rAdhaku nIvErA prANam - రాధకు నీవేరా ప్రాణం
చిత్రం : తులాభారం(tulAbhAram) (1974)రచన : రాజశ్రీ, సంగీతం : సత్యం
గానం : పి.సుశీల
25 June - నేడు శారద బర్త్‌డే
(SArada Birthday)
పల్లవి :
రాధకు నీవేరా ప్రాణం
ఈ రాధకు నీవేరా ప్రాణం
రాధాహృదయం మాధవనిలయం (2)
ప్రేమకు దేవాలయం...
ఈ రాధకు నీవేరా ప్రాణం (2)
చరణం : 1
నీ ప్రియ వదనం వికసిత జలజం
నీ దరహాసం జాబిలి కిరణం॥ప్రియ॥
నీ శుభచరణం... ఈ రాధకు శరణం
నీ శుభచరణం ఈ రాధకు శరణం॥
చరణం : 2
బృందావనికి అందము నీవే
రాసక్రీడకు సారథి నీవే॥
యమునాతీరం...
యమునాతీరం రాగాల సారం॥
Special Note:
శారద 1945 జూన్ 25న గుంటూరు జిల్లాలోని తెనాలిలో జన్మించారు. ఆమె అసలు పేరు తాడిపర్తి సరస్వతి. 1955లో ‘కన్యాశుల్కం’ సినిమాలో బాలనటిగా సినీరంగ ప్రవేశం చేశారు. దాదాపు 1961 వరకు బాలనటిగా ఉన్న శారద తర్వాత హాస్యనటిగా పలు పాత్రలు ధరించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో దాదాపు 300పైగా చిత్రాలలో నటించారు. ఉత్తమ నటిగా మూడు సార్లు ‘ఊర్వశి’ అవార్డును అందుకున్నారు. మరెన్నో సినీ అవార్డులు ఆమెను వరించాయి.