Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

Featured Post

lachchamma - లచ్చమ్మ

చిత్రం : ఇష్క్(Ishq) (2012)

రచన : కృష్ణచైతన్య, సంగీతం : అనూప్ రూబెన్స్
గానం : అనూప్, నితిన్, తాగుబోతు రమేష్, మురళి
నితిన్: హే గానా...
లడికీయోమ్ కేలియె నహీ
ప్లీజ్... నహీ సున్నా... ప్లీజ్...
బాబ్ యోవ్ హే... (2)

బృందం: కోడిబాయె లచ్చమ్మది
కోడిపుంజుపాయె లచ్చమ్మది
తోటబాయె లచ్చమ్మది
కోడిగుడ్డుపాయె లచ్చమ్మది బోలో...
కోడిబాయె లచ్చమ్మది కోడిపుంజుపాయె లచ్చమ్మది
గుడ్డుపాయె లచ్చమ్మది
కోడిగుడ్డుపాయె లచ్చమ్మది బోలో...

వన్స్ అప్పాన్ ఏ టైమ్
నాకొక అదిరే గర్ల్‌ఫ్రెండ్ ఉండేదిరో
మా ఇద్దరిమధ్య గొడవై బ్రేకప్ అయి పోయిందిరో
మూడేదొబ్బి పబ్బుకు వస్తే
అమ్మాయి కావాలన్నారురో
స్టాగ్‌తో ఎంట్రీ లేదని నో ఎంట్రీ బోర్డే పెట్టారురో
ఏంచెయ్యనూ బోలో క్యాకరు బాయ్...
ఐ వన్నా పార్టీ యో హో భల్లే భల్లే
యు వన్నా పార్టీ యో హో భల్లే భల్లే
ఐ వన్నా పార్టీ యో ఫాదర్ వుయ్ వన్నా బ్యూటీరో
ఐ వన్నా పార్టీ యో హో భల్లే భల్లే
యు వన్నా పార్టీ యో హో భల్లే భల్లే
ఐ వన్నా పార్టీ యో ఫాదర్ వుయ్ నీడ్ బ్యూటీరో
లచ్చమ్మ వుయ్ వాంట్ లచ్చమ్మ

రమేష్: అరె అన్నా ఖలి లేడీస్ నైట్
క్యోం లగాతే అన్నా
అపన్ కో జెంట్స్ నైట్ న హీ
హే క్యా అన్నా అరె హే క్యా అన్నా... బోలో బోలో భయ్యా...

బృం: ఓ... బాయ్సే లేరంటే పబ్బుకి
ఇన్‌కమ్ లేనేలేదురో
ఫ్రీగా డ్రింక్స్ వస్తే వచ్చి తాగివాళ్లే ఈ గర్ల్స్‌రో
లేడీస్ నైట్ అని దీనికి మళ్లీ పెట్టారు ఓ పేరురో
కావాలంటే క్యాషిస్తాం జెంట్స్ నైటు కూడా
పెట్టండిరో... ఒకే... సద్దా హాక్.. ఎత్తె రాక్...
॥వన్నా పార్టీ యో॥

రమేష్: అరెచుప్ ఇదేం గోలరాభయ్ అన్నా
నువ్ సింగ్ అన్నా...

బృం:గర్ల్సు గర్ల్స్ వస్తే ప్లీజ్‌కమ్ అని వెల్‌కమ్ చేస్తారురో
ఆ... బాయ్స్ బాయ్స్‌సొస్తే బై బై దొబ్బేయ్
అని అంటారురో... క్యాబాత్ హై...
గర్ల్స్ అంతగ్రేటా... బాయ్స్ అంత వేస్టా...
ఐవాంట్ నో రైట్ నౌ రో
గర్ల్స్ వచ్చేది బాయ్స్ కోసమని
యు బెటర్ నో రైట్ నోరో
వాట్ యూ సే... బోలో వాట్ యూ సే
॥వన్నా పార్టీ యో॥

tu hIrE - తుహీరే


చిత్రం : గుండెజారి గల్లంతయ్యిందే(GundejAri gallantayyindE) (2013)

రచన : కృష్ణచైతన్య, సంగీతం : అనూప్ రూబెన్స్
గానం : నిఖిల్ డిసౌజ, నిత్యామీనన్

పల్లవి :
అతడు: ఓ తుహీరే...
తుహీరే... తుహీరే...
ఓ నా హసీనా... నీవెంటే రానా
నేనీవైపోనా ప్రతి అణువులోనా
ఎందాక అయినా... అందాకా రానా...
కురిసే కవ్వింతల్లోనా తడిసిందే నేనా
వెలిగే నా ఆయుష్షంతా నీకోసమేనా
తుహిహె మెరి జానా... ఒహో... హో... (2)
తుహిహె మెరి జానా...
ఓ జానేజా జానేజా... ఓ జానేజా జానేజా...
తుహిహె మెరి జానా... ఒహో... హో... (2)

చరణం : 1
ఆమె: హో... నీతో చెలిమే పెరిగి
అది చనువుగా మారిందో
కథలో తెలియని మలుపేవుందో ఏమో
నన్నే పిలిచావో నువ్వే కలిశావో మాయచేశావులే
అ: ఇదో రకం లోకం కదా ముఖాముఖీ తెలియకా
తుహిహె మెరి జానా... ఒహో... హో... (2)
తుహిహె మెరి జానా...॥నా హసీనా॥

చరణం : 2
అ: ఓ తుహీరే...
తుహీరే... తుహీరే...
ఆ: హో... ఏదో రోజు ఎదురై
కలవాలని మైకంలా
అదుపే తప్పిన
మనసేమందో నీతో...
పొగిడేస్తే ఇంతా... చేరా నీ చెంతా
కొత్త తుళ్లింతనై...
అ: రాసుందిలే నాతో ఇలా నువ్వేలే నా వెన్నెలా...
హో... ఓ...
తుహిహె మెరి జానా... ఒహో... హో... (2)

naughty girl song

పల్లవి :
ఆమె: I am a naughty naughty girl... girl girl girl girl... (2)
ఆ గబ్బర్‌సింగ్‌కి లైనేశా
కొంచెం తిక్కని వదిలేశా
గా బిజినెస్‌మేన్‌కి ట్రై చేశా మస్త్ బిజీ అని ఒగ్గేశా
ఓ కంత్రీకేమో బీటేశా కంగారే పుట్టీ తగ్గేశా
నా డార్లింగ్ వైపో లుక్కేశా ఆ డేరింగ్ చూసీ చెక్కేశా
ఓ మై గాడ్... ఓ మై గాడ్...
సోలో లైఫే వెరీ బ్యాడ్ ఎక్కణ్ణా బాడీగార్డ్?
I am a naughty naughty girl... girl girl girl girl (4)
ఆ గబ్బర్‌సింగ్‌కి లైనేశా కొంచెం తిక్కని వదిలేశా

చరణం : 1
ఆ: హే... బాలీవుడ్ స్టార్స్‌తో డేటింగ్ ఛోడ్ దియా
నా ఫాలోయింగ్ మోతరో మామామియా
అతడు: నీకంత సీను లేదులే తిప్పేసుకోవద్దే
బోల్డంతమంది ఫ్యాన్సనీ డప్పేసుకోవద్దే
నీ గొప్పలచిట్టా విప్పొద్దే నాకేడో యాడో కాలుద్దే
ఆ: సుందరకాండ చంటోడా శత్రువులా చూడకురా
I am a naughty naughty girl... girl girl girl gir (2)
అ (బాబా సెహగల్): చెక్కిలి చూస్తే చమ్కీ చమ్కీ
తక్కినవన్నీ మిల్కీ మిల్కీ
కమాన్ కమాన్ కమ్ ఇస్తా ధ మ్కీ

చరణం : 2
ఆ: హే... గెలిచే గుర్రాన్నిరా
నా జాకీ నువ్వురా
హే... ప్రేమించుకుందాంరా
బొబ్బిల్రాజా
అ: సంక్రాంతి గంగిరెద్దులా
లగెత్తుకొచ్చావే
మొహబత్తు నింపి మత్తుగా షరబత్తు ఇచ్చావే
నువ్ నక్కాతోకని తొక్కావే
నా మరదలు పోస్టే కొట్టావే
ఆ: లక్ష్మీబావకి నచ్చేశా లైమ్ లైట్లోకొచ్చేశా
I am a naughty naughty girl... girl girl girl girl (2)
A:You naughty naughty girl... girl girl girl girl(2)

చిత్రం : షాడో(shADO) (2013)
రచన : భాస్కరభట్ల, సంగీతం : ఎస్.ఎస్.థమన్
గానం : గీతామాధురి, సింహ, బాబా సెహగల్

andarikI vandanam - అందరికీ వందనం

చిత్రం : బ్యాడ్‌బాయ్(Bad Boy) (2013)

రచన : రామజోగయ్యశాస్త్రి
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గానం : సుచిత్ సురేసన్, ప్రియ హిమేష్, బృందం
పల్లవి :
అతడు: అందరికీ
వందనం... (2)
నాతో మంచిగున్న నా వాళ్లకి
డబుల్ వందనం
బృందం: వందనం వందనం... (2)

అ: గల్లీ గల్లీ సంబరం
గిర్రంటాది బొంగరం
నాతో పెట్టుకున్న నాయాళ్లకి
వీపే విమానం
బృం: విమానం విమానం... (2)
మామా ఆజా చేద్దాం మజా
నినుచూస్తే మనసు హ్యాపీ హ్యాపీ: ఏసెయ్ బాజా మనమే రాజా
ఇక ఊరూవాడా డప్పుమోతేరా... హే హే హే...
ఐ యామ్ ఎ బ్యాడ్ బ్యాడ్ బ్యాడ్ బ్యాడ్‌బాయ్ (2)
ఐ యామ్ ఎ బ్యాడ్‌బాయ్ (2)
చరణం : 1: ఆరునెలల్లో మూడునెలలు
నే గవర్నమెంట్ కస్టమర్ ఆఫ్ చర్లపల్లి
బృం: పల్లి పల్లి పల్లి చర్లపల్లి...
అ: నే మంచోణ్ణా కానేకాదు...
వేషాలేస్తే దిగిపోతాది పిస్టల్ గోళి
బృం: గోళి గోళి దిగిపోతాది గోళి...
బృం: కేడి రౌడి గూండా దాదా రీమికై్స పుట్టిన
మేస్త్రీ నువ్వేరా

అ: బిల్లా రంగా భాషా అంతా
నా దోస్తికోసం సచ్చిపోతార్రా
ఐ యామ్‌

ఆమె: రంగు రంగు చిన్నోడే
రాంగుచూపు చిలిపోడే
జీబూంబా చేస్తాడే
బ్యాడ్‌బాయ్ బ్యాడ్‌బాయ్
మ్యాగ్నైట్టు కన్నుల్తో
చాక్లెట్టు బుగ్గల్తో
మత్తులో దించేస్తాడే
బ్యాడ్‌బాయ్ బ్యాడ్‌బాయ్

చరణం : 2

అ: నా గురువే ఎస్వీయారు...
నన్నొక విలనుగా మార్చేశారు
బృం: సారు సారు సారు మార్చేశారు: నాలోను ఓ ఎన్టీయారు...
అపుడపుడు తొంగి చూస్తారు
బృం: తారు తారు తారు తొంగి చూస్తారు
బృం: ఇందా ఫుల్లు లైఫే థ్రిల్లు
కిరీటం లేని కింగు నువ్వేరా

అ: నోనో మని ఐ వాంట్ హని
మస్తీ లైఫంటే క్యాషు కావాల్రా
ఐ యామ్‌

aE tIruga nanu - ఏ తీరుగ నను

చిత్రం: శ్రీరామదాసు(SrIrAmadAsu) (2006)

సంగీతం: ఎం.ఎం.కీరవాణి
రచన : భద్రాచల రామదాసు (కంచెర్ల గోపన్న)
గానం : విజయ్ ఏసుదాస్, బృందం


పల్లవి :
శ్రీరఘునందన సీతారమణాశ్రీతజనపోషక రామా!
కారుణ్యాలయ భక్తవరద నిను కన్నది కానుపు రామా!

చరణం : 1
ఏ తీరుగ నను దయజూచెదవో ఇనవంశోత్తమ రామా!
నా తరమా భవసాగరమీదను నళినదళేక్షణ రామా!

చరణం : 2
వాసవ కమలభవ సురవందిత వారధి బంధన రామా!
భాసురవర సద్గుణములు కల్గిన భద్రాద్రీశ్వర రామా!
’’ఏ తీరుగ’’

బృందం: జయ జయరాం... జయ జయరాం...

adigO adigO bhadragiri - అదిగో అదిగో భద్రగిరి

చిత్రం: శ్రీరామదాసు(SrIrAmadAsu) (2006)

సంగీతం: ఎం.ఎం.కీరవాణి
రచన : వేటూరి
గానం : ఎస్.పి.బాలు, బృందం

పల్లవి :
ఓం... ఓం... ఓం శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమః
అదిగో అదిగో భద్రగిరి... ఆంధ్రజాతికిది అయోధ్యాపురి
ఏ వాల్మీకీ రాయనికథగా సీతారాములు తనపై ఒదగా
రామదాసకత రామపదామత వాగ్గేయ స్వరసంపదగా
వెలసిన దక్షిణ సాకేతపురి ’’అదిగో’’
చరణం : 1
రామనామ జీవన నిర్నిద్రుడు
పునర్దర్శనము కోరిన భద్రుడు
సీతారాముల దర్శనానికై ఘోరతపస్సును చేసెనప్పుడు
తపమును మెచ్చి ధరణికి వచ్చి
దర్శనమిచ్చెను మహావిష్ణువు
బందం: సాస సాని దని సానిదామ గమ పాదనీ దామపా
త్రేతాయుగమున రామరూపమే
త్రికరణశుద్ధిగ కోరెను భద్రుడు
ఆదర్శాలకు అగ్రపీఠమౌ ఆ దర్శనమే కోరెనప్పుడు
చరణం : 2
ధరణీపతియే ధరకు అల్లుడై
శంఖచక్రములు అటుఇటు కాగా
ధనుర్బాణములు తనువైపోగా
సీతాలక్ష్మణ సహితుడై... కొలువు తీరె కొండంత దేవుడు
శిలగా మళ్లీ మలచి... శిరమును నీవే నిలచి
భద్రగిరిగ నను పిలిచే... భాగ్యమునిమ్మని కోరె భద్రుడు
చరణం : 3
వామాంకస్థిత జానకీ పరిలసత్ కోదండ దండం కరే
చక్రంచోర్థ్వ కరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే
విఘ్రాణం జలజాతపత్ర నయనం భద్రాద్రి మూర్తిస్థితం
కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రి యుక్తం భజే ’’అదిగో’’

kanulu palukarinchenu - కనులు పలుకరించెను


చిత్రం : ఆడబ్రతుకు(ADabratuku) (1965)

రచన : డా॥సి.నారాయణరెడ్డి
సంగీతం : విశ్వనాథన్-రామ్మూర్తి
గానం : పి.బి.శ్రీనివాస్

పల్లవి :
కనులు పలుకరించెను
పెదవులు పులకించెను
బుగ్గలపై లేత లేత సిగ్గులు
చిగురించెను
చరణం : 1
నిన్ను నేను చూసేవేళ...
నన్ను నీవు చూడవేల (2)
నేను పైకి చూడగానే... నీవు నన్ను చూతువేల
తెలిసిపోయె నీలో ఏదో వలపు తొంగిచూసెను॥
చరణం : 2
మొలక నవ్వు దాచుకోకు... జిలుగుపైట జారనీకు (2)
కురులు చాటు చేసుకోకు... తెరలు లేవు నీకు నాకు
తెలిసిపోయె నీలో ఏదో వలపు తొంగిచూసెను॥
చరణం : 3
అందమైన ఈ జలపాతం... ఆలపించె తీయని గీతం
ఒహొహో ఒహొహో... ఒహొహో...
అందమైన ఈ జలపాతం... ఆలపించె తీయని గీతం
కనిపించని నీ హృదయంలో...
వినిపించెను నా సంగీతం
తెలిసిపోయె నీలో ఏదో వలపు తొంగిచూసెను॥

Special Notes:
రామ్మూర్తి పూర్తిపేరు తిరుచిరాపల్లి కృష్ణస్వామి రామ్మూర్తి. తిరుచిరాపల్లిలో మే 18, 1922లో నాగలక్ష్మి, కృష్ణస్వామి అయ్యర్ దంపతులకు జన్మించారు రామ్మూర్తి. తమ పూర్వీకులందరికీ సంగీతంపై పట్టు ఉండటం, తండ్రి కృష్ణస్వామి, తాతయ్య మలైకొట్టై గోవిందస్వామి అయ్యర్‌లు వయొలిన్ విద్వాంసులు కావడంతో చిన్నప్పటి నుండే రామ్మూర్తికి సంగీతం పట్ల అభిరుచి ఏర్పడింది. అంతేకాకుండా చిన్నప్పుడే తండ్రితో కలిసి చాలా స్టేజ్ ప్రోగ్రామ్స్ చేశారు. చిన్న వయసులోనే రామ్మూర్తి సంగీతంపై ఏర్పరుచుకున్న ఇష్టాన్ని గమనించారు ప్రముఖ సంగీత దర్శకులు సి.ఆర్.సుబ్బరామన్. ఆయన ప్రోత్సాహంతో పద్నాలుగేళ్ల వయసులోనే హెచ్‌ఎమ్‌వీ కంపెనీలో వయొలినిస్ట్‌గా చేరాడు రామ్మూర్తి. తర్వాత టి.జి.లింగప్ప, ఎం.ఎస్.విశ్వనాథన్‌లతో కలిసి పనిచేశారు. విశ్వనాథన్‌తో కలిసి చాలా చిత్రాలకు సంగీతం అందించారు. విశ్వనాథన్‌లో కలిసి చేసిన తొలిచిత్రం తమిళంలో పణమ్ (1952), తెలుగులో మా గోపి (1954). దాదాపు ఇరైవె తమిళ చిత్రాలకు సోలోగా సంగీతం అందించారు. ఆయన సోలోగా సంగీతం అందించిన మొదటి చిత్రం సాధు మిరండాళ్ (1966).

are are are gunDe - అరె అరె అరె గుండె

చిత్రం : గుండెజారి గల్లంతయ్యిందే(gunDejAri gallantayyindE) (2013)

రచన : కృష్ణచైతన్య
సంగీతం : అనూప్ రూబెన్స్
గానం : అనూప్ రూబెన్స్, శ్రావణి, బృందం

పల్లవి :
అతడు: అరె అరె అరె...
గుండెజారి గల్లంతయ్యిందే
నీ సొగసే చూసి
గుండెజారి గల్లంతయ్యిందే...
కళ్లలో కళ్లలోన మైకం
చిన్నారి కళ్లలోన వయ్యారి మైకం
మెరిసే మెరిసేటి లోకం
ముడిపడిపో అంది మైకం
తేనెకళ్ల హొయలన్నీ ఓరచూపే చూసెనులే
ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్లా నీ వల్లేనా
బృందం: అరె అరె అరె...
గుండెజారి గల్లంతయ్యిందే నీ సొగసే చూసి
గుండెజారి గల్లంతయ్యిందే...॥కళ్లలో॥
చరణం : 1
అ: అరె... ఓ పిల్లా చాల్లే వెయ్యమాకే వేషాలే
నీ నఖశిఖలే చాల్లే మదిని ఊపకే ఉయ్యాలే
ఆమె : నిన్నుకోరి వచ్చానయ్యా ఓ రామయా
చిట్టి గుండెనే నువ్వే చురా లియా
ముందు వెనుక చూడనే ప్రియా
మే దిల్ దియా మనసు చూస్తే
ఆడే దాండియా
అ: వీడిపోనే నిన్ను విడిచిపోనే
అందకుండా ఉండిపోనే
ఆ: అడుగు దూరంలో ఉన్నావా
మాటవింటే మైకమొచ్చెనే॥అరె॥॥కళ్లలో॥
చరణం : 2
అ: హో... నిన్ను చూస్తే చాల్లే
గాజుపూల వర్షాలే
హో... నువు వస్తే చాలే జాజిపూల జంపాలే
ఆ: కోతలింక వద్దులేవయా సునో ప్రియా
ఊసుపోక ఊసులెన్నో విన్నానయా
ఆదమరచి ఆడుతున్న ఈ చెలియా
ఏరికోరి నీకు దిల్ దియా
అ: నిన్నుకోరి దూరం అంతా చేరువయ్యె చనువంత
ఆ: మనసులోని అణువణువంతా నిండిపోతే
తప్పుయేంటటా॥అరె॥

rangOli rangOli - రంగోలి రంగోలి

చిత్రం : బాద్‌షా(Baadshah) (2013)

రచన : రామజోగయ్యశాస్త్
సంగీతం : ఎస్.ఎస్.థమన్
గానం : దివ్యకుమార్, సోను కక్కర్


పల్లవి :
అతడు: రంగోలి రంగోలి
రంగోలి సింగారి బుగ్గల్లో
పొంగాలి (2)
ఆమె: పట్టూ చీరే కట్టాలి
అ: పట్టూ చీరే కట్టాలి
ఆ: సిగ్గూ చుక్కే పెట్టాలి
అ: సిగ్గూ చుక్కే పెట్టాలి
ఆ: గట్టి మేళం కొట్టాలి తాళిబొట్టే కట్టాలి
అ: పందిట్లో పిల్లా నీ చెయ్యి పట్టాలి
ఆ: పులి పులి పులి పులి రారా పులీ
బలి బలి అందాలన్నీ నీకే బలీ
అ: కలి కలి కలి మేరీ మస్సక్కలీ
ఇలా విల్లా విల్లామనాలిలే జెళ్లో మల్లి
చరణం :
ఆ: చిత్తూరు మావిళ్లు తినిపించరా
ఆ వేవిళ్లటేస్టేంటో చూపించరా
అ: అత్తూరు కౌగిళ్లు పంచివ్వనా
మెత్తాని పొత్తుల్లో అల్లాడించనా
ఆ: ఎత్తుల్లో లోయల్లో మత్తుల్లో మాయల్లో
నువ్వేం చేసుకున్నా నిన్నే కాదంటానా
అ: ఏ పిల్లో యాపిల్లో ఒంపుల్లో సొంపుల్లో
కులాసాల కుర్చీలే వేసెయ్యనా
' చీరే '

nAku nuvvu - నాకు నువ్వు

చిత్రం : నాని(nAni) (2004)

రచన : సిరివెన్నెల
సంగీతం : ఎ.ఆర్.రహమాన్
గానం : హరిహరన్, పూర్ణిమ
03 April - నేడు హరిహరన్ బర్త్‌డే(Hariharan birthday)
పల్లవి :
ఆమె: నాకు నువ్వు నీకు నేను
ఒక్కటైతే నువ్వు నేను
లోకమంటే మనమే అందామా
అతడు: ఒక్క నువ్వు ఒక్క నేను
ఎక్కువైతే ఒప్పుకోను
ఇంతకంటే ఎందుకనుకుందామా
ఆ: ఇష్టం వచ్చినట్టు ఉందాం...
అ: తోచినట్టు చేద్దాం
ఆ: ఇష్టం వచ్చినట్టు ఉందాం తోచినట్టు చేద్దాం
సమయాన్నే వెలేద్దాం సరసాన్నే పిలుద్దాం
అ: సమయాన్నే వెలేద్దాం సరసాన్నే పిలుద్దాం
ఈ ఏకాంతం మనకే సొంతం
ఈ మైకం ఒడిలో ఏకం అవుదాం॥నువ్వు॥
చరణం : 1
ఆ: చంటి పాపలాంటి మనసున్నవాడు
కొంటె కృష్ణుడల్లె మహ తుంటరోడు
మన్మథుడి కన్నా గొప్ప అందగాడు
నా మదినే దోచేశాడు
అ: ఎవరే అంతటి మొనగాడు...
ఏడే ఎక్కడ ఉన్నాడు
వాడేనా నీ జతగాడు... వదిలేస్తావా నా తోడు
ఆ: సరిసాటిలేని ఆ మగవాడు...
ఒకడంటే ఒక్కటే ఉన్నాడు
ఇటు చూడు ఇలాగ నా కంటిపాపలో
నువ్వే ఆ ఒక్కడు ॥నువ్వు॥
చరణం : 2
అ: చందమామ సిగ్గుపడి తప్పుకొని
సిగ్గులేని జంట ఇది అనుకుని
చక్కనైన నిన్ను చూసి చుక్కలన్ని ఆకాశంలో దాక్కొని
ఆ: అందం ఉన్నది నీకోసం...
ఇందా అన్నది సహవాసం
నీతోనే నా కైలాసం... నువ్వేగా నా సంతోషం
అ: ఇంకొక్కసారిలా ఈ సత్యం...
ఒట్టేసీ చెప్పని నీ స్నేహం
సుడిగాలిలాగ చెలరేగి పోదా మరి నాలో ఉత్సాహం॥నువ్వు॥

ompula vaikhari - ఒంపుల వైఖరి


చిత్రం : ఏప్రిల్ 1 విడుదల(April 1 viDudala) (1991)

రచన : సిరివెన్నెల
సంగీతం : ఇళయరాజా
గానం : ఎస్.పి.బాలు, చిత్ర, బృందం

పల్లవి :
అతడు: ఒంపుల వైఖరి సొంపుల వాకిలి
ఇంపుగ చూపవే వయ్యారి
ఆమె: వెల్లువ మాదిరి అల్లరి ఆకలి
ఎందుకు పోకిరి చాలు మరీ
అ: మోవినీ మగతావినీ ముడివేయనీయవా
ఆ: కాదనీ అనలేననీ గడి యైన ఆగవా
అ: అదుపూ పొదుపూ లేనీ ఆనందం కావాలి
బృందం: హద్దూ పొద్దూ లేనీ ఆరాటం ఆపాలి॥
బృందం: మాంగల్యం తంతునానేన
మమజీవన హేతునా
కంఠే భద్రామి శుభకే త్వం జీవ శరదస్యకం
త్వం జీవ
శరదస్యకం... (2)
చరణం : 1
అ: కాంక్షలో కైపు నిప్పూ ఎంతగా కాల్చినా
దీక్షగా ఓర్చుకున్నా మోక్షమే ఉండదా
ఆ: శ్వాసలో మోహదాహం గ్రీష్మమై వీచగా
వాంఛతో వేగు దేహం మరయాగ వాటికా
అ: కాలమే కాలిపోయే ఆజ్యమే పోయవా
మౌనమే గానమయ్యే మూర్తమే చూడవా॥
చరణం : 2
అ: నిష్ఠగా నిన్ను కోరీ నీయమమే దాటినా
కష్టమే సేద తీరే నేస్తమే నోచనా
ఆ: నిద్రహం నీరుగారే జ్వాలలో నించినా
నేర్పుగా ఈది చేరే నిశ్చయం మెత్తనా
అ: సోయగం సొంతమయ్యే స్వర్గమై చేరవా
ఆ: మధనమే అంతమయ్యే అమృతం అందుకో॥