Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

చిత్రం : సింధుభైరవి(sindhubhairavi) (1985)
రచన : రాజశ్రీ(rAjasri)
సంగీతం : ఇళయరాజా(iLayarAjA)
గానం : కె.జె.ఏసుదాస్(K .J. EsudAs)
10 January - నేడు కె.జె.ఏసుదాస్ బర్త్‌డే
( K .J. EsudAs Birth day )



పల్లవి :
రసమంజరీ...
సొగసైన కలికి సుఖకేళి పడతి
స్వరమధువు ప్రియ వధువు
కులుకుల కొలికి వలపుల చిలికి
అడుగిడె అభినవ రసమంజరి॥
చరణం : 1
స్వరమంగళ లలనా ఎద వీడగలనా
పరువాల స్మరణ
మరుజన్మం కరుణ
అను మెరుగుల దయచూడక
మనగలనా జ్వలనా
చెలి తపఃఫలం స్వయం సిద్ధం
చేకొన విడివడెనా
ముఖం దాచవలెనా... ఆ....
ముఖం దాచవలెనా
మృదుమధుర వదనా
నీ మోమందు పూర్ణేందు
ప్రభల్ కనగ
నా ఎడద సుఖానపడు॥
చరణం : 2
రూపం కనుటకు తొందర తొలగెను
తొలుత తోచ పరిపాటి
గంగను తలనిడి పార్వతి సతియని
శివుని వీడు ఒక జాతి
రామయదొక విధి కృష్ణయదొక విధి
భువిని చూడ సమనీతి
అచ్చట కలిమికి ఇచ్చట చెలిమికి
ఎవరు ఎవరు సరిజోడి
కన్నీర్పెరిగినచో... ఆ... ఆ...
కన్నీర్పెరిగిన కన్నుల సుముఖం
చక్కగ కనబడు ద్విరూపం
చినుకా తొలకరి చినుకా
చిలకా చిక్కని చిలకా
జలజల వలవల వలచిన చెలుడిటు
నిలువున విలపిలె
బ్రతుకున అడుగిడు చెలువా
Download Link:
Rasa Manjari_sindhu bhairavi.mp3

చిత్రం : పెళ్లినాటి ప్రమాణాలు(peLLinATi pramANAlu) (1958)
రచన : పింగళి నాగేంద్రరావు (pi~mgali nAgEndrarAo)
సంగీతం : ఘంటసాల (ghanTasAla)
గానం : ఘంటసాల (ghanTasAla), పి.లీల (P.Leela)


పల్లవి :
వెన్నెలలోనే వేడి ఏలనో
వేడిమిలోనే చల్లనేలనో
ఈ మాయ ఏమో జాబిలీ (2)
వెన్నెలలోనే విరహమేలనో
విరహములోనే హాయి ఏలనో
ఏమాయ ఏమో జాబిలీ
ఈ మాయ ఏమో జాబిలీ
చరణం : 1
మొన్నటికన్న నిన్న వింతగా
నిన్నటికన్న నేడు వింతగా
ఓహోహో ఓఓఓ...॥
నీ సొగసూ నీ వగలూ
హాయి హాయిగా వెలసేనే॥
చరణం : 2
రూపముకన్న చూపు చల్లగా
చూపులకన్న చెలిమి కొల్లగా
ఓహోహో ఓఓఓ...॥
నీ కళలూ నీ హొయలూ
చల్లచల్లగా విరిసెనే
వెన్నెలలోనే హాయి ఏలనో
వెన్నెలలోనే విరహమేలనో
ఈ మాయ ఏమో జాబిలీ
ఈ మాయె ఏమో జాబిలీ... ఆ...

Special Note:
జయంతి పిక్చర్ పతాకంపై 1958లో కె.వి.రెడ్డి నిర్మించి దర్శకత్వం వహించిన సాంఘిక చిత్రం ‘పెళ్లినాటి ప్రమాణాలు’. ఇది కె.వి.రెడ్డి దర్శకత్వంలో జమున నటించిన రెండవ సినిమా (మొదటి సినిమా దొంగరాముడు-1955). ఈ సినిమాకి కథ, మాటలు, పాటలు సమకూర్చినవారు పింగళి నాగేంద్రరావు. సంగీతం ఘంటసాల. వీరి కలయికలో వచ్చిన పాటలన్నీ ఎంతో ప్రజాదరణ పొందాయి. ఈ చిత్రంలోని పాటల ద్వారా అది మరొకసారి రుజువయ్యింది. ఈ సినిమా అఖండ విజయాన్ని సాధించి, నేషనల్ అవార్డును దక్కించుకుంది.

చిత్రం : నువ్వులేక నేనులేను (2002)
(nuvvulEka nEnulEnu)
రచన : కులశేఖర్(kulaSEkhar)
సంగీతం : ఆర్.పి.పట్నాయక్ (R.P. PatnAyak)
గానం : ఆర్.పి.పట్నాయక్(R.P. PatnAyak), కౌసల్య(kausalya)
08 January - నేడు తరుణ్ బర్త్‌డే


పల్లవి :
నిండు గోదారి కదా ఈ ప్రేమ
అందరికీ బంధువుగా ఈ ప్రేమ
రెండు హృదయాల కథే ఈ ప్రేమ
పెళ్లికిలా పల్లకిగా ఈ ప్రేమ
కోవెలలో హారతిలా
మంచిని పంచే ప్రేమ॥
చరణం : 1
ప్రేమ అన్నదీ ఎంత గొప్పదో మరీ
రాజు పేద బేధమంటు లేదు దీనికి
బ్రహ్మచారికీ బతుకు బాటసారికీ
ప్రేమదీపమల్లే చూపుతుంది దారినీ
మనసులు జత కలిపే
బంధం ఈ ప్రేమ
చెరితగ ఇల నిలిచే గ్రంథం ఈ ప్రేమ
ప్రేమే మదిలోన మరి
నమ్మకాన్ని పెంచుతుంది॥
చరణం : 2
ప్రేమ జోరునీ ఎవ్వరాపలేరనీ
ఆనక ట్టలాంటి హద్దులంటూ లేవని
ప్రేమ తప్పని అంటే ఒప్పుకోమనీ
గొంతు ఎత్తి లోకమంత చాటిచెప్పనీ
ప్రేమే తోడుంటే
నిత్యం మధుమాసం
తానే లేకుంటే బతుకే వనవాసం
ప్రేమే కలకాలం మనవెంట
ఉండి నడుపుతుంది ॥

Special Note:
తరుణ్ 1983 జనవరి 8న జన్మించారు. అమ్మ నటి రోజారమణి, తెలుగువారైన నాన్న చక్రపాణి ఒరియాలో నటుడు, నిర్మాత. చెల్లి అమూల్య. 1990లో వచ్చిన ‘మనసు మమత’ చిత్రంతో బాలనటుడిగా తెరంగేట్రం చేసిన తరుణ్ అదే ఏడాది చివరిలో మణిరత్నం తమిళ, తెలుగు భాషలలో తీసిన ‘అంజలి’ సినిమాలో నటించాడు. ఈ సినిమాకి తమిళంలో ఉత్తమ బాలనటుడిగా తరుణ్‌కు జాతీయ అవార్డు వచ్చింది. తర్వాత కొన్ని సినిమాలలో నటించినా, 2000 సంవత్సరంలో వచ్చిన ‘నువ్వేకావాలి’ సినిమాతో హీరోగా సక్సెస్ సాధించారు.