chilipi kanula - చిలిపి కనుల
చిత్రం : కులగోత్రాలు(kulagOtrAlu) (1962)
రచన : డా॥సి.నారాయణరెడ్డిసంగీతం : సాలూరి రాజేశ్వరరావు
గానం : ఘంటసాల, పి.సుశీల
06 March - నేడు కృష్ణకుమారి పుట్టినరోజు(Krishna kumari Birthday)
పల్లవి :
చిలిపి కనుల తీయని చెలికాడా
నీ నీడను నిలుపుకొందురా
నిలుపుకొందురా వెల్గుల మేడ
నీలి కురుల వన్నెల జవరాలా
నీ కౌగిట నిలుపుకొందునే పూల ఉయ్యాల
చరణం : 1
కనుల ముందు అలలు పొంగెను... ఓ...
మనసులోన కలలు పండెను॥ కనుల ॥
అలలే కలలై... కలలే అలలై... (2)
గిలిగింతలు సలుపసాగెను॥ చిలిపి ॥
చరణం : 2
కొండలు కో... యని పిలిచినవి... ఆ...
గుండెలు హో... యని పలికినవి... ఆ...॥ కొండలు ॥
కోరికలన్నీ బారులు తీరి (2)
గువ్వలుగా ఎగురుతున్నవి॥ నీలి ॥
చరణం : 3
జగము మరచి ఆడుకొందమా... ఆ...
ప్రణయగీతి పాడుకొందమా... ఆ...॥ జగము॥
నింగీనేలా కలసిన చోట (2)
నీవు నేను చేరుకొందమా... ఆ...॥ చిలిపి ॥