nA kaNTi pApalO - నా కంటిపాపలో
చిత్రం : వాగ్దానం(vAgdAnam) (1961)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావుగానం: ఘంటసాల, పి.సుశీల
పల్లవి :
ఆమె: నా కంటిపాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా॥కంటిపాపలో॥
ఆ: ఈనాటి పున్నమి ఏనాటి పున్నమో
జాబిలి వెలిగేను మనకోసమే॥
అతడు: నెయ్యాలలో తలపుటుయ్యాలలో (2)
అందుకుందాము అందని ఆకాశమే॥కంటిపాపలో॥
చరణం : 2
అ: ఆ చందమామలో ఆనందసీమలో
వెన్నెల స్నానాలు చేయుదమా
॥చందమామలో॥
ఆ: మేఘాలలో వలపు రాగాలలో (2)
దూరదూరాల స్వర్గాల చేరుదామా॥కంటిపాపలో॥
చరణం : 3
ఆ: ఈ పూలదారుల ఆ నీలితారలు
తీయని స్వప్నాల తేలించగా ॥పూల॥
అ: అందాలను తీపి బంధాలను (2)
అల్లుకుందాము డెందాలు పాలించగా॥కంటిపాపలో॥