Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

dEkhlOrE sAlA E rAth - దేఖ్‌లోరే సాలా ఏ రాత్

చిత్రం : ఈగ (2012), రచన : రామజోగయ్యశాస్త్రి
సంగీతం : ఎం.ఎం.కీరవాణి, గానం : దీపు, రాహుల్ సిప్లీగంజ్, శ్రావణ భార్గవి, చైత్ర


పల్లవి :
దేఖ్‌లోరే సాలా ఏ రాత్ ఛా గయీ
తేరే ద్వార్ పే తేరీ మౌత్ ఆగయీ
గయీగయీగయీగయీగయీగయీగ
మై నేమ్ ఇజ్ నాని నేనీగనెతై కానీ
నీ గుండెల్లో పేలనున్న
న్యూక్లియర్ మిసైల్‌ని॥నేమ్‌॥
నీ రేంజ్ పెద్దదవనీ నా సైజ్ చిన్నదవనీ
నీ కింగ్‌డమ్‌నే కూల్చకుంటే
కానురా మగాణ్ని
ఈగ ఈగ ఈగ యుముడి మెరుపుతీగ
ఈజీ ఈజీ ఈజీగా తేరీ జాన్ లేగా ॥
చరణం : 1
అణువంతే ఉన్నా అగ్గిరవ్వలోన
అడవినైన కాల్చే కసి నిప్పు దాగి లేదా
చిటికంతే ఐనా చినుకు బొట్టులోన
పుడమినైన ముంచే పెనుముప్పు పొంచి లేదా
Isn't the universe an atom
before the big bang
ఇల్లలికే ఈగ యే ముఝే క్యా కరేగా
అని యమా కేర్ ఫ్రీగా నువ్వు ఆవులించేలోగా

నీ శ్వాసలోన దూరిపోనా బయో వైరస్‌లాగ॥
యమ అర్జెంటుగా పూర్తిచేయవలసిన
పనులున్నాయ్
పదే పది పదే పది...
వన్ నిన్ను చంపడం... టూ నిన్ను చంపడం
త్రీ నిన్ను చంపడం... ఫోర్ నిన్ను చంపడం
ఫైవ్ నిన్ను చంపడం... సిక్స్ నిన్ను చంపడం
సెవెన్ నిన్ను చంపడం...
ఎయిట్ నిన్ను చంపడం...
నైన్ నిన్ను చంపడం...
టెన్ నిన్ను ముసిరి ముసిరి ముసిరి
ముసిరి తరిమి తరిమి తరిమి తరిమి
పొడిచి పొడిచి పొడిచి చంపడం
చరణం : 2
రెప రెప రెప రెక్కలను విదిలిస్తాగా
నీ చెవుల్లోన మరణరాగా వినిపిస్తాగా
సూసైడ్ బాంబర్నై నీ పైకి దూసుకొస్తా
బై హుక్ ఆర్ క్రుక్
నిన్ను చంపి మరోసారి చస్తా
ఒక్కసారి చచ్చినాక ఇంకో చావు లెక్కా
ఇల్లలికే ఈగ యే ముఝే క్యా కరేగా
అని ఆలోచించేలోగా నీ ఆయువున్న జాగా
తగలబెట్టి ఎగిరిపోనా తారాజువ్వులాగా॥॥

sUrIDu vachchinDu - సూరీడు వచ్చిండు

చిత్రం : ఓనమాలు(OnamAlu) (2012)
రచన : సిరివెన్నెల
సంగీతం : కోటి
గానం : కోటి, బృందం
19 July - నేడు రాజేంద్రప్రసాద్ బర్త్‌డే
(rAjendra prasAd birth day)


పల్లవి :
సూరీడు వచ్చిండు సూడయ్యో... ఓ...
సూరీడు వచ్చిండు సూడయ్యో
ఎలుగు సూదుల్ని తెచ్చిండు సూడయ్యో॥
ఏమారి తొంగున్న సోమరి రెప్పల్ని
సుర్రున గిచ్చిండు సూడయ్యో
సుర్రుసుర్రున గిచ్చిండు సూడయ్యో
నింగి కర్రి రంగు ఇరిగింది
బంగారు నీరల్ల్లే కరిగింది (2)
నీరెండ సినుకుల్నే కురిసింది...
నీరెండ సినుకుల్నే కురిసింది
పల్లె ముంగిట్లో ముగ్గుల్ని ఏసింది (2)
చరణం : 1
కొండెనక కులికేటి అగ్గిరాజుని
ఆడి సందెపెళ్లాం వచ్చి గిల్లిందా
ఇంత కాంతి కళ్లాపిని జల్లిందా॥
బుట్ట కింది కోడిపుంజు రెక్కను దువ్వి (3)
కొక్కోరొక్కో కొక్కోరొక్కోమని
కొక్కొరొక్కొక్కొరొక్కోమని
ఎక్కిరించమని పంపిందా
ఆడ్ని కొక్కిరించమని పంపిందా
చరణం : 2
ఓయ్ కొండల్లో కొలువున్న కనకరాశిని
ఎండ కొలిమి తాకి ఎలికి రమ్మని
వేకువొచ్చి వెన్నుతట్టి లెమ్మని ॥
బువ్వ పెట్టే భూమి తల్లి సేవనుజేసి (3)
బతుకంతా పచ్చంగ పండించుకోమని
హెచ్చరించినాడు లెండయ్యో
ఆడి ముచ్చటాలకించ రండయ్యో॥

Onamalu Songs - Sureedu - Rajendra Prasad -...

manassA ekkaDunnAv - మనస్సా ఎక్కడున్నావ్

చిత్రం : చూడాలనివుంది (1998),


రచన : వేటూరి సంగీతం : మణిశర్మ, గానం : ఎస్.పి.బాలు, చిత్ర




పల్లవి :


మనస్సా ఎక్కడున్నావ్ ఇదేనా రావడం


వయస్సా ఎప్పుడొచ్చావ్ ఇవాళ చెప్పడం


నువ్వనుకోలేదు గుసగుసలు ఎన్నో వింటున్నా


నేననుకోలేదు మిసమిసలు నాలో పుడుతున్నా


ఇది అందమైన వింత ఆత్మకథ॥


చరణం : 1


హంస గీతమే వినరాదా హింస మానరా మదన


తెల్లవారిన తరువాత తెల్లబోకుమా లలనా


ఇప్పుడే విన్నాను చలి వేణువేదో


నిదరే ఇక రాదు లేవమ్మా


చెవులే కొరికింది చెలిమింటి మాట


ఎదలే ఇక దాచలేవమ్మా


పూలగాలికి పులకరం గాలి ఊసికే కలవరం


కంటిచూపులో కనికరం కన్నెవయసుకే తొలివరం


మొదలాయే ప్రేమ క్లాసు రాగసుధా॥


చరణం : 2


రాయలేనిదీ ప్రియలేఖ రాయబారమే వినమా


వేదమంటివి శుభలేఖ వెన్నెలంటని కలువా


పురులే విరిసింది నీలో వయ్యారం


కనులే తెరిచిందిలే పింఛం


వెలిగే నీలోన గుడిలేని దీపం


ఒడిలో తేరింది ఆ లోపం


ఎంకి పాటలో తెలుగులా తెలుగు పాటలో తేనెలా


కలవని హాలా మమతలా


తరగని ప్రియా కవితలా


బహుశా ఇదేమో భామ ప్లస్సు కదా॥