echchaTakOyi nI payanam - ఎచ్చటికోయి నీ పయనం
చిత్రం: అమరశిల్పి జక్కన(amaraSilpi jakkana) (1964)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావుగానం: ఘంటసాల
రచన: దాశరథి
ఎచ్చటికోయి నీ పయనం
ఏమిటోయి ఈ వైనం
ఏలనోయి ఈ ఘోరం
ఎవరిపైన నీ వైరం
పల్లవి :
మధురమైన జీవితాల కథ ఇంతేనా
ప్రేమికులకు విధియొసగిన
వరమింతేనా॥
చరణం : 1
నిను నమ్మిన నీ సతినే నమ్మలేకపోయావా?
శిలలను కరగించునీవు... శిలవే అయిపోయావా?॥
చరణం : 2
వెన్నెలతో విందుచేయు పున్నమ చంద్రుడవు నీవు
కళలు మాసి కాంతిబాసి... గ్రహణం పాలైనావా?॥
చరణం : 3
విరబూచిన చెట్టులాగా మురిసిపోవు నీ బ్రతుకే
వాడి మాడి మోడుబారి వన్నె మాసిపోయిందా?॥