Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

Em pillO tattara bittara - ఏం పిల్లో తత్తర


చిత్రం : ఆత్మీయులు(Atmeeyulu) (1969)

రచన : కొసరాజు
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు
గానం : పిఠాపురం నాగేశ్వరరావు
05 March - నేడు పిఠాపురం నాగేశ్వరరావు వర్ధంతి

పల్లవి :
ఏ పిల్లా...
ఏం పిల్లో తత్తర బిత్తరగున్నావు
ఎందుకో గాభర గీభర తిన్నావు॥పిల్లో॥
చిలిపి నవ్వులతో కవ్వించు మోము
చిన్నబోయింది ఈనాడదేమో॥పిల్లో॥
చరణం : 1
అందనికొమ్మలకు నిచ్చెనలేశావు అందనికొమ్మలకు నిచ్చెనలేశావు
అయ్యో గాలిలోన మేడలు కట్టావు
వలచిన పేదవాణ్ణి చులకన చేశావు
బులుపేగాని వలపేలేని
టక్కరివాళ్లనమ్మి చిక్కులపాలైనావు॥పిల్లో॥
చరణం : 2
నీ ఒయ్యారపు వాలు చూపులతో
ముసలివాణ్ణి ఊరిస్తున్నావు
॥ఒయ్యారపు॥
పడుచువాణ్ణి చేసేస్తున్నావు
బంగరు బొమ్మా పలుకవటమ్మా
మోజు దీర్చవే ముద్దులగుమ్మా॥పిల్లో॥
చరణం : 3
నీపై కన్నేసే వేషాలేశాను (2)
మెత్తని నీ మనసు గాయం చేశాను
చేసిన తప్పులకు
చెంపలేసుకుంటాను
నువు దయజూపితే నను పెళ్లాడితే
నిందలు వేసినాళ్ల నోళ్లు
బందు చేస్తాను॥పిల్లో॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |