలునా
ఓహోహో కృష్ణుడు ఓ ముద్దుగుమ్మడు...॥
గానం : ఘంటసాల, పి.సుశీల, ఎస్.జానకి
పల్లవి :
నల్లవాడే... అమ్మమ్మా అల్లరి పిల్లవాడే (2)
చిన్నవాడే... ఓయమ్మా రాధకే చిక్కినాడే
లేదమ్మా లేదు రుక్మిణికే దక్కినాడే॥
చరణం : 1
వెన్నవంటి మనసున్న చిన్నవాడే
చిన్ననాటి నుండి నువ్వు కోరుకున్నవాడే॥
ప్రేమకే బానిసై పోతాడే
కాదమ్మా భక్తికే దాసుడై ఉంటాడే॥॥
చరణం : 2
నువ్వు వావి వరస ఉన్నదానివి
నువ్వు వలపు దోచుకున్న దానివి॥
మనసిచ్చి మాట పుచ్చుకొంటివి
నీ మనసిచ్చి మాట పుచ్చుకొంటివి
మంచితనముతో నువ్వు గెలుచుకొంటివి॥
చరణం : 3
రాధాకృష్ణులు కథలేనమ్మా...
వారు ఎన్నడూ ఆలుమగలు కాలేదమ్మా॥
రాధాకృష్ణుల ప్రేమే పవిత్రము
లోకానికే అది ఆదర్శము (2)
గోపాల బాలుడు... నీ ప్రేమలోలుడు
గోపాల కృష్ణుడు... నీపాలి దేవుడు॥
వాడు నీ వాడే... కాదు నీ వాడే...
కాదు నీ వాడే... కాడు కాడు...కానే కాడు...
గానం : పి.సుశీల, ఎస్.జానకి