Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

tholivalapE theeyanidi - తొలివలపే తీయనిది

చిత్రం : యువరాజు (2000)


రచన : వేటూరి సుందరరామమూర్తి
సంగీతం : రమణగోగుల
గానం : హరిహరన్, చిత్ర, సునీత , రమణగోగుల

పల్లవి :రమణగోగుల: తేరారరే తేరరరా తేరారరే తేరరరా...
అతడు: తొలివలపే తీయనిది ఆ దాహం తీరనిది
కాలంలా కరిగిపోనిదీ తానంలా తిరిగిపోదది
తొలివలపే తీయనిది ఆ దాహం తీరనిది

చరణం : 1
అ: తేరారరే... ఆమె: తేరరరా
అ: వేదంలాగా లిపిలేనిది వేధిస్తున్నా సుఖమైనది
ఆ: ఓడిస్తున్నా గెలుపే అది ఓదార్చే ఓ పిలుపైనది
అ: చుక్కలనే నిలుపునది దిక్కులనే కలుపునది
ఆకాశం తానై ఉన్నది
ఆ: ఒక్కరిలో ఇద్దరది ఇద్దరిలో ఒక్కటది నీకోసం నేనై ఉన్నది
అ: తొలివలపే... ఆ బాధే...

చరణం : 2
ఆ: తేరారరే... అ: తేరరరా
అ: గుండెల్లోన గూడే ఇది గుచ్చే రోజామాలే అది
ఆ: మాటల్లోన మౌనం అది మనసుల్లోన ధ్యానం అది
అ: ఏ ఋణమో తెలియనిది ఏ వరమూ అడగనిది
ఏ మజిలీ చేరెనో అది
ఆ: ఎప్పటిదో ఎరుగనిది ఎన్నటికీ మరువనిది
ఓ కథలా చేరే కంచికి
అ: తొలివలపే తీయనిది... ఆ: ఆ బాధే తీరనిది
అ: ఎదకన్నా లోతుగుంటది... ఆ: బతుకల్లే తోడు ఉంటది
అ: తీరారరే... ఆ: తేరరరా
ఆ: తేరారరే... అ: తేరరరా

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |