Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

kOTikOTi tArallOna - కోటి కోటి తారల్లోన

చిత్రం : ఎటో వెళ్లిపోయింది మనసు(eTO veLlipOyindi manasu) (2012)
రచన : అనంత శ్రీరామ్
సంగీతం : ఇళయరాజా, గానం : కార్తీక్

పల్లవి :
కోటి కోటి తారల్లోన చందమామ ఉన్నన్నాళ్లు
నీ మనస్సులో నేనుంటానే ॥కోటి॥
నీటి మీద ఆ కైలాసం తేలకుండా ఉన్నన్నాళ్లు
నీ తపస్సు నే చేస్తుంటానే
గాలిలోన ఆరోప్రాణం కలవకుండా ఉన్నన్నాళ్లు (2)
నిన్ను నేనే ఆరాధిస్తా నీకోసమారాతీస్తా॥కోటి॥
చరణం : 1
ఏడు వింతలున్నన్నాళ్లు నీకు తోడునై ఉంటా
పాలపుంత ఉన్నన్నాళ్లు నన్ను పంచి నేనుంటా
పాదమున్నన్నాళ్లు నీ నడకలాగ నేనుంటా
కోరుకున్న చోటల్లా చేర్చుతా
చేతులున్నన్నాళ్లు నీ గీతలాగ నేనుంటా
జాతకాన్ని అందంగా మార్చుతా
అంకెలింక ఉన్నన్నాళ్లు నీ వయస్సు సంఖ్యవనా
సంకెలల్లే బంధిస్తుంటా వంద ఏళ్లిలా ॥కోటి॥
చరణం : 2
భాషనేది ఉన్నన్నాళ్లు నిన్ను పొగిడి నేనుంటా
ధ్యాసనేది ఉన్నన్నాళ్లు నిన్ను తలచి నేనుంటా
వెలుగు ఉన్నన్నాళ్లు నీ వెనుక నేను వేచుంటా
నువ్వేటేపు వెళుతున్నా సాగనా
మసక ఉన్నన్నాళ్లు నీ ముందుకొచ్చి నుంచుంటా
నువ్వెలాగ ఉన్నావో చూడనా
నీకు దూరమున్నన్నాళ్లు జ్ఞాపకంగా వెంటుంటా
మళ్లీ మళ్లీ గుర్తొస్తుంటా ముందు జన్మలా॥కోటి॥

ententa dUram - ఎంతెంత దూరం

చిత్రం : ఎటో వెళ్లిపోయింది మనసు(eTO veLlipOyindi manasu) (2012)
రచన : అనంత శ్రీరామ్
సంగీతం : ఇళయరాజా, గానం : కార్తీక్

పల్లవి :
ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా
అంతంత చేరువై నీతో ఉన్నా
హే హే... ॥
ఎంతొద్దన్నా ఇంతొద్దన్నా
అంతంతా నీ సొంతమైనా
నే నిన్ను ఎపుడై రారమ్మంటానా
నేనెపుడై రారమ్మంటానా
నీ నా నుండే నిన్నే పోనిస్తానా ॥
చరణం : 1
పొద్దున్నైతే సూర్యుడినై వస్తా
వెచ్చంగా నిద్దురలేపి ఎన్నో చూపిస్తా
సందెల్లోనచంద్రుణై్న వస్తా
చల్లంగ జోకొట్టేసి స్వప్నాలందిస్తా
మధ్యాహ్నంలో దాహాన్నై మధ్య మధ్య
మోహాన్నై వెంటుండి వెంటాడుతా
రోజు రోజు ఇంతే ఏ రోజైనా ఇంతే
నీడై జాడై తోడై నీతో వస్తానంతే
॥నిన్ను ఎపుడై॥
చరణం : 2
అద్దంలోన నేనే కనిపిస్తా
అందాల చిందుల్లోన పూవై వినిపిస్తా
చుట్టూ ఉంది నేనే అనిపిస్తా
ఆకాశం హద్దుల్లోనూ ఉన్నా అడ్డొస్తా
మబ్బుల్లో మాటేసి వెన్నెల్లో వాటేసి
ప్రాణాన్ని ముద్దాడుతా
ఏ జన్మైనా ఇంతే పైలోకానా ఇంతే
ఆది అంతం అన్నీ నేనే అవుతా అంతే
॥నిన్ను ఎపుడై॥

Barbie girl - mirchi

చిత్రం : మిర్చి(mirchi) (2013), రచన : రామజోగయ్యశాస్త్రి
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, గానం : జాస్‌ప్రీత్ జాస్జ్, సుచిత్ర


సాకీ :
ఆరడుగుల అందగాడు
నన్ను Barbie girlఅన్నాడు
కళ్లలో కళ్లు పెట్టి చూసి
నన్ను Baby dollఅన్నాడు
పల్లవి : Hello senorita Hello senorita
నువ్వే నా horlicks n boost n bournvita
మైహూ మార్గరీటా మైహూ మార్గరీటా
ఇందా నా అందాన్నే తాగేయ్ గటగటా
పిల్లా నీ కళ్లల్లో దాగుందో తల్వారే
పిల్లోడి కండల్లో దాగుందో పట్కారే
చున్నీలా చుట్టేస్తా ఆజారే...
Barbie girl... Baby dolll
ఒళ్లే జిగేల్ జిగేల్ జిగేల్ మంటుంటే
Barbie girl... Baby dollll
గుండె గుబేల్ గుబేల్ గుబేల్ మంటుంటే॥Hello॥
చరణం : 1
Dont touch me మెత్తంగా... ఉల్లేఉల్లేహో
Dont kiss meతియ్యంగా... ఉల్లేఉల్లేహో
Please gitch meకారంగా... ఉల్లేఉల్లేహో
పెదవుల్లో లాండ్ మైన్
జర పేల్చేసెయ్‌రా తీవ్రంగా
ఒళ్లేమో ఓవెన్‌లా మంటెక్కి ఉన్నది
143 సెంటిగ్రేడ్ సెగలౌతున్నది
పిల్లేమో ఫ్రీజర్‌లో చాకొలేట్‌లా ఉన్నది
Yummy yummy టేస్టు చూసుకో ॥Barbie॥
చరణం : 2
బ్రేక్ చేస్తా బిడియాన్ని... ఉల్లేఉల్లేహో
షేక్ చేస్తా పరదాని... ఉల్లేఉల్లేహో
అటాక్ చేస్తా పరువాన్ని... ఉల్లేఉల్లేహో
తుఫానై దూకేస్తా బీకేర్‌ఫుల్ పిల్లా బఠాణీ
హైజాకే చేస్తావో కిడ్నాపే చేస్తావో
తగినట్టుండాలది నీ నా స్పీడుకి
హిప్నోటైజౌతావో మెస్మరైజౌతావో
Open sesame full romance కి ॥Barbie॥