nandikoNDa vAgullOna - నందికొండ వాగుల్లోన
వేటూరి స్పెషల్ - vETUri Special
చిత్రం : గీతాంజలి(gItAnjali) (1989), రచన : వేటూరిసంగీతం : ఇళయరాజా, గానం : బాలు చిత్ర
పల్లవి :
నల్లతుమ్మ నీడల్లో
చంద్రవంక కోనల్లోన సందెపొద్దు చీకట్లో
నీడల్లే ఉన్నా... నీతో వస్తున్నా...
నా ఊరేది... ఏది! నా పేరేది... ఏది!
నా దారేది... ఏది! నావారేరి... ఓ ఓ ఓ...
చరణం : 1
ఏనాడో ఆరింది నా వెలుగు
నీ దరికే నా పరుగు
ఆనాడే కోరాను నీ మనసు
నీ వరమే నన్నడుగూ
మోహినీ పిశాచి నా చెలిలే...
శాకినీ విషూచి నా సఖిలే (2)
విడవకురా వదలనురా ప్రేమేరా నీ నీడ॥
భూతప్రేత పిశాచ భేతాళ ఢాకినీ
జడంభం భం భం భం భం...॥
నీ కబళం పడతా నిను కట్టుకుపోతా
నీ భరతం పడతా
నిను పట్టుకుపోతా ఆ...ఓ...
చరణం : 2
ఢాకిని ఢక్కా ముక్కలచెక్క
దంబో తినిపిస్తాన్
తాటకివనిపిస్తే తాటలు వలిచేస్తాన్
గుంటరి నక్క డొక్కలొ చొక్కా
అంభో అనిపిస్తాన్
నక్కలు తొక్కిస్తాన్ చుక్కలు తగ్గిస్తాన్
రక్కసి మట్టా తొక్కిసగుట్టా పంబే దులిపేస్తాన్
తీతువు పిట్ట ఆయువు చిట్టా నేనే తిరగేస్తాన్॥
అస్త్రాయ ఫట్ ఫట్ ఫట్
వస్తాయా ఝట్ ఝట్ ఝట్ ఫట్
కోపాలా మసజసతతగ శార్దులా...॥