nA jIvana sandhyA - నా జీవన సంధ్యా
చిత్రం : అమరదీపం(amaradIpam) (1977)రచన : వేటూరి, సంగీతం : సత్యం
గానం : రామకృష్ణ, పి.సుశీల
20 January - నేడు కృష్ణంరాజు బర్త్‌డే (KrishnamrAju Birthday)
పల్లవి :
ఒక దేవత ఉదయించింది
ఆ రూపమే అపురూపమై
అమరదీపమై వెలిగింది॥జీవన॥
చరణం : 1
శిలకే కదలిక రాగా
శిల్పమే కదలి ఆడింది
గరిసా సదపమా గమద మదని
దనిరిని గరిగరిసా
సదసదపా మపగా
కళకే కళగా విరిసి
నా కల నిజమై పండింది॥॥
ఆరు ఋతువుల ఆమని కోయిల
మనసే ఎగసి పాడింది॥జీవన॥
చరణం : 2
పొద్దుపొడుపులో అరుణిమలే
చెలి దిద్దు తిలకమై చివురించే
ఇంద్రధనుస్సులో రిమజిమలే
చెలి పైట జిలుగులే సవరించే
ఆ చల్లని చూపుల
ఊపిరి సోకిన ఆ...
ఆ చల్లని చూపుల ఊపిరి సోకిన
వెదురు వేణువై పలికింది॥జీవన॥
చరణం : 3
పలుకే పాడని పాట
చిరునవ్వు పూలకే పూత ॥
నడకే నెమలికి ఆట
లే నడుము కలలకే కవ్వింత
కలలుగన్న నా శ్రీమతి రాగా
ఈ బ్రతుకే పరిమళించింది॥జీవన॥