Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

eeswarA ni~mgi nEla - ఈశ్వరా నింగి నేల

చిత్రం : మనసులో మాట(manasulO mATa) (1999)
రచన : వేటూరి
సంగీతం : ఎస్.వి.కృష్ణారెడ్డి
గానం : ఉదిత్ నారాయణ్, బృందం
01 June - నేడు ఎస్.వి.కృష్ణారెడ్డి బర్త్‌డే


పల్లవి :
ఈశ్వరా నింగి నేల హాండ్‌షేక్ చేసిన
ఘనతే నీదిరా
ఈశ్వరా సూర్యచంద్రులనొక్కటి
చేసిన కథయే నీదిరా
తూర్పు పడమర ఫ్రెండ్‌షిప్ చేసిన
ఘటనే నీదిరా
వన్ ఇన్‌టూ ప్రాణేశ్వరా
వన్ ప్లస్ వన్ జీవేశ్వరా
ఆల్ ద బెస్ట్ ఆత్మేశ్వరా
ఆ మాటే ఆశీస్సురా
మండుటెండలు
మల్లెలు చేసిన ఈశ్వరా
ముళ్లు మెత్తని పూలుగ మార్చిన
ఈశ్వరా
జాన్‌దో సహోదరా జగడాలు లేవురా॥
చరణం : 1
కూచిపూడినడగొచ్చులే ఒసిబిస
హాలివుడ్‌లో తీయొచ్చులే లవకుశ
మడోనాకు నేర్పొచ్చులే పదనిస
కొండకేసి లాగొచ్చులే పురికొస
కోకిల పాటల్లో స్నేహమే
కొమ్మకు సన్నాయి
కంటికి రెప్పల్లే కాచిన
స్నేహం మనదోయి
జాన్‌దో సహోదరా జగడాలు లేవురా॥
చరణం : 2
పార్లమెంటునడగొచ్చులే పెళ్లికి
తాజ్‌మహల్‌నడగొచ్చులే విడిదికి
జాక్సనొస్తే అడగొచ్చులే జావళి
బాలమురళినడగొచ్చులే రాప్‌నీ
కురిసిన మబ్బుల్లో స్నేహమే
రంగుల హరివిల్లు
మురిసిన నవ్వుల్లో స్నేహమే
మల్లెలు వెదజల్లు
జాన్‌దో సహోదరా జగడాలు లేవురా॥

InATi IhAyi - ఈనాటి ఈ హాయి

చిత్రం : జయసింహ(jayasimha) (1955)
రచన : సముద్రాల జానియర్
సంగీతం : టి.వి.రాజు
గానం : ఘంటసాల, పి.లీల
31 May - నేడు సముద్రాల జానియర్ వర్ధంతి


పల్లవి :
ఈనాటి ఈ హాయి
కలకాదోయి నిజమోయి (2)॥
చరణం : 1
నీ ఊహతోనే పులకించిపోయే
ఈ మేను నీదోయి (2)
నీకోసమే ఈ అడియాసలన్నీ
నా ధ్యాస నా ఆశ నీవే కదా ॥
చరణం : 2
ఏ నోము ఫలమో ఏ నోటి వరమో
నీ ప్రేమ జవరాలా (2)
మనియేములే ఇక విరితావి లీల
మన ప్రేమకెదురేది లేదే సఖీ॥
చరణం : 3
ఊగేములే తులతూగేములే
ఇక తొలిప్రేమ భోగాలా (2)
మురిపాల తేలే మన జీవితాలు (2)
దరహాస లీలా విలాసాలులే॥


Special Note:
పూర్తిపేరు : సముద్రాల రామానుజాచార్యులు
జననం : 15-04-1923
జన్మస్థలం : పెదపులివర్రు గ్రామం, కృష్ణాతీరం
తల్లిదండ్రులు : రత్నమ్మ, సముద్రాల రాఘవాచార్యులు (సముద్రాల సీనియర్)
తోబుట్టువులు : తమ్ముడు వేంకట శేషాచార్యులు, చెల్లెళ్లు కుముద వల్లి తాయారు, అలివేలు మంగతాయారు
చదువు : బి.ఎస్సీ. (చెన్నైలో పచ్చయప్ప కాలేజీ)
వివాహం - భార్య :
16-10-1945 - ఆండాళమ్మ
పిల్లలు : ముగ్గురు కుమారులు (రంగపార్థసారథి, రాజగోపాల్, విజయ రాఘవాచార్యులు), నలుగురు కుమార్తెలు (రమాదేవి, యశోద, కీ.శే. నీల, శుభశ్రీ )
తొలిసినిమా : శాంతి (1952)
ఆఖరిపాట - సినిమా :
టైటిల్‌సాంగ్ - లక్ష్మణరేఖ (1975)
పాటలు : దాదాపు 150 చిత్రాలకు 300పైగా పాటలు
మాటలు అందించిన మొదటిచిత్రం :తోడుదొంగలు (1954)
చివరిచిత్రం : క్రాంతి (1981)
కథ-మాటలు-పాటలు అందించిన మొదటిచిత్రం : జయసింహ (1955)
ఇతరవిషయాలు : తండ్రిలాగానే చిన్నప్పటి నుండే సాహిత్యం, సంగీతం పట్ల మక్కువ ఏర్పరుచు కున్నారు. చెన్నై వాహినీ స్టూడియోలో శబ్దశాఖలో రికార్డిస్టుగా పనిచేశారు. ఘంటసాల, ఎన్‌టీఆర్‌లు సముద్రాల వారికి ఆప్తమిత్రులు. ఘంటసాల-సముద్రాల జూనియర్ కాంబినేషన్‌లో వచ్చిన గీతాలు హిట్‌గా నిలిచాయి. 1960 తర్వాత పాటల కన్నా సంభాషణలే ఎక్కువగా
రాశారు. విశ్వనాథనాయకుడు, సామ్రాట్ అశోక వంటి చిత్రాలకు స్క్రిప్టు అందించారు.
మరణం : 31-05-1985

rekkalu toDigi - రెక్కలు తొడిగి

చిత్రం : చుట్టాలొస్తున్నారు జాగ్రత్త(chuTTAlostunnAru jAgratta) (1980)
రచన : డా॥సి.నారాయణరెడ్డి
సంగీతం : ఎం.ఎస్.విశ్వనాథన్
గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల
31 May - కృష్ణ బర్త్‌డే(Krishna Birthday)


పల్లవి : రెక్కలు తొడిగి రెపరెపలాడి
రివ్వంటుంది కోరిక
దిక్కులు తోచక చుక్కలదారుల
చెలరేగింది వేడుక॥
వయసు దారి తీసింది
వలపు ఉరకలేసింది॥
మనసు వెంబడించింది
నిమిషమాగక॥
చరణం : 1
చెంతగా చేరితే...
చెంతగా చేరితే వింతగా ఉన్నదా
మెత్తగా తాకితే కొత్తగా ఉన్నదా (2)
నిన్న కలగా ఉన్నది
నేడు నిజమౌతున్నది (2)
అనుకున్నది అనుభవమైతే
అంతకన్న ఏమున్నది॥
చరణం : 2
కళ్లతో నవ్వకు...
కళ్లతో నవ్వకు ఝల్లుమంటున్నది
గుండెలో చూడకు గుబులుగా ఉన్నది
గుండెలో చూడకు గుబులుగా ఉన్నది
తొలిచూపున దాచింది
మలి చూపున తెలిసింది
ఆ చూపుల అల్లకతోనే
పెళ్లిపిలుపు దాగున్నది
వయసు దారి తీసింది
వలపు ఉరకలేసింది
మనసు వెంబడించింది
నిమిషమాగక (2)॥