Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

rA rA rA rAgamai - రా రా రా రాగమై

చిత్రం : ఆనందభైరవి(Anandabhairavi) (1984)
రచన : వేటూరి సుందర రామమూర్తి
సంగీతం : రమేష్‌నాయుడు
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

పల్లవి :
రా రా రా రాగమై...
నా నా నా నాదమై...
సంగీతము నేనై వేణువూదగా...
నృత్యానివి నీవై ప్రాణదాతగా...
॥రా రా రా॥
చరణం : 1
వెదురునైన నాలో
నిదుర లేచిన వాయువై (2)
ఎదకు పోసిన ఆయువై
నా గుండియ నీ అందియగా
నా గుండియ నీకే అందియగా
కంకణ నిక్వణ
కులుకులు కులుకులు
కలిత చలిత కళ్యాణిరాగమై
కదలి రాగదే భైరవి...
కదలి రాగదే భైరవి
నటభైరవి ఆనందభైరవి ॥రా రా రా॥
చరణం : 2
వేణువైన నాలో
వేసవిగాలుల వెల్లువై (2)
ఊపిరి పాటకు పల్లవై
భగ్నహృదయమే గాత్రముగా
అగ్నిహోత్రమే నేత్రముగా
దర్శనమివ్వవే స్పర్శకు అందవే
దివ్యదీధితులతో దీపకమై
తరలి రాగదే భైరవి...
తరలి రాగదే భైరవి నటభైరవి
ఆనందభైరవి ॥రా రా రా॥
చరణం : 3
నా హృదయనేత్రి విశ్వాభినేత్రి
జ్వలన్నేత్ర ధారాగ్ని
తప్తకాంచన కమ్రగాత్రి సుగాత్రి
మద్గాత్ర ముఖ సముద్భూత
గానాహ్వాన చరణచారణ
నాట్యవర్తీ సవిత్రీ ఫాలనేత్ర
ప్రభూతాగ్నిహోత్రములోన
పాపసంచయమెల్ల హవ్యమై
ఆ జన్మతపమునకు
ఈ జన్మ జపమునకు గాయత్రివై
కదలిరావే సాంధ్యదీపమా
ఇదే నయన దీపారాధన
హృదయపూర్వావాహన
ఉదయరాగాలాపన
భైరవి నటభైరవి ఆనందభైరవి
రావే... రావే... రావే... (2)

nandikoNDa vAgullOna - నందికొండ వాగుల్లోన

వేటూరి స్పెషల్ - vETUri Special

చిత్రం : గీతాంజలి(gItAnjali) (1989), రచన : వేటూరి
సంగీతం : ఇళయరాజా, గానం : బాలు చిత్ర

పల్లవి :
ఓ ఓ ఓ... నందికొండ వాగుల్లోన
నల్లతుమ్మ నీడల్లో
చంద్రవంక కోనల్లోన సందెపొద్దు చీకట్లో
నీడల్లే ఉన్నా... నీతో వస్తున్నా...
నా ఊరేది... ఏది! నా పేరేది... ఏది!
నా దారేది... ఏది! నావారేరి... ఓ ఓ ఓ...
చరణం : 1
ఏనాడో ఆరింది నా వెలుగు
నీ దరికే నా పరుగు
ఆనాడే కోరాను నీ మనసు
నీ వరమే నన్నడుగూ
మోహినీ పిశాచి నా చెలిలే...
శాకినీ విషూచి నా సఖిలే (2)
విడవకురా వదలనురా ప్రేమేరా నీ నీడ॥
భూతప్రేత పిశాచ భేతాళ ఢాకినీ
జడంభం భం భం భం భం...॥
నీ కబళం పడతా నిను కట్టుకుపోతా
నీ భరతం పడతా
నిను పట్టుకుపోతా ఆ...ఓ...
చరణం : 2
ఢాకిని ఢక్కా ముక్కలచెక్క
దంబో తినిపిస్తాన్
తాటకివనిపిస్తే తాటలు వలిచేస్తాన్
గుంటరి నక్క డొక్కలొ చొక్కా
అంభో అనిపిస్తాన్
నక్కలు తొక్కిస్తాన్ చుక్కలు తగ్గిస్తాన్
రక్కసి మట్టా తొక్కిసగుట్టా పంబే దులిపేస్తాన్
తీతువు పిట్ట ఆయువు చిట్టా నేనే తిరగేస్తాన్॥
అస్త్రాయ ఫట్ ఫట్ ఫట్
వస్తాయా ఝట్ ఝట్ ఝట్ ఫట్
కోపాలా మసజసతతగ శార్దులా...॥

mUDumullu aEsinAka - మూడుముళ్లు ఏసినాక

వేటూరి స్పెషల్ - vETUri Special

చిత్రం : శుభసంకల్పం(Subhasamkalpam) (1995)
రచన : వేటూరి
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
గానం : బాలు, శైలజ
పల్లవి :
మూడుముళ్లు ఏసినాక చాటులేదు
మాటులేదు గూటిబైటే గుట్టులాట
ఏడు అంగలేసినాక ఎన్నెలింట కాలుబెట్టి
పాడుకుంట ఎంకిపాట
ఆకుపచ్చ కొండల్లో... గోరువెచ్చ గుండెల్లో (2)
ముక్కుపచ్చలారబెట్టి ముద్దులంటా॥
చరణం : 1
హొయ్... పుష్యమాసమొచ్చింది
భోగిమంటలేసింది
కొత్తవేడి పుట్టింది గుండెలోన
రేగుమంట పూలకే రెచ్చిపోకు తుమ్మెదా
కాచుకున్న ఈడునే దోచుకుంటే తుమ్మెదా
మంచుదేవతొచ్చిందా మంచమెక్కిపోతుందా
ఆహా ఆహా ఆహా ఆహా
వణుకులమ్మ తిరుణాళ్లే ఓరి నాయనా
సీతమ్మోరి సిటికన ఏలు
సిలకతొడిగితే సిగ్గులై
రాములోరు ఆ సిలక కొరికితే
సీతమ్మోరి బుగ్గలై ॥
చరణం : 2
వయసుచేదు తెలిసింది
మనసు పులుపుకోరింది
చింతచెట్టు వెతికింది చీకటింట
కొత్తకోరికేమిటో చెప్పుకోవె కోయిలా
ఉత్తమాటలెందుకు తెచ్చుకోర ఊయలా
ముద్దువాన వెలిసింది పొద్దుపొడుపు తెలిసింది
వయసు వరసమారింది ఓరి మన్మథా
మూడుముళ్లు జతలోన ముగ్గురైన ఇంటిలోన
జోరుకాస్త తగ్గనీర జోజోజో
జోజోజో జోజోజో జో... (2)

ఆ ఆ ఆ.... ఆ ఆ ఆ... ఆ...
చినుకులన్నీ కలిసి చిత్ర కావేరి
చివరికా కావేరి కడలి దేవేరి
క డలిలో వెతకొద్దు కావేరి నీరు
కడుపులో వెతకొద్దు కన్నీరు కారు
గుండెలోనే ఉంది గుట్టుగా గంగ... నీ గంగా
ఎండమావుల మీద ఎందుకా బెంగ
రేవుతో నావమ్మకెన్ని ఊగిసలు
నీవుతో నా కన్నీటి ఊయలలు