Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

keraTAniki AarATam - కెరటానికి ఆరాటం

చిత్రం : జీవనతీరాలు (jeevana teerAlu) (1977)
రచన : డా॥సి.నారాయణరెడ్డి
సంగీతం : చక్రవర్తి
గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల


పల్లవి :
కెరటానికి ఆరాటం తీరం చేరాలని
తీరానికి ఉబలాటం
ఆ కెరటం కావాలని ॥
ఎందుకో ఈ ఆరాటం...
అందుకే అందుకే ఆ ఉబలాటం...॥
చరణం : 1
కురులపై మెరిసే చినుకులు
ఆణిముత్యాలై
తనువుపై కురిసే చినుకులు
తడితడి ముచ్చటలై
మది లోపలి తెరతీసి
మారాము చేస్తుంటే (2)
పదునైన కోరిక ఏదో
పెదవినే గురి చూస్తుంది॥
చరణం : 2
ఏమి వెన్నెల ఎంతకూ
మన ఇద్దరి పైనే పడుతున్నది
తనకు దాహం వేసిందేమో
మనలనల్లరి పెడుతున్నది
ఎంతెంత దగ్గరగా ఇద్దరమూ ఉన్నా
మరికాస్త ఇంకాస్త ఒదిగిపొమ్మని
మౌనంగా ఉరుముతున్నది
వెన్నెల ఉరుముతున్నది॥
చరణం : 3
ఇది వసంతమని తెలుసు
కోయిల పాటలకు
ఇదే మూలమని తెలుసు
తీయని పంటలకు
లలిత లలిత యువ పవన చలిత
పల్లవ దళాలలోన
రమణీయ కుసుమ రమణీ రంజిత
భ్రమర గీతిలోనా
నవనవలాడే అనుభవమేదో...
నన్నే అలగా మలచుకున్నది... (2)
అందుకే ఈ ఆరాటం...
ఇందుకే ఇందుకే ఆ ఉబలాటం...॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |