Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

Featured Post

I gAlilO - ఈ గాలిలో

చిత్రం : అగ్నిపర్వతం(Agni parvatam) (1985)

రచన : వేటూరి సుందరరామమూర్తి
సంగీతం : చక్రవర్తి
గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి


పల్లవి :
ఆమె: ఈ గాలిలో... ఓఓ ఓఓ...
ఈ గాలిలో... ఓఓఓ...
ఎక్కడో అలికిడి అక్కడే అలజడి
మత్తుగా తడబడి మెత్తగా జతపడి
కట్టెను కౌగిలి ఒక వంక
తట్టెను చెక్కిలి నెలవంక
ఏమౌతదో ఏమటో... ఓ...
అతడు: ఈ గాలిలో... ఓఓ ఓఓ...
ఈ గాలిలో... ఓఓఓ...
ఎక్కడో అలికిడి... అక్కడే అలజడి...
మత్తుగా తడబడి మెత్తగా జతపడి
చెక్కిలి గుంతలు ఒక వంక చక్కిలి గింతలు ఒక వంక...
ఈ కాస్తకే ఎందుకో... ఓ...
ఆ: ఈ గాలిలో... ఓఓఓ...

చరణం : 1
ఆ: నవ్వినవేళా మధుమాసంలో విరబూసే నా కోర్కెలే
అ: పూవు నేను పుట్టిననాడే వాలాము నీ పక్కనే
ఆ: వేసవి ఒడిలో వెన్నెల జడిలో
అ: తనువులు కలిపే
పెదవుల ముడిలో
నీ ప్రేమ పందిళ్లలో... ఓ...
ఆ: ఈ గాలిలో... ఓఓఓ...॥గాలిలో॥

చరణం : 2
ఆ: తాకినచోట తాంబూలంలా
ఎరుపెక్కెనే చెక్కిలీ
అ: పొద్దూ ముద్దూ పుట్టేచోటా
ఎరుపెక్కవా దిక్కులే
ఆ: ఎదచలి పెరిగే ఎదరకు జరిగే
అ: కథ ఇక మొదలై కౌగిట బిగిసే
ఈ సందె సయ్యాటలో... ఓ...
ఆ: ఈ గాలిలో... ఓఓఓ...॥గాలిలో॥

chamak chamak tArA - చమక్ చమక్ తారా

పల్లవి :
అతడు: చమక్ చమక్ తారా
ఝణక్ ఝణ్ సితారా
ఆమె: చమక్ చమక్ తారా
ఝణకు ఝణ్‌సితారా
ఈ తారను విడిచిపోతారా...
అ: చమక్ చమక్ తారా
ఝణక్ ఝణ్ సితారా
నా తారను విడిచిపోతానా...

చరణం : 1
ఆ: కలల మైకములో
కనుమూసి నేనుంటే... (2)
సెలవు గైకొనకుండా తరలిపోతారా
చమక్ చమక్ తారా
ఝణక్ ఝణ్ సితారా
ఈ తారను విడిచిపోతారా...

చరణం : 2
అ: కాలికి బంధాలై
నీ అందచందాలు... (2)
క లకాలం నన్ను నీ ఖైదీ చేసేనే॥

చరణం : 3
ఆ: ఈ రాగాలు సరాగాలు ఏనాటికీ
ఇలా సాగిపోయేను ముమ్మాటికీ
అ: ఏ చోటనున్నా ఏనాటికైనా
నా చెలివి నీవే అను ఔనౌనను॥

గానం : ఘంటసాల, పి.లీల

*********

పల్లవి :
అప్పటికీ ఇప్పటికీ ఎంతో తేడా
అది తెలిసి మసలుకో
బస్తీ చిన్నోడా॥

చరణం : 1
బాలవయసు పెళ్లిళ్ల బాధలు
పోయాయోయ్ (2)
ప్రేమించి పెళ్లాడే
రోజులోయి వోయి ॥

చరణం : 2
చెప్పినట్లు పడి ఉండే కాలం
పోయిందోయ్ (2)
తిప్పలు పెట్టారా
తప్పవోయ్ విడాకులు॥

చరణం : 3
ఒకరి మీద ఇంకొకరు
అదుపులు మానేసి (2)
కలసిమెలసి సాగించే
సంసారం స్వర్గమోయ్ (2)॥

గానం : పి.లీల

**********

పల్లవి :
ఆమె: బైఠో ైబె ఠో పెళ్లికొడకా
అతడు: ఆల్ రైటో రైటో
నా పెళ్లికూతురా ॥ైబె ఠో॥
అడ్రస్ తెలియక అల్లాడిపోతి
అందాల పూబంతి (2)
నిను చూచినా దినం మొదలు
నే మజ్నూనైపోతినే
హాయ్... మజ్నూనైపోతినే

చరణం : 1
అయ్యో పాపమీ అవస్థ చూస్తే
గుండె నీరు కాదా (2)
వెళ్లి వెదకు నీ చెలి లైలను
ఎడారిదారుల (2)
హా... ఎడారి దారుల...

చరణం : 2
అ: లైలా లైలా... నువ్వే నా లైలా...
వలచి నన్ను దయదలచకున్న
నా తలను కోసుకుంటా (2)
తల తీసుకొన పనేలేదురా
నిన్నే చేసుకుంటా (2)
హాయ్... అదే కావాలంటా
అ: బైఠో ైబె ఠో పెళ్లికూతురా
ఆ: ఆల్ రైటో ైరె టో నా పెళ్లికొడకా

గానం : జిక్కి, జె.వి.రాఘవులు
చిత్రం : పెళ్లిసందడి (1959)
రచన : సముద్రాల రామానుజాచార్య
సంగీతం : ఘంటసాల

chinuku chinukugA - చినుకు చినుకుగా

చిత్రం : ముక్కుపుడక (mukku puDaka) (1983)

రచన : డా॥సి.నారాయణరెడ్డి
సంగీతం : జె.వి.రాఘవులు, గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి


పల్లవి :
అతడు: చినుకు చినుకుగా చిగురుమెత్తగా
గోరు వెచ్చగా గుండె విచ్చగా॥
చేరుకో సరాగిణీ చేరుకో తరంగిణీ...
ఆమె: చినుకు చినుకుగా చిగురుమెత్తగా
గోరు వెచ్చగా గుండె విచ్చగా
చరణం : 1
అ: అల్లన ఉదయించే ప్రతి కిరణం
చల్లగ చరియించే నీ చరణం
ఆ: నింగిన విహరించే ప్రతి మేఘం
పొందిన ప్రేమకు సందేశం
అ: ఊహలే ఊసులై... ఆ: ఆశలే బాసలై...
అ: హే హే... ఊహలే ఊసులై... ఆ: ఆశలే బాసలై...
అ: మధువులు చిలుకగా మధురిమలొలుకగా
ప్రణయ వేదమంత్రమేదొ పలుకగా॥
చరణం : 2
అ: వలచిన జంటను కనగానే చిలకలకే కన్ను చెదిరింది
ఆ: కవితలకందని పలుకులలో కమ్మని దీవెన తొణికింది
అ: కడలియే గగనమై... ఆ: గగనమే కడలియై...
అ: ఆ హా... కడలియే గగనమై ఆ: గగనమే కడలియై...
ఆ: సహచరి నడకల స్వరఝరి తొణకగ
సరస రమ్య దివ్య సీమ నిలుపగ॥
Special Note:

భానుచందర్ పూర్తిపేరు మద్దూరి వెంకట సత్య సుబ్రహ్మణ్యేశ్వర భానుచంద్ర ప్రసాద్. స్వస్థలం కృష్ణాజిల్లా మచిలీపట్నం. పుట్టింది, పెరిగిందంతా చెన్నైలో... శకుంతలాదేవి, మాస్టర్ వేణు (ప్రముఖ సంగీత దర్శకులు) దంపతులకు రెండవ సంతానం భానుచందర్. తెలుగు, తమిళ, కన్నడ భాషలలో వందకు పైగా సినిమాలలో నటించారు. తెలుగులో దేశద్రోహులు, ప్రేమించొద్దు ప్రేమించొద్దు చిత్రాలకు సంగీతం అందించారు, దర్శకత్వం వహించారు.

Run run run

చిత్రం : ఇద్దరమ్మాయిలతో(iddarammAyilathO (2013)

రచన : రామజోగయ్యశాస్త్రి, సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గానం : అపాచి ఇండియన్, బృందం

పల్లవి :
సీతా గీతా షీలా మాలా
పేరే ఏదైనా అరె ఊరే ఏదైనా
అమ్మాయంటూ భూమ్మీదే
అస్సలు లేకుంటే కన్నా... లైఫే సున్నా
చీరో గీరో షర్టో స్కర్టో వేసేదేదైనా ఏ కంట్రీ డ్రెస్సైనా
ఐఫీష్టనిపించే బ్యూటీ అడ్రస్ ఎక్కడ ఎదురైనా
మెచ్చుకో నాయ్‌నా
బూం బూం బూం బూం బూం బూం బూబూం
ఈ పాపలే లేకపోతె డూం డూం డూం డూం
లోకానికే ఆక్సిజిన్ అందం అందం... సో...
Run run run run run
Put your hands up n say let's have some fun
Run run run run run
Gotta win the heart of every sexy woman

చరణం : 1
మాటల్లోన కాక్టెయిల్ మత్తుంటాది
ఊపిర్లోన పెర్ఫ్యూమ్ ఘుమ్మంటాది
టాప్ టూ బాటమ్ అమ్మాయిల్లో
మనసులకే మంటెట్టే నిప్పుంటాది
దూదికన్న సాప్టుగున్న హార్టుంటాది
సూదికన్న షార్పుగున్న చూపుంటాది
అర్థంకాని చిట్టిబుర్రలో
గజిబిజి సుడోకు పజిలుంటాది
బూం బూం బూం బూం బూం
బూం బూబూం
ఎహె ఎన్ని గొప్ప లెక్కలున్నా
ఏంటీ లాభం
ఎళ్లి ఆడికో ఈడికో పడ్డం ఖాయం సో...
రన్ రన్ రన్... ॥Run॥

చరణం : 2
క్లోరోఫాం అడ్డుకున్న కర్చీఫ్‌లాగ
కొంతమంది అమ్మాయిలు హైలీ డేంజర్
ఆర్గానిక్ ఫోం మేట్రెస్‌లాగా
కొందరిది ఎడ్జష్టయ్యే సింపుల్ నేచర్
జీన్స్ ప్యాంటు వేసుకున్న ప్రతీ అమ్మాయ్
ఫాస్టుగానే ఉండాలని రూలే లేదు
సల్వారేసే ప్రతి అమ్మాయ్ స్లోగానే
ఉంటుందన్న గ్యారెంటీ లేదు
బూం బూం బూం బూం బూంబ బూం బూబూం
వీళ్లనెస్టిమేట్ చెయ్యడం చాలా కష్టం
ఈ లైఫ్‌టైం చాలదీ సబ్జెక్ట్ కోసం రన్ రన్ రన్...॥Run॥

kilakilamani - కిలకిలమని


చిత్రం : కూలీ నెం.1(Cooli No.1 (1991)

రచన : సిరివెన్నెల
సంగీతం : ఇళయరాజా
గానం : ఎస్.పి.బాలు, కె.ఎస్.చిత్ర

పల్లవి :
అతడు: కిలకిలమని కళావరురాణీ...
ఘల్లు ఘల్లుమనె కథాకళికాని...
కళ్లెంలేని కళ్లల్లోని
కవ్వింతల్ని హలో అని
ఆమె: చల్ మోహనాంగ
సుఖాలకు బోణీ...
చలిగిలి అన్నీ పొలోమని పోనీ
సిగ్గేలేని సింగారాన్ని చిందించని ఛలో హని
అ: మదనుడి పాలైపోనీ ముదిరిన భావాలన్నీ
ఆ: మగ జతపాడే బాణీ మగువకు రేవై రానీ॥
చరణం : 1
అ: బరువుగా విరివిగా
కాపుచూపెకద ఏపుగా... గోపికా
ఆ: చొరవగా కరువుగా కాపువేసెకద కైపుగా... కోరికా
అ: వాలే పరువాలే తగువేళే గనుకా
ఆ: కాలే తమకాలే గమకాలై పలుకా
అ: కాంక్షలో శ్రుతీ గతీ పెంచి కాల్చగా
చుట్టూ కట్టే కంచే ఈ మైకం
ఆ: ఈడులో అతీగతీలేని వేడుకా
దిక్కుమొక్కు పంచే ఈ రాగం
అ: ఆదమరిచిన ఈడులో ఈతలాడనీ॥మోహనాంగ॥
చరణం : 2
ఆ: ఒడుపుగా ఒలుచుకో
ఓపలేనుకద ఒంటిలో... అవసరం
అ: చిలిపిగా దులుపుకో మోయలేవుకద
నడుములో... కలవరం
ఆ: తాపం తెరతీసీ తరిమేసే తరుణం
అ: కాలం తలుపేసి విరబూసే సమయం
ఆ: వీలుగా గుట్టుమట్టు మీటి లీలగా
ఇట్టే పుట్టే వేడికి యాడాడో
అ: ఒంటిగా ఉంటే ఒట్టే అంటూ వెంటనే
జట్టే కట్టెయ్యాలి ఏ నీడో
ఆ: జోడు బిగిసిన వేడిలో వేగిపోనీ॥

debbaku debba - దెబ్బకు దెబ్బ


చిత్రం : రాజన్న(rAjanna) (2011)

రచన : సుద్దాల అశోక్ తేజ
సంగీతం : ఎం.ఎం.కీరవాణి, గానం : కీరవాణి, రేవంత్


ఆపకమ్మా... పోరాటం...
కన్నుండి కాలుండి
కదలలేని ఊరికోసం
బానిస దండే నిప్పుల కొండై
నింగినంటేలా వెయ్...
ఊపిరి జెండా ఎగరై చావుకు
ఎదురుగ అడుగై
వె య్ వెయ్ వె య్యెహెవెయ్
సలసలసలసల మసిలే కసితో
కుతకుతకుత ఉడికే పగతో వెయ్ వెయ్
దెబ్బకు దెబ్బ

వె య్ వెయ్ వెయ్యెహెవెయ్
మన కణం కణం ఒక అగ్నికణంగా
రక్తకణం ఒక సమరగణంగా
కిరాతకీచక నీచమేచకుల శవాల తివాసి
నివాళులెత్తగ వె య్ వెయ్
వెయ్యెహెవెయ్... వెయ్ వెయ్... వెయ్యెహెవెయ్
తంతున్నా నీ కాళ్లు మొక్కనని ఏన్నాళ్లంటవురా
బంచోతన్న బాంచెన్ నని ఇక ఏన్నాళ్లుంటవురా
చరిచే కొడుకుల చండాడక ఇక ఎందుకు చూస్తవురా
క్షణం క్షణం ఇది తుది సమరంగా
గెలిపొకటే జన రణ ఫలితంగా॥వెయ్...॥

Special Notes: పూర్తి పేరు : సుద్దాల అశోక్ తేజ
జననం : 16-05-1960
జన్మస్థలం : నల్లగొండ జిల్లాలోని సుద్దాల గ్రామం
తల్లిదండ్రులు : జానకమ్మ, హనుమంతు
చదువు : ఎంఏ. బీఈడీ
వివాహం - భార్య : 13-12-1979 - నిర్మల
సంతానం : కుమార్తె (స్వప్న), కుమారులు (జ్వాలా చైతన్య, అర్జున్ తేజ)
తొలిచిత్రం-పాట : నమస్తే అన్న (1994) - గరం గరం పోరి
పాటలు : 1700 పైగా (ఇప్పటి వరకు)
నటించిన సినిమాలు : కుబుసం (2002), అడవి బిడ్డలు (2006), ఆ అయిదుగురు (చిత్రం నిర్మాణంలో ఉంది)
అవార్డులు : కంటెకూతుర్నేకను (1998)లో ‘ఆడకూతురా నీకు’, మేస్త్రీ (2009)లో ‘ఓ తల్లి నా తల్లి భరతమాత’ అనే పాటలకు నంది అవార్డులు, ఠాగూర్ (2003)లో రాసిన ‘నేను సైతం...’ పాటకు ఉత్తమ గేయ రచయితగా జాతీయ అవార్డు, దళం (1996) లో ‘అవ్వనీకు దండమే’ పాటకు కళాసాగర్ అవార్డు, ఒసేయ్..! రాములమ్మా (1997)లో ‘రామసక్కని తల్లి’ పాటకు ఆత్రేయ మనస్విని అవార్డు, ఇత్యాది సాహిత్యానికి సంబంధించి దాదాపు నలభై అవార్డులు అందుకున్నారు.
ఇతర విషయాలు : చిన్నప్పటి నుండి సినారె రాసిన పాటలను వింటూ, ఆయనలాగ పాటలు రాయాలని ఆరవ తరగతిలోనే నిర్ణయించున్నారు సుద్దాల అశోక్ తేజ. తండ్రి సుద్దాల హనుమంతు ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, ప్రజాకవి కావడంతో అశోక్ తేజ సాహిత్య వాతావరణంలో పెరిగారు. తల్లిదండ్రుల పేరిట ‘సుద్దాల హనుమంతు-జానకమ్మ జానపద కళాపీఠం’ అనే ఫౌండేషన్‌ను 2010లో నెలకొల్పి, డెరైక్టర్ బి,నర్సింగరావుకు, ప్రజా గాయకుడు గద్దర్‌కు, చత్తీస్‌ఘడ్‌కు చెందిన జానపద గాయని పద్మభూషణ్ తీజన్‌భాయ్‌కు సుద్దాల హనుమంతు-జానకమ్మ జాతీయ పురస్కారాన్ని అందించారు. అంతే కాకుండా మాతృదినోత్సవం నాడు ఒక్కో ఏడాది ఒక్కో గ్రామం చొప్పున (సుద్దాల, పల్లెపాడు, బ్రాహ్మణపల్లి...) అమ్మ ఒడి పండగ (ఒక ఏడాదిలో సంతానవతులైన తల్లులకు, బిడ్డలకు నూతన వస్త్రాలతో సత్కారం) నిర్వహిస్తున్నారు.

velugu rEkhalavAru - వెలుగు రేఖల వారు


చిత్రం : సీతారామయ్యగారి మనవరాలు (1991)

రచన : వేటూరి సుందరరామమూర్తి
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
గానం : జిక్కి, కె.ఎస్. చిత్ర, బృందం

పల్లవి
వెలుగు రేఖల వారు
తెలవారి వచ్చి
ఎండ ముద్దులు పెట్టంగా
చిలక ముక్కుల వారు
చీకటితోనే వచ్చి
చిగురు తోరణం కట్టంగా
మనవలనెత్తే తాత మనువాడ వచ్చాడు
మందార పువ్వంటి మా బామ్మని...
అమ్మమ్మని
నోమినమ్మన్నాల్లో నోమన్నలాలో
సందమామా సందమామా
నోచే వారింటిలోన పూచే పున్నాలబంతి
సందమామా సందమామా...
పండంటి ముత్తై సందమామా
పసుపు బొట్టంత మా తాత సందమామా॥

చరణం : 1
పూచిన చెవికే చేతి కురులపై తుమ్మెదలాడే ఓలాలా... తుమ్మెదలాడే ఓలాలా
కుందిని దంచే నాతి దరువుకే
గాజులు పాడే ఓలాలా... గాజులు పాడే ఓలాలా
గంధం పూసే మెడలో తాళిని కట్టేదెవరే ఇల్లాలా...
కట్టేదెవరే ఇల్లాలా
మెట్టినింటిలో మట్టెలపాదం తొక్కిన ఘనుడే ఏలాలా
ఏలాలో ఏలాలా...
ఏలాలో ఏలాలా...
దివిటీల సుక్కల్లో
దివినేలు మామా...
సందమామా సందమామా
గగనాల రథమెక్కి
దిగివచ్చి దీవించు
సందమామా సందమామా॥

చరణం : 2
ఆ పైన ఏముంది ఆ మూల గదిలోన...
ఆరు తరముల నాటి ఓ పట్టెమంచం
తొలిరాత్రి మలిరాత్రి తొంగళ్ల రాత్రి
ఆ మంచమే పెంచె నీ తాత వంశం
అరవై ఏళ్ల పెళ్లి అరుదైన పెళ్లి
మరలి రాని పెళ్లి మరుడింటి పెళ్లి
ఇరవై ఏళ్ల వాడు మీ రాముడైతే
పదహారేళ్ల పడుచు మా జానకమ్మ
నిండా నూరేళ్లంట ముత్తై జన్మ
పసుపు కుంకుమ కలిపి చేశాడు బ్రహ్మ
ఆనందమానందమాయెనే...
మా తాతయ్య పెళ్లికొడుకాయెనే
ఆనందమానందమాయెనే...
మా నాన్నమ్మ పెళ్లికూతురాయెనే

Girl just - violin song

చిత్రం : ఇద్దరమ్మాయిలతో (Iddarammayilatho) (2013)

రచన : విశ్వ
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గానం : డేవిడ్ సిమోన్, అనిత

సాకీ
ధృవంతే రాజా వరుణో ధృవంతేనో బృహస్పతి
ధృవంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధృవం

పల్లవి :
అతడు: Girl, just lemme be your man
I wanna hold your hand
and take you to your fantasy
Eyes, wanna look into your eyes
You make me realize... that
Baby, you're the only one for me

ఆమె: కాంతా... మన... వశీకరా... ప్రేమా తురా...
మోద... కరా... మనోహరా...
చతురా విదురా శూరా... ప.. టు.. త.. ర..
అ: గర్ల్ గుండెల్లో చోటిస్తా ప్రేమంచే చూపిస్తా
నీ లోకం మొత్తం నేనౌతా
కమ్ వెన్నెల్లో తోడౌతా వర్షంలో నీడౌతా
నీకోసం నేనో తీయని పాటవుతా

చరణం : 1: Every day every night...
every wrong every right...

నీతోనే నడవాలి అంటుందే మనసు
ఆ: సుమరజనీకర సోమా
విబుధా మధుర మనోహర నామా
అ: నా వెంటే నువ్వుంటే నా సర్వం నీ వెంటే
నే అన్నా అనకున్నా నీకంతా తెలుసు
ఆ: సమర కళా బల భీమా...
అభయ అతుల పరాక్రమ స్యూమ
అ: రావే గులాబి మాలిక
ఆ: మనసా వచసా నీదే ఈ బాలికా
'గుండెల్లో'

చరణం : 2 అ: Ever word every thought ...
every move every plot

నీతోనే సాగాలి అంటుందే వయసు
ఆ: అగణిత శ్రీ గుణ శీలా వినతః కదన కుతూహల వ్యాళ
అ: అద్దంలా నీ మనసు ప్రేమందం తెలిపింది
కనువిందే చేసింది ఊరించే సొగసు
ఆ: మృదు వచనామృత లోలా రసికః
చిరు దరహాస విలోలా
అ: ప్రేమే నిషాల ఊగిసా
ఆ: కుదిరే వలపే బాగుంది వరసా

అ: Girl, you're like a crystal moon
Such a refreshing tune
You got me singing every verse
Come, into my galaxy...
Come fly away with me
My love is like a Universe

Iddarammayilatho Violin Full Song With Video / Lyrics - Allu Arjun, Amala Paul, Catherine Tresa