Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

jayIbhava vijayIbhava - జయీభవ విజయీభవ

చిత్రం : దానవీరశూరకర్ణ (dAna veera sUra karNa)(1977)
రచన : డా॥సి.నారాయణరెడ్డి
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు
గానం : ఎస్.పి.బాలు, జి.ఆనంద్


పల్లవి :
జయీభవ... విజయీభవ... (2)
చంద్రవంశ పాదోధి చంద్రమా
కురుకుల సరసీ రాజహంసమా
జయీభవ... విజయీభవ...
చరణం : 1
ధన్య గాంధారి గర్భ సుక్తి ముక్తాఫలా
మాన్య ధృతరాష్ట్ర తిమిర నయన తేజఃఫలా
దిగ్గజకుంభ విదారణచణ
శతసోదరగణ పరివేష్టితా
చతుర్దశ భువన చమూ నిర్దళన
చతుల భుజార్గళ శోభితా॥
చరణం : 2
కవిగాయక నట వైతాళిక
సంస్థూయమాన విభవాభరణా
నిఖిల రాజన్య మకుట మణిఘృణీ
నీరాజిత మంగళచరణా
మేరు శిఖరి శిఖరాయమాన
గంభీర ధీరగుణ మానధనా
క్షీర పయోధి తరంగ విమల
విస్ఫార యశోధన సుయోధనా
జగనొబ్బగండ జయహో
గండరగండ జయహో
అహిరాజకేతనా జయహో
ఆశ్రీతపోషణ జయహో
జయహో జయహో జయహో...

nanu pAlimpaga naDachI - నను పాలింపగ నడచీ

చిత్రం : బుద్ధిమంతుడు(buddimantuDu) (1969)
రచన : దాశరథి
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : ఘంటసాల
22 July - నేడు దాశరథి జయంతి


సాకీ :
వేయి వేణువులు మ్రోగేవేళ... ఆ ఆ...
హాయి వెల్లువై పొంగేవేళ
రాసకేళిలో తేలేవేళ...
రాధమ్మను లాలించే వేళ
పల్లవి :
నను పాలింపగ నడచీ వచ్చితివా..
మొరలాలింపగ తరలీ వచ్చితివా గోపాలా...॥
చరణం : 1
అరచెదిరిన తిలకముతో అల్లదిగో రాధమ్మ
అరజారిన పయ్యెదతో అదిగదిగో గోపెమ్మ
ఎరుపెక్కిన కన్నులతో ఇదిగిదిగో సత్యభామ
పొద పొదలో ఎద ఎదలో...
నీ కొరకై వెదుకుచుండగా ॥
చరణం : 2
కంసుని చెరసాలలో ఖైదీవై పుట్టావు
కాంతల కౌగిళ్లలో ఖైదీవై పెరిగావు
కరకు రాతి గుళ్లలో ఖైదీగా నిలిచావు
ఈ భక్తుని గుండెలో ఖైదీగా ఉండాలని...॥

Special Note:
పూర్తిపేరు : దాశరథి కృష్ణమాచార్య
జననం : 22-07-1925
జన్మస్థలం : వరంగల్ జిల్లా, మానుకోట తాలూకా చినగూడూరు
తల్లిదండ్రులు : వెంకటమ్మ, వేంకటాచార్యులు
తోబుట్టువులు : తమ్ముడు (దాశరథి రంగాచార్య),చెల్లెళ్లు(శకుంతల, అరుణ, రమాదేవి)
చదువు : బి.ఏ.
వివాహం - భార్య : జూన్, 1950 - లక్ష్మి
సంతానం : కుమార్తె (ఇందిర), కుమారుడు (లక్ష్మణ్)
తొలిచిత్రం-పాట : వాగ్దానం (1961) -నా కంటిపాపలో నిలిచిపోరా...
పాటలు : సుమారు 650
నటించిన సినిమాలు : చదువుకున్న అమ్మాయిలు (1963), శభాష్ పాపన్న (1972)
గౌరవపురస్కారాలు : దాశరథి రచనలలో ‘గాలిబ్ గీతాలు’కు మన రాష్ట్ర ప్రభుత్వం వారి ఉత్తమ అనువాద గ్రంథ బహుమతి (1965), ‘కవితాపుష్పకం’ కవితా సంపుటికి సాహిత్య అకాడమీ పురస్కారం (1967), ‘తిమిరంతో సమరం’ కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం (1974)’ లభించాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి నుండి ‘కళాప్రపూర్ణ’, ఆగ్రా విశ్వవిద్యాలయం వారి నుండి డి.లిట్. గౌరవ పట్టా, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డి.లిట్ పట్టాతో సన్మానించాయి.
ఇతర విషయాలు : దాశరథి డి గ్రీ పట్టా పుచ్చుకున్న తర్వాత ప్రభుత్వంలో పంచాయితీశాఖలో పనిచేశారు. ఆ తర్వాత 1956-63 వరకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో, 1963-71 వరకు ఆకాశవాణి మద్రాసు కేంద్రంలోను పనిచేశారు. 1977 ఆగష్టు 15న అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు దాశరథిని ఆస్థానకవిగా నియమించి గౌరవించారు. 1983లో ఎన్‌టిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆస్థానకవి పదవిని రద్దు చేయడంతో దాశరథి కలతపడ్డారు.
మరణం : 05-11-1987

ok anESA dEkhO - ఓకే అనేశా దేఖో

చిత్రం : కొత్తబంగారులోకం (2008)
రచన : సిరివెన్నెల
సంగీతం : మిక్కీ జె.మేయర్
గానం : నరేష్ అయ్యర్, కళ్యాణి
21 July - నేడు వరుణ్ సందేశ్ బర్త్‌డే
(varun sandES birth day)

పల్లవి :

ఓకే అనేశా దేఖో నా భరోసా
నీకే వదిలేశా నాకెందుకులే రభసా

భారమంతా నేను మోస్తా అల్లుకో ఆశాలత
చేరదీస్తా సేవ చేస్తా రాణిలా చూస్తా
అందుకేగా గుండెలో నీ పేరు రాశా
తెలివనుకో తెగువనుకో మగజన్మ కదా
కథ మొదలనుకో తుది వరకు నిలబడగలదా ॥

చరణం : 1

పరిగెడదాం పదవే చెలీ... ఎందాకా అన్నానా
కనిపెడదాం తుది మజిలీ... ఎక్కడున్నాం
ఎగిరెళదాం ఇలనొదిలి... నిన్నాగమన్నానా
గెలవగలం గగనాన్ని... ఎవరాపినా
మరోసారి అను ఆ మాట
మహారాజునైపోతాగా
ప్రతి నిమిషం నీకోసం...
ప్రాణం సైతం పందెం వేసేస్తా
పాత ఋణమో కొత్త వరమో
జన్మ ముడి వేసిందిలా
చిలిపి తనమో చెలిమి గుణమో ఏమిటీ లీల
స్వప్నలోకం ఏలుకుందాం రాగమాలా
అదిగదిగో మదికెదురై కనబడలేదా
కథ మొదలనుకో తుది వరకు నిలబడగలదా

చరణం : 2

పిలిచినదా చిలిపి కల... వింటూనే వచ్చేశా
తరిమినదా చెలియనిదా... పరుగుతీశా
వదిలినదా బిడియమిలా... ప్రశ్నల్ని చెరిపేశా
ఎదురవదా చిక్కు వల... ఎటో చూశా
భలేగుందిలే నీ ధీమా భరిస్తుందిలే ఈ ప్రేమ
అదరకుమా బెదరకుమా...
పరదా విడిగా సరదా పడదామా
పక్కనుంటే ఫక్కుమంటూ
నవ్వినాడా ప్రియతమా
చిక్కులుంటే బిక్కుమంటూ లెక్క చేస్తామా
చుక్కలన్నీ చిన్నబోవా చక్కనమ్మా
మమతనుకో మగతనుకో మతి చెడిపోదా
కథ మొదలనుకో తుది వరకు నిలబడగలదా