Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

kannula lOgililO - కన్నుల లోగిలిలో

చిత్రం : రాజా(rAjA) (1999)
రచన : సిరివెన్నెల
సంగీతం : యస్.ఎ.రాజ్‌కుమార్
గానం : ఉన్నికృష్ణన్, చిత్ర


పల్లవి :
ఆ... ఆ... లలలాలలా... లలలాలలా
కన్నుల లోగిలిలో వెన్నెల విరిసింది
చల్లని జాబిలితో స్నేహం కుదిరింది
చెలిమి తోడుంటే చాలమ్మా
లేనిది ఏముంది
ఆశ చిటికేస్తే చాలమ్మా
అందనిదేముంది
కన్నుల లోగిలిలో వెన్నెల విరిసింది
చల్లని జాబిలితో స్నేహం కుదిరింది
చరణం : 1
గున్నమామి గొంతులో తేనెతీపి
నింపుతూ కోయిలమ్మ చేరుకున్నది
ఎండమావి దారిలో పంచదార
వాగులా కొత్తపాట సాగుతున్నది
ఒంటరైన గుండెల్లో ఆనందాల
అందెలతో ఆడే సందడిది
అల్లిబిల్లి కాంతులతో ఏకాంతాల
చీకటిని తరిమే బంధమిది
కల చెరగని కలలను చూడు
కంటికి కావాలి నేనుంటా
కల తరగని వెలుగులు నేడు
ఇంటికి తోరణమనుకుంటా
కన్నుల లోగిలిలో వెన్నెల విరిసింది
చల్లని జాబిలితో స్నేహం కుదిరింది
చరణం : 2
పంచుకున్న ఊసులూ పెంచుకున్న
ఆశలూ తుళ్లితుళ్లి ఆడుతున్నవి
కంచెలేని ఊహలే పంచవన్నె గువ్వలై
నింగి అంచు తాకుతున్నవి
కొత్తజల్లు కురిసింది బ్రతుకే
చిగురు తొడిగేలా వరమై ఈవేళ
వానవిల్లు విరిసింది మిన్ను మన్ను
కలిసేలా ఎగసే ఈవేళ
అణువణువును తడిపిన ఈ తడి
అమృతవర్షిణి అనుకోనా
అడుగడుగున పచ్చని బాటను
పరిచిన వనమును చూస్తున్నా
//కన్నుల//

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |