Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

iTu rAyE iTu rAyE - ఇటు రాయే ఇటు రాయే

చిత్రం : దూకుడు (2011), రచన : భాస్కరభట్ల
సంగీతం : ఎస్.ఎస్.థమన్, గానం : రంజిత్, దివ్య
పల్లవి :
నీ స్టైలే చ కాస్... నీ స్మైలే ఖల్లాస్...
నీ ఎనకే క్లాసు మాసు డ్యాన్సే...
ఇటు రాయే ఇటు రాయే
నీ మీదే మనసాయే
ఇటు రాయే గొడవ గొడవాయే
ఏయ్... ధడక్ ధడక్ అని
దేత్తడి దేత్తడి
ధడక్ ధడక్ దిల్ పచ్చడి పచ్చడి చేశావ్...
నడుము తడిమేశావ్
ఏయ్ పటక్ పటక్ అని గుప్పెడు గుండెని
కొరుక్ కొరుక్కొని నువ్ నమిలేశావ్... ఓ...
ఈ ఫ్రెంచి ఫిడేల్ జర దేఖ్‌రే... ఓ...
దీన్ తళుకు బెళుకు ఎహె సూపరే... ఓ...
ఏయ్... కిక్కులేని లైఫు అంటే ఉప్పులేని పప్పుచారు
కిస్సులేని జిందగీని ఒప్పుకోరె కుర్రకారు
ఏక్ పప్పీ దే... ॥రాయే॥
చరణం : 1
గుండుసూది ఉన్నది గుచ్చుకోవడానికే
గండుచీమ ఉన్నది కుట్టిపోవడానికే
మేరే దిల్లు ఉన్నది నీకు ఇవ్వడానికి
అది పడిపడి దొర్లెను చూడే
తేలులాంటి పిల్లడే వేలు పెట్టి చూడకే
తిమ్మిరాగనందిలే... ఓ...
ఏం జరగనివ్వు పర్లేదులే ఓహో... ఓ...
నిన్నదాక లొల్లిపెటి ్ట ఇప్పుడేంటె సుప్పనాతి
ఆడపిల్ల బైటపడితె అల్లరల్లదవ్వదేటి
ఓసి నా తల్లో... ॥రాయే॥
చరణం : 2
తేనెపట్టు ఉన్నది రేగిపోవడానికే
చీరకట్టు ఉన్నది జారిపోవడానికే
నువ్వు చూడడానికే చేతులెయ్యడానికే
ఈ కిటకిట పరువం నీకే
ఈడు ఎందుకున్నదీ గోల చెయ్యడానికే
గోడ దూకడానికే... ఓ...
విదియ తదియలిక దేనికే... ఓ...
ఏయ్... విల్లులాంటి ఒళ్లు నాది భళ్లుమంటు విరుచుకోర
ఒంపుసొంపులోన ఉంది పాలధార పంచదార
ఏతమేసెయ్‌రో... ॥రాయే॥
నీ స్టైలే చ కాస్..

My love is gone - మై లవ్ ఈజ్ గాన్

చిత్రం : ఆర్య-2(Arya - 2) (2009), రచన : చంద్రబోస్
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, గానం : రంజిత్
చిత్రం : ఆర్య-2 (2009), రచన : చంద్రబోస్
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, గానం : రంజిత్
Photo : రంజిత్


పల్లవి :
మై లవ్ ఈజ్ గాన్...
మై లవ్ ఈజ్ గాన్... (2)
పోయే పోయే లవ్వే పోయే
పోతే పోయిందే
ఇట్స్ గాన్ ఇట్స్ గాన్ ఇట్స్ గాన్
మై లవ్ ఈజ్ గాన్
పోయే పోయే లడికీ పోయే
పోతే పోయిందే
ఇట్స్ గాన్ ఇట్స్ గాన్ ఇట్స్ గాన్ మై లవ్ ఈజ్ గాన్
వెలుగంతా ఆరిపోయే కథ మారిపోయే
ఇక చీకటెంత బాగుందే
గెలుపంతా జారిపోయే నన్ను వీడిపోయే
ఇక ఓటమెంత బాగుందే
మై లవ్ ఈజ్ గాన్... మై లవ్ ఈజ్ గాన్... (2)
చరణం : 1
ఏ... గలాసు వదిలిపోతుందే
గొలుస్సు విరిగిపోతుందే
గులాబి రాలిపోతుందే లవ్ పోతే పోయిందే
సరస్సు నిండి పోతుందే సొగస్సు కరిగిపోతుందే
మనిషి లైఫే పోతుందే లవ్ పోతే పోయిందే
తలనొప్పి పారిపోయే శ్రమ తీరిపోయే
ఇక శూన్యమెంత బాగుందే
మది నొప్పి ఆరిపోయే
పెదవాగిపోయే
ఇక మౌనమెంత బాగుందే
మై లవ్ ఈజ్ గాన్
మై లవ్ ఈజ్ గాన్... (2)
చరణం : 2
హానెస్టుగుండే పనిలేదే
ద బెస్టుగుండే పనిలేదే
హాబిట్సు మార్చే పనిలేదే ఏం మార్చే పనిలేదే
కెమిస్ట్రి కలిసే పనిలేదే కెరియరు మలిచే పనిలేదే
కేరాఫ్ తెలిపే పనిలేదే కేరింగ్‌తో పనిలేదే
ప్రేమించి గెలిచినోళ్లు షాది జరిగినోళ్లు
ఇళ్లలోన మిగులుతారే
లవ్ చేసి ఓడినోడు లోకాన్నేలుతాడు
హిస్టరీలోన వెలుగుతాడే
మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్... (2)

evariki evaru kApalA - ఎవరికి ఎవరు కాపలా

చిత్రం : ఇంటికి దీపం ఇల్లాలు(inTiki deepam illAlu) (1961)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : విశ్వనాథన్-రామ్మూర్తి
గానం : పి.బి.శ్రీనివాస్


పల్లవి :
ఎవరికి ఎవరు కాపలా... ఆ...
బంధాలన్నీ నీకేలా॥
ఈ బంధాలన్నీ నీకేలా॥
చరణం : 1
తనువుకు ప్రాణం కాపలా
మనిషికి మనసే కాపలా
తనువును వదిలి తరలే వేళ...
తనువును వదిలి తరలే వేళ
మన మంచే... మనకు కాపలా॥
చరణం : 2
కంటికి రెప్పే కాపలా
కలిమికి ధర్మం కాపలా
కలిమి సర్వము తొలగిన వేళ
పెట్టినదేరా... గట్టి కాపలా॥
చరణం : 3
చిన్నతనాన తల్లి కాపలా
వయసున వలచిన వారు కాపలా
ఎవరి ప్రేమకు నోచని వేళ
కన్నీరేరా... నీకు కాపలా
కన్నీరేరా నీకు కాపలా॥