Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

mUDumullu aEsinAka - మూడుముళ్లు ఏసినాక

వేటూరి స్పెషల్ - vETUri Special

చిత్రం : శుభసంకల్పం(Subhasamkalpam) (1995)
రచన : వేటూరి
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
గానం : బాలు, శైలజ
పల్లవి :
మూడుముళ్లు ఏసినాక చాటులేదు
మాటులేదు గూటిబైటే గుట్టులాట
ఏడు అంగలేసినాక ఎన్నెలింట కాలుబెట్టి
పాడుకుంట ఎంకిపాట
ఆకుపచ్చ కొండల్లో... గోరువెచ్చ గుండెల్లో (2)
ముక్కుపచ్చలారబెట్టి ముద్దులంటా॥
చరణం : 1
హొయ్... పుష్యమాసమొచ్చింది
భోగిమంటలేసింది
కొత్తవేడి పుట్టింది గుండెలోన
రేగుమంట పూలకే రెచ్చిపోకు తుమ్మెదా
కాచుకున్న ఈడునే దోచుకుంటే తుమ్మెదా
మంచుదేవతొచ్చిందా మంచమెక్కిపోతుందా
ఆహా ఆహా ఆహా ఆహా
వణుకులమ్మ తిరుణాళ్లే ఓరి నాయనా
సీతమ్మోరి సిటికన ఏలు
సిలకతొడిగితే సిగ్గులై
రాములోరు ఆ సిలక కొరికితే
సీతమ్మోరి బుగ్గలై ॥
చరణం : 2
వయసుచేదు తెలిసింది
మనసు పులుపుకోరింది
చింతచెట్టు వెతికింది చీకటింట
కొత్తకోరికేమిటో చెప్పుకోవె కోయిలా
ఉత్తమాటలెందుకు తెచ్చుకోర ఊయలా
ముద్దువాన వెలిసింది పొద్దుపొడుపు తెలిసింది
వయసు వరసమారింది ఓరి మన్మథా
మూడుముళ్లు జతలోన ముగ్గురైన ఇంటిలోన
జోరుకాస్త తగ్గనీర జోజోజో
జోజోజో జోజోజో జో... (2)

ఆ ఆ ఆ.... ఆ ఆ ఆ... ఆ...
చినుకులన్నీ కలిసి చిత్ర కావేరి
చివరికా కావేరి కడలి దేవేరి
క డలిలో వెతకొద్దు కావేరి నీరు
కడుపులో వెతకొద్దు కన్నీరు కారు
గుండెలోనే ఉంది గుట్టుగా గంగ... నీ గంగా
ఎండమావుల మీద ఎందుకా బెంగ
రేవుతో నావమ్మకెన్ని ఊగిసలు
నీవుతో నా కన్నీటి ఊయలలు

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |