Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

pillagAli allari - పిల్లగాలి అల్లరి

చిత్రం : అతడు(ataDu) (2005)
రచన : సిరివెన్నెల
సంగీతం : మణిశర్మ
గానం : శ్రేయాఘోషల్


పల్లవి :
పిల్లగాలి అల్లరి ఒళ్లంత గిల్లి
నల్లమబ్బు ఉరిమేనా (2)
కళ్లెర్రజేసి మెరుపై తరిమేనా
ఎల్లలన్నీ కరిగి
జల్లుమంటు ఉరికి
మా కళ్లలో... వాకిళ్లలో...
వేవేల వర్ణాల వయ్యారి జాణ
అందమైన సిరివానా ముచ్చటగా
మెరిసే సమయాన ॥
చరణం : 1
మౌనాల వెనకాలా వైనాలు తెలిసేలా
గారంగా పిలిచేనా
ఝల్లుమంటు గుండెలోన
తుంటరిగా తుళ్లుతున్న థిల్లానా ॥
ఇంద్రజాలమై వినోదాల సుడిలో
కాలాన్ని కరిగించగా
చంద్రజాలమై తరంగాల ఒడిలో
ఏళ్లన్నీ మురిపించగా
తారలన్నీ తోరణాలై
వారాల ముత్యాల హారాలయ్యేనా
చందనాలు చిలికేనా ముంగిలిలో
నందనాలు విరిసేనా॥
చరణం : 2
నవ్వుల్లో హాయి రాగం...
మువ్వల్లో వాయు వేగం...
ఏమైందో ఇంతకాలం...
ఇంతమంది
బృంద గానం...
ఇవ్వాళే పంపెనేమో ఆహ్వానం...॥
పాలవెల్లిగా సంతోషాలు చిలికే
సరదా సరాగాలుగా
స్వాతి జల్లుగా స్వరాలెన్నో పలికే
సరికొత్త రాగాలుగా
నింగిదాక పొంగిపోగా
హోరెత్తిపోతున్న గానా బజానా
చెంగుమంటు ఆడేనా చిత్రంగా
జావళీలు పాడేనా ॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |