ententa dUram - ఎంతెంత దూరం
చిత్రం : ఎటో వెళ్లిపోయింది మనసు(eTO veLlipOyindi manasu) (2012)రచన : అనంత శ్రీరామ్
సంగీతం : ఇళయరాజా, గానం : కార్తీక్
పల్లవి :
అంతంత చేరువై నీతో ఉన్నా
హే హే... ॥
ఎంతొద్దన్నా ఇంతొద్దన్నా
అంతంతా నీ సొంతమైనా
నే నిన్ను ఎపుడై రారమ్మంటానా
నేనెపుడై రారమ్మంటానా
నీ నా నుండే నిన్నే పోనిస్తానా ॥
చరణం : 1
పొద్దున్నైతే సూర్యుడినై వస్తా
వెచ్చంగా నిద్దురలేపి ఎన్నో చూపిస్తా
సందెల్లోనచంద్రుణై్న వస్తా
చల్లంగ జోకొట్టేసి స్వప్నాలందిస్తా
మధ్యాహ్నంలో దాహాన్నై మధ్య మధ్య
మోహాన్నై వెంటుండి వెంటాడుతా
రోజు రోజు ఇంతే ఏ రోజైనా ఇంతే
నీడై జాడై తోడై నీతో వస్తానంతే
॥నిన్ను ఎపుడై॥
చరణం : 2
అద్దంలోన నేనే కనిపిస్తా
అందాల చిందుల్లోన పూవై వినిపిస్తా
చుట్టూ ఉంది నేనే అనిపిస్తా
ఆకాశం హద్దుల్లోనూ ఉన్నా అడ్డొస్తా
మబ్బుల్లో మాటేసి వెన్నెల్లో వాటేసి
ప్రాణాన్ని ముద్దాడుతా
ఏ జన్మైనా ఇంతే పైలోకానా ఇంతే
ఆది అంతం అన్నీ నేనే అవుతా అంతే
॥నిన్ను ఎపుడై॥