Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

vayasA elA - వయసా ఎలా

పల్లవి :
వయసా ఎలా మోయగలవీ హాయి భారము
మనసా ఎలా చేయగలవో రాయబారము
అతడినీ అడిగినావే...॥
చరణం : 1
గుండెల సవ్వడి శ్రుతిలయ మార్చెను
ఎందుచేతనో...
ఆతడి అడుగుల సడి అనిపించెను ఏమిసేతునో
నిలువున నిమిరిన నవ పరిమళములు ఎంత వెచ్చనో
ఆతడి శ్వాసలు ఈ చలిగాలులు వెంట తెచ్చెనో
నిన్న మొన్నటి నేస్తమా నా సమస్తం స్వంతమా
పరువమా అడిగినావే॥
చరణం : 2
దోసిలితోనే తీసిన తీయని ఏటి నీటిలో
తోచిన సంగతి పెదవికి తాకితే ఎన్ని నవ్వులో
ఎగువన ఆతడు తాగిన నీరిది అన్న ఊహలో
తడిమిన ఆతడి తడి తాకిడిలో ఎన్ని ముద్దులో
స్నానమింక సాగునా సిగ్గులింక దాగునా
బిడియమా అడిగిరావే॥

చిత్రం : సుబ్బారాయుడు పెళ్లి(subbArAyuDu peLli) (1992), రచన : సిరివెన్నెల
సంగీతం : సాలూరి వాసూరావు, గానం : కె.ఎస్.చిత్ర

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |