aligitivA sakhI - అలిగితివా సఖీ
చిత్రం : శ్రీకృష్ణార్జునయుద్ధం (srIkrishnArjuna yuddam)(1963)రచన : పింగళి నాగేంద్రరావు, పద్య రచన : నంది తిమ్మన
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు, గానం : ఘంటసాల
18 January - నేడు ఎన్.టి.ఆర్. వర్ధంతి(NTR death anniversary) పల్లవి :
ప్రియ మారగ నీ దాసుని ఏల జాలవా
అలిగితివా సఖీ ప్రియా కలత మానవా
చరణం : 1
లేని తగవు నటింతువా
మనసు తెలియనెంచితివా (2)
ఈ పరీక్షమాని ఇంక దయను జూడవా
అలిగితివా సఖీ ప్రియా కలత మానవా
చరణం : 2
నీవె నాకు ప్రాణమనీ నీ యానతి మీరనని (2)
సత్యాపతి నా బిరుదని నింద ఎరుగవా
అలిగితివా సఖీ ప్రియా కలత మానవా
చరణం : 3
ప్రియురాలివి సరసనుండి విరహమిటుల విధింతువా (2)
భరియింపగ నా తరమా కనికరించవా
పద్యం :
నను భవదీయదాసుని మనంబున నెయ్యపు కిన్కబూని తా
చిన యది నాకు మన్ననయ చెల్వగు నీ పద పల్లవంబు మ
త్తను పులకాగ్రకంటకవితానము తాకిన నొచ్చునంచు నే
ననియెద అల్కమానవుకదా ఇకనైన అరాళ కుంతల !