Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

mEghAllO sannAyi - మేఘాల్లో సన్నాయి

చిత్రం : సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు(SVSC)
seetamma vAkiTlO sirimallE cheTTu (2013)
రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం : మిక్కీ జె. మేయర్
గానం : కార్తీక్, శ్రీరామచంద్ర, బృందం

పల్లవి :
మేఘాల్లో సన్నాయి రాగం మోగింది
మేళాలు తాళాలు వినరండి
సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది
శ్రీరస్తు శుభమస్తు అనరండి
అచ్చ తెలుగింట్లో పెళ్లికి అర్థం చెప్పారంటూ
మెచ్చదగు ముచ్చట ఇది అని
సాక్ష్యం చెబుతామంటూ
జనులంతా జై కొట్టేలా జరిపిస్తామండి
అందాల కుందనపు బొమ్మవని
జత చేరుకున్న ఆ చందురిని
వందేళ్ల బంధమై అల్లుకుని
చెయ్యందుకోవటే ఓ రమణి
చరణం : 1
ఇంతవరకెన్నో చూశాం
అనుకుంటే సరిపోదుగా
ఎంత బరువంటే మోసే దాకా తెలియదుగా
ఇంతమందున్నాంలే అనిపించే
బింకం చాటుగా
కాస్తై కంగారు ఉంటుందిగా
నీకైతే సహజం తీయని బరువై
సొగసించే బిడియం
పనులెన్నో పెట్టి మాటలలో వచ్చిందే
ఈ సమయం
మగాళ్లమైనా ఏం చేస్తాం సంతోషంగా మోస్తాం
ఘనవిజయం పొందాకే తీరిగ్గా గర్విస్తాం
'అందాల'
చరణం : 2
రామచిలకలతో చెప్పి రాయించామే పత్రిక
రాజహంసలతో పంపి ఆహ్వానించాంగా
కుదురుగా నిమిషం కూడా
నిలబడలేమే బొత్తిగా
ఏమాత్రం ఏచోట రాజీ పడలేక
చుట్టాలందరికీ ఆనందంతో కళ్లు చమర్చేలా
గిట్టని వాళ్లైనా ఆశ్చర్యంతో కన్నులు విచ్చేలా
కలల్లోనైనా కన్నామా కథలైనా విన్నామా
ఈ వైభోగం అపురూపం అనుకుంటారమ్మా
'అందాల'

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |