Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

marI antagA mahA(svsc) - మరీ అంతగా మహా

చిత్రం : సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013)
రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం : మిక్కీ జె. మేయర్, గానం : శ్రీరామచంద్ర


పల్లవి :
మరీ అంతగా మహా చింతగా
మొహం ముడుచుకోకలా
పనేం తోచక పరేషానుగా గడబిడ పడకు అలా
మతోయేంతగా శ్రుతే పెంచక
విచారాల విలవిల
సరే చాలిక అలా జాలిగా తికమక పెడితే ఎలా
కన్నీరై కురవాలా
మనచుట్టూ ఉండే లోకం తడిసేలా
ముస్తాబే చెదరాలా నినుచూడాలంటే
అద్దం జడిసేలా... ఓ...
ఎక్కిళ్లే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా
మరెందుకు గోల
అయ్యయ్యో పాపం అంటే ఏదో లాభం
వస్తుందా వృథాప్రయాస పడాలా॥అంతగా॥
చరణం : 1
ఎండలను దండిస్తామా వానలను నిందిస్తామా
చలిని ఎటో తరిమేస్తామా ఛీ పొమ్మనీ
కస్సుమని కలహిస్తామా ఉస్సురని
విలపిస్తామా రోజులతో రాజీ పడమా సర్లెమ్మనీ
సాటి మనుషులతో మాత్రం సాగనని
ఎందుకు పంతం
పూటకొక పేచీపెడుతూ
ఏం సాధిస్తామంటే ఏం చెపుతాం॥
చరణం : 2
చెమటలేం చిందించాలా
శ్రమపడేం పండించాలా
పెదవిపై చిగురించేలా చిరునవ్వులు
కండలను కరిగించాలా
కొండలను కదిలించాలా
చచ్చి చెడి సాధించాలా సుఖశాంతులు
మనుషులనిపించే రుజువు
మమతలను పెంచే ఋతువు
మనసులను తెరిచే హితవు
వందేళ్లైనా వాడని చిరునవ్వు॥

nA jIvana sandhyA - నా జీవన సంధ్యా

చిత్రం : అమరదీపం(amaradIpam) (1977)
రచన : వేటూరి, సంగీతం : సత్యం
గానం : రామకృష్ణ, పి.సుశీల

20 January - నేడు కృష్ణంరాజు బర్త్‌డే (KrishnamrAju Birthday)
పల్లవి :
నా జీవన సంధ్యా సమయంలో
ఒక దేవత ఉదయించింది
ఆ రూపమే అపురూపమై
అమరదీపమై వెలిగింది॥జీవన॥
చరణం : 1
శిలకే కదలిక రాగా
శిల్పమే కదలి ఆడింది
గరిసా సదపమా గమద మదని
దనిరిని గరిగరిసా
సదసదపా మపగా
కళకే కళగా విరిసి
నా కల నిజమై పండింది॥॥
ఆరు ఋతువుల ఆమని కోయిల
మనసే ఎగసి పాడింది॥జీవన॥
చరణం : 2
పొద్దుపొడుపులో అరుణిమలే
చెలి దిద్దు తిలకమై చివురించే
ఇంద్రధనుస్సులో రిమజిమలే
చెలి పైట జిలుగులే సవరించే
ఆ చల్లని చూపుల
ఊపిరి సోకిన ఆ...
ఆ చల్లని చూపుల ఊపిరి సోకిన
వెదురు వేణువై పలికింది॥జీవన॥
చరణం : 3
పలుకే పాడని పాట
చిరునవ్వు పూలకే పూత ॥
నడకే నెమలికి ఆట
లే నడుము కలలకే కవ్వింత
కలలుగన్న నా శ్రీమతి రాగా
ఈ బ్రతుకే పరిమళించింది॥జీవన॥

aligitivA sakhI - అలిగితివా సఖీ

చిత్రం : శ్రీకృష్ణార్జునయుద్ధం (srIkrishnArjuna yuddam)(1963)
రచన : పింగళి నాగేంద్రరావు, పద్య రచన : నంది తిమ్మన
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు, గానం : ఘంటసాల

18 January - నేడు ఎన్.టి.ఆర్. వర్ధంతి(NTR death anniversary) పల్లవి :
అలిగితివా సఖీ ప్రియా కలత మానవా (2)
ప్రియ మారగ నీ దాసుని ఏల జాలవా
అలిగితివా సఖీ ప్రియా కలత మానవా
చరణం : 1
లేని తగవు నటింతువా
మనసు తెలియనెంచితివా (2)
ఈ పరీక్షమాని ఇంక దయను జూడవా
అలిగితివా సఖీ ప్రియా కలత మానవా
చరణం : 2
నీవె నాకు ప్రాణమనీ నీ యానతి మీరనని (2)
సత్యాపతి నా బిరుదని నింద ఎరుగవా
అలిగితివా సఖీ ప్రియా కలత మానవా
చరణం : 3
ప్రియురాలివి సరసనుండి విరహమిటుల విధింతువా (2)
భరియింపగ నా తరమా కనికరించవా
పద్యం :
నను భవదీయదాసుని మనంబున నెయ్యపు కిన్కబూని తా
చిన యది నాకు మన్ననయ చెల్వగు నీ పద పల్లవంబు మ
త్తను పులకాగ్రకంటకవితానము తాకిన నొచ్చునంచు నే
ననియెద అల్కమానవుకదా ఇకనైన అరాళ కుంతల !