marI antagA mahA(svsc) - మరీ అంతగా మహా
చిత్రం : సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013)రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం : మిక్కీ జె. మేయర్, గానం : శ్రీరామచంద్ర
పల్లవి :
మొహం ముడుచుకోకలా
పనేం తోచక పరేషానుగా గడబిడ పడకు అలా
మతోయేంతగా శ్రుతే పెంచక
విచారాల విలవిల
సరే చాలిక అలా జాలిగా తికమక పెడితే ఎలా
కన్నీరై కురవాలా
మనచుట్టూ ఉండే లోకం తడిసేలా
ముస్తాబే చెదరాలా నినుచూడాలంటే
అద్దం జడిసేలా... ఓ...
ఎక్కిళ్లే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా
మరెందుకు గోల
అయ్యయ్యో పాపం అంటే ఏదో లాభం
వస్తుందా వృథాప్రయాస పడాలా॥అంతగా॥
చరణం : 1
ఎండలను దండిస్తామా వానలను నిందిస్తామా
చలిని ఎటో తరిమేస్తామా ఛీ పొమ్మనీ
కస్సుమని కలహిస్తామా ఉస్సురని
విలపిస్తామా రోజులతో రాజీ పడమా సర్లెమ్మనీ
సాటి మనుషులతో మాత్రం సాగనని
ఎందుకు పంతం
పూటకొక పేచీపెడుతూ
ఏం సాధిస్తామంటే ఏం చెపుతాం॥
చరణం : 2
చెమటలేం చిందించాలా
శ్రమపడేం పండించాలా
పెదవిపై చిగురించేలా చిరునవ్వులు
కండలను కరిగించాలా
కొండలను కదిలించాలా
చచ్చి చెడి సాధించాలా సుఖశాంతులు
మనుషులనిపించే రుజువు
మమతలను పెంచే ఋతువు
మనసులను తెరిచే హితవు
వందేళ్లైనా వాడని చిరునవ్వు॥