kOTikOTi tArallOna - కోటి కోటి తారల్లోన
చిత్రం : ఎటో వెళ్లిపోయింది మనసు(eTO veLlipOyindi manasu) (2012)రచన : అనంత శ్రీరామ్
సంగీతం : ఇళయరాజా, గానం : కార్తీక్
పల్లవి :
నీ మనస్సులో నేనుంటానే ॥కోటి॥
నీటి మీద ఆ కైలాసం తేలకుండా ఉన్నన్నాళ్లు
నీ తపస్సు నే చేస్తుంటానే
గాలిలోన ఆరోప్రాణం కలవకుండా ఉన్నన్నాళ్లు (2)
నిన్ను నేనే ఆరాధిస్తా నీకోసమారాతీస్తా॥కోటి॥
చరణం : 1
ఏడు వింతలున్నన్నాళ్లు నీకు తోడునై ఉంటా
పాలపుంత ఉన్నన్నాళ్లు నన్ను పంచి నేనుంటా
పాదమున్నన్నాళ్లు నీ నడకలాగ నేనుంటా
కోరుకున్న చోటల్లా చేర్చుతా
చేతులున్నన్నాళ్లు నీ గీతలాగ నేనుంటా
జాతకాన్ని అందంగా మార్చుతా
అంకెలింక ఉన్నన్నాళ్లు నీ వయస్సు సంఖ్యవనా
సంకెలల్లే బంధిస్తుంటా వంద ఏళ్లిలా ॥కోటి॥
చరణం : 2
భాషనేది ఉన్నన్నాళ్లు నిన్ను పొగిడి నేనుంటా
ధ్యాసనేది ఉన్నన్నాళ్లు నిన్ను తలచి నేనుంటా
వెలుగు ఉన్నన్నాళ్లు నీ వెనుక నేను వేచుంటా
నువ్వేటేపు వెళుతున్నా సాగనా
మసక ఉన్నన్నాళ్లు నీ ముందుకొచ్చి నుంచుంటా
నువ్వెలాగ ఉన్నావో చూడనా
నీకు దూరమున్నన్నాళ్లు జ్ఞాపకంగా వెంటుంటా
మళ్లీ మళ్లీ గుర్తొస్తుంటా ముందు జన్మలా॥కోటి॥