dEkhlOrE sAlA E rAth - దేఖ్‌లోరే సాలా ఏ రాత్
చిత్రం : ఈగ (2012), రచన : రామజోగయ్యశాస్త్రిసంగీతం : ఎం.ఎం.కీరవాణి, గానం : దీపు, రాహుల్ సిప్లీగంజ్, శ్రావణ భార్గవి, చైత్ర
పల్లవి :
దేఖ్‌లోరే సాలా ఏ రాత్ ఛా గయీ
తేరే ద్వార్ పే తేరీ మౌత్ ఆగయీ
గయీగయీగయీగయీగయీగయీగ
మై నేమ్ ఇజ్ నాని నేనీగనెతై కానీ
నీ గుండెల్లో పేలనున్న
న్యూక్లియర్ మిసైల్‌ని॥నేమ్॥
నీ రేంజ్ పెద్దదవనీ నా సైజ్ చిన్నదవనీ
నీ కింగ్‌డమ్‌నే కూల్చకుంటే
కానురా మగాణ్ని
ఈగ ఈగ ఈగ యుముడి మెరుపుతీగ
ఈజీ ఈజీ ఈజీగా తేరీ జాన్ లేగా ॥
చరణం : 1
అణువంతే ఉన్నా అగ్గిరవ్వలోన
అడవినైన కాల్చే కసి నిప్పు దాగి లేదా
చిటికంతే ఐనా చినుకు బొట్టులోన
పుడమినైన ముంచే పెనుముప్పు పొంచి లేదా
Isn't the universe an atom
before the big bang
ఇల్లలికే ఈగ యే ముఝే క్యా కరేగా
అని యమా కేర్ ఫ్రీగా నువ్వు ఆవులించేలోగా
నీ శ్వాసలోన దూరిపోనా బయో వైరస్‌లాగ॥
యమ అర్జెంటుగా పూర్తిచేయవలసిన
పనులున్నాయ్
పదే పది పదే పది...
వన్ నిన్ను చంపడం... టూ నిన్ను చంపడం
త్రీ నిన్ను చంపడం... ఫోర్ నిన్ను చంపడం
ఫైవ్ నిన్ను చంపడం... సిక్స్ నిన్ను చంపడం
సెవెన్ నిన్ను చంపడం...
ఎయిట్ నిన్ను చంపడం...
నైన్ నిన్ను చంపడం...
టెన్ నిన్ను ముసిరి ముసిరి ముసిరి
ముసిరి తరిమి తరిమి తరిమి తరిమి
పొడిచి పొడిచి పొడిచి చంపడం
చరణం : 2
రెప రెప రెప రెక్కలను విదిలిస్తాగా
నీ చెవుల్లోన మరణరాగా వినిపిస్తాగా
సూసైడ్ బాంబర్నై నీ పైకి దూసుకొస్తా
బై హుక్ ఆర్ క్రుక్
నిన్ను చంపి మరోసారి చస్తా
ఒక్కసారి చచ్చినాక ఇంకో చావు లెక్కా
ఇల్లలికే ఈగ యే ముఝే క్యా కరేగా
అని ఆలోచించేలోగా నీ ఆయువున్న జాగా
తగలబెట్టి ఎగిరిపోనా తారాజువ్వులాగా॥॥