hE rAkhI rAkhI - హే... రాఖీ రాఖీ
చిత్రం : రాఖీ(rAkhI) (2006),రచన : సిరివెన్నెల
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గానం : మమతా మోహన్‌దాస్, దేవిశ్రీ
సాకీ :
ఇందిందిరానందమిది
ఇందీవరమరందమిది
అందాల సందోహమిది
సంధాన సన్నాహమిది
పల్లవి :
హే... రాఖీ రాఖీ
రాఖీ నా కవ్వసాకీ
నీకే గురిపెడుతుందే ఈ కన్నె తుపాకీ
హే... లడికీ లడికీ లడికీ
నా ఆంధ్రా లడికీ
దూసుకు వస్తున్నావే నువు నా ఒళ్లోకి
వెళ్లకు ఊర్లోకి ఒంటరిగా ఊరేగి
వందలకొద్దీ వర్ణాలద్ది ఎగబడదా పైకి
హోయ్ సొంపుల సుడిలోకి
దింపావే సారంగి
ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నా
నిండారా మునిగి
హే... రావా రావా రావా
రెక్కల గుర్రం ఎక్కి
ఎత్తుకుపోవా నీతో చక్క లోకంలోకి
హే రావే రావే రావే గువ్వా గుండెల్లోకి
సరదా తీరుస్తాలే దిగవే రంగంలోకి॥॥
చరణం : 1
హే... సింహంలా దూకి
నువ్వొచ్చేసరికి
జింకల్లే సిగ్గంతా పోదా చెట్టెక్కి
కవ్విస్తూ కులికే నువ్వేసే వలకి
చిట్టెలుకై చిక్కానే మత్తే నెత్తెక్కి
హే... సాహసానికి మొక్కి
సంతోషంగా చేజిక్కి
సొంత సొమ్మైవస్తా ఒళ్లోకి
ఆనందంగా బందీ కానా నీ కౌగిలికి
ఆధారంగా అల్లుకుపోనా నీ ఆశలకి
ఆహారంగా స్వాహా కానా నీ ఆకలికి
అహా ఓహో అంటానయ్యో నీ ఆవిరికి॥
చరణం : 2
హో... దా దా దా దరికి ధీమాగా ఉరికి
దాపరికం ఆగేనా నీ దాదాగిరికి
గారంగా దొరికి అందే సుందరికి
దాసోహం అయిపోనా
నా దాహం పెరిగి
దాడి చేస్తే దొరికి
దడ పుట్టించే మగసిరికి
ఓడిపోతా ఆపేయ్ అడ్డంకి... ఓ...
అయ్యో అయ్యో
ఏమయ్యిందో బాలామణికి
ఒళ్లో ఉయ్యాలెయ్యాలేమో కేరింతలకి
హే... తయ్యారయ్యే
ఉన్నానయ్యో నీ తాకిడికి
హే... వస్తానంటే ఇస్తా
కన్యాదానం తమకి ॥॥