Featured Post
dAchina dAgadu valapu - దాచిన దాగదు వలపు
dAchina dAgadu valapu - దాచిన దాగదు వలపు
చిత్రం : ఉయ్యాల జంపాల((UyyAla jampAla) (1965)రచన : ఆరుద్ర
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు
గానం : ఘంటసాల, పి.సుశీల
31 August - నేడు ఆరుద్ర జయంతి, పెండ్యాల నాగేశ్వరరావు వర్ధంతి
పల్లవి :
ఇక దాగుడుమూతలు వలదు॥
చక్కని కోపము చల్లని తాపము (2)
ఎందుకు మనలో మనకు ॥
చరణం : 1
కనుచూపుల కమ్మని కులుకు
నను దోచుట మునుపే తెలుసు॥
మనసంతా తనదైతే మరి చోరీ ఎందులకు
పూసలో దారమై... పూవులో తావియై (2)
కలిసెను మనసు మనసు॥
చరణం : 2
ఒక తీయని మైకము కలిగే
నెరవెన్నెల కన్నుల వెలిగే
॥తీయని॥
కలలందు హృదయాలు
వినువీధులలో ఎగిరే
ఇరువురూ ఏకమై
ఒక్కటే ప్రాణమై
ఇరువురూ ఏకమై
ఒక్కటే ప్రాణమై
ముచ్చట గొలుపగ వలయు॥
nEDu SrIvAriki mEmaNTE - నేడు శ్రీవారికి మేమంటే
nEDu SrIvAriki mEmaNTE - నేడు శ్రీవారికి మేమంటే
చిత్రం : ఇల్లరికం(Illarikam) (1959)రచన : ఆరుద్ర, సంగీతం : టి.చలపతిరావు
గానం : ఘంటసాల, పి.సుశీల
30 August - నేడు జమున పుట్టినరోజు
(Jamuna Birth Day)
పల్లవి :
నేడు శ్రీవారికి మేమంటే పరాకా... ఆ...
తగని బలే చిరాకా...
ఎందుకో తగని బలే చిరాకా... ఆ...
నేడు శ్రీవారికి మేమంటే పరాకా
చరణం : 1
మొదట మగవారు వేస్తారు వేషాలు
పెళ్లి కాగానే చేస్తారు మోసం
ఆ... ఆడవారంటే శాంత స్వరూపాలే
కోపతాపాలు రావండి పాపం
కోరి చేరిన మనసు చేత చిక్కిన అలుసు (2)
కొసకు ఎడబాటు అలవాటు చేస్తారు
నేడు శ్రీమతికి మాతోటి వివాదం
తగువే బలే వినోదం...
ఎందుకో తగువే బలే వినోదం... ఊ...
నేడు శ్రీమతికి మాతోటి వివాదం
చరణం : 2
వారి మనసైతే వస్తారు ఆడవారు
చేర రమ్మంటే రానేరారు
ఆ... తెలుసుకున్నారు స్త్రీల స్వభావాలు
తెలిసి తీర్చారు ముద్దు మురిపాలు
అలుక సరదా మీకు అదే వేడుక మాకు (2)
కడకు మురిపించి గెలిచేది మీరేలే...
ప్రణయ కలహాల సరసాలే వినోదం
నిజమే బలే వినోదం...
ఆ... నిజమే బలే వినోదం (2)
neekOsam neekOsam - నీకోసం నీకోసం
neekOsam neekOsam - నీకోసం నీకోసం
చిత్రం : నేనున్నాను(nEnunnAnu) (2004)రచన : సిరివెన్నెల, సంగీతం : ఎం.ఎం.కీరవాణి
గానం : కె.కె., శ్రేయాఘోషల్
29 August - నేడు నాగార్జున బర్త్‌డే
(nAgArjuna Birth Day)
వానల్లో వాగుల్లాగ వయసు ఎవరికోసం
తోం ధిరి... తోం ధిరి... తోం ధిరి ధిరి ధిరి ధిరి
ధిరి తోం ధిరి
శీతాకాలం ఎండల్లాగ సంక్రాంతి పండుగలాగ
సొగసు ఎవరికోసం
తోం ధిరి... తోం ధిరి... తోం ధిరి ధిరి ధిరి ధిరి
ధిరి తోం ధిరి
ఓరోరి అందగాడా నన్నేలు మన్మథుడా...
నీకోసం నీకోసం... నీకోసం... (2)
నీ సిగ్గుల వాకిట్లో నా ముద్దుల ముగ్గేసి
నే పండగ చేసి సందడివేళ ఆకూ వక్క సున్నం
నీకోసం... నీకోసం... నీకోసం... (2)
చరణం : 1 గుండె చాటుగా ఉండనందిక
ఇన్నినాళ్లు దాచుకున్న కోరిక
ఉన్నపాటుగా ఆడపుట్టుక
కట్టుబాటు దాటలేదుగా
కన్నెవేడుక విన్నవించగా
అందుబాటులోనే ఉన్నానుగా
తీగచాటుగా మూగపాటగా
ఆగిపోకే రాగమాలిక
నిలువెల్ల నీ జతలోన చిగురించు లతనై రానా
కొనగోటి కొంటెతనాన నిను మీటనా చెలివీణ
అమ్మమ్మో అబ్బబ్బో ఆ ముచ్చట తీరంగా
నీ మెళ్లో హారంగా
నా రేకులు విచ్చే సోకులు తె చ్చి
అందిస్తున్నా మొత్తం
నీకోసం... నీకోసం... నీకోసం... (2)
చరణం : 2 సిగ్గు పోరిక నెగ్గలేవుగా
ఏడుమల్లెలెత్తు సుకుమారమా
సాయమీయక మోయలేవుగా
లేత సోయగాల భారమా
కౌగిలింతగా స్వాగతించగా
కోరుకున్న కొంగు బంగారమా
తాళిబొట్టుగా కాలిమెట్టెగా
చేరుకోవా ప్రేమ తీరమా
మునిపంటి ముద్దర కానా
చిగురంటి పెదవుల పైన
మురిపాల మువ్వను కానా
దొరగారి నవ్వులలోన
నిద్దర్లో పొద్దుల్లో నీ వద్దకు నేనొచ్చి
ఆ హద్దులు దాటించి
నువ్వొద్దనలేని పద్ధతిలోని ముద్దులెన్నో తెచ్చా
నీకోసం... నీకోసం... నీకోసం... (2)//వేసంకాలం//
vEsamkAlam vennEllAga - వేసంకాలం వెన్నెల్లాగ
vEsamkAlam vennEllAga - వేసంకాలం వెన్నెల్లాగ
చిత్రం : నేనున్నాను(nEnunnAnu) (2004)రచన : సిరివెన్నెల, సంగీతం : ఎం.ఎం.కీరవాణి
గానం : కె.కె., శ్రేయాఘోషల్
29 August - నేడు నాగార్జున బర్త్‌డే
(nAgArjuna Birth Day)
వానల్లో వాగుల్లాగ వయసు ఎవరికోసం
తోం ధిరి... తోం ధిరి... తోం ధిరి ధిరి ధిరి ధిరి
ధిరి తోం ధిరి
శీతాకాలం ఎండల్లాగ సంక్రాంతి పండుగలాగ
సొగసు ఎవరికోసం
తోం ధిరి... తోం ధిరి... తోం ధిరి ధిరి ధిరి ధిరి
ధిరి తోం ధిరి
ఓరోరి అందగాడా నన్నేలు మన్మథుడా...
నీకోసం నీకోసం... నీకోసం... (2)
నీ సిగ్గుల వాకిట్లో నా ముద్దుల ముగ్గేసి
నే పండగ చేసి సందడివేళ ఆకూ వక్క సున్నం
నీకోసం... నీకోసం... నీకోసం... (2)
చరణం : 1 గుండె చాటుగా ఉండనందిక
ఇన్నినాళ్లు దాచుకున్న కోరిక
ఉన్నపాటుగా ఆడపుట్టుక
కట్టుబాటు దాటలేదుగా
కన్నెవేడుక విన్నవించగా
అందుబాటులోనే ఉన్నానుగా
తీగచాటుగా మూగపాటగా
ఆగిపోకే రాగమాలిక
నిలువెల్ల నీ జతలోన చిగురించు లతనై రానా
కొనగోటి కొంటెతనాన నిను మీటనా చెలివీణ
అమ్మమ్మో అబ్బబ్బో ఆ ముచ్చట తీరంగా
నీ మెళ్లో హారంగా
నా రేకులు విచ్చే సోకులు తె చ్చి
అందిస్తున్నా మొత్తం
నీకోసం... నీకోసం... నీకోసం... (2)
చరణం : 2 సిగ్గు పోరిక నెగ్గలేవుగా
ఏడుమల్లెలెత్తు సుకుమారమా
సాయమీయక మోయలేవుగా
లేత సోయగాల భారమా
కౌగిలింతగా స్వాగతించగా
కోరుకున్న కొంగు బంగారమా
తాళిబొట్టుగా కాలిమెట్టెగా
చేరుకోవా ప్రేమ తీరమా
మునిపంటి ముద్దర కానా
చిగురంటి పెదవుల పైన
మురిపాల మువ్వను కానా
దొరగారి నవ్వులలోనhttp://www.blogger.com/img/blank.gif
నిద్దర్లో పొద్దుల్లో నీ వద్దకు నేనొచ్చి
ఆ హద్దులు దాటించి
నువ్వొద్దనలేని పద్ధతిలోని ముద్దులెన్నో తెచ్చా
నీకోసం... నీకోసం... నీకోసం... (2)//వేసంకాలం//
External Link:
NEnunnAnu Audio Songs | 1 |
manasainA chelI pipupU - మనసైనా చెలీ పిలుపూ
manasainA chelI pipupU - మనసైనా చెలీ పిలుపూ
చిత్రం : జయసింహ(jaya simha) (1955)రచన : సముద్రాల జానియర్
సంగీతం : టి.వి.రాజు
గానం : రావుబాలసర్వసతీదేవి, ఎ.పి.కోమల
28 August - నేడు రావుబాలసర్వసతీదేవి, ఎ.పి.కోమల పుట్టినరోజు
(Rao Bala Sarva satI Devi, A.P. kOmala Birth Day)
పల్లవి :
వినరావేల ఓ చందమామా॥
చరణం : 1
పిలిచీ నిన్నే నే వలచాననా
బిగిసేరూ మగవారలూ॥
ఓ... తలచేరులే చెలి నిను చౌకగా
వలచేనే ననూ జాబిలీ... ఓ...
అదొ నవ్వేను నను చూచి (2)
నను కవ్వించి ఆడేను దోబూచి
అదొ నవ్వేను నను చూచి
చరణం : 2
లే నవ్వుల తొలి లాలింతురే
తుది కన్నీట తేలింతురే॥నవ్వుల॥
ఓ... నమ్మేదేలా మనసమ్మేదెలా
మనసేనాడో ఆ రాజు
సొమ్మాయెనే... ఓ...॥
Soundtrack
Are Ni Sa Ga Ma Pa Lokam Mosam (Singer: Pithapuram Nageswara Rao)
Eenaati Eehaayi Kalakadoyi Nijamoyi (Singers: P. Leela and Ghantasala Venkateswara Rao)
Jaya Jaya Srirama Raghuvaraa Subhakara Srirama (Singer: Ghantasala Venkateswara Rao; Cast: Gummadi Venkateswara Rao)
Jeevitamintele Manava Jeevitamintele (Singer: M. S. Rama Rao)
Kondameeda Kokkirayi Kaalujari Koolipoye (Singer: K. Rani)
Madiloni Madhurabhavam Palikenu Mohanaragam (Singers: Ravu Balasaraswathi and Ghantasala Venkateswara Rao)
Manasaina Cheli Pilupu Vinaravela O Chandamama (Singers: Ravu Balasaraswathi and A. P. Komala)
Muripemumeera Meekorikateera Vaarampina Kanukale (Singers: A. P. Komala and K. Rani)
Nela Nadimi Vennela Hayee Kanapadau Amasa Reyi (Singer: Jikki Krishnaveni)
Tandana Hoyi Tandana (Burrakatha) (Singers: Ghantasala and A. P. Komala)
oka manasutO - ఒక మనసుతో
oka manasutO - ఒక మనసుతో
చిత్రం : ఈ అబ్బాయి చాలా మంచోడు (Ee Abbai ChAla ManchODu) (2003)రచన : చంద్రబోస్
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
గానం : ఎం.ఎం.కీరవాణి, గంగ
పల్లవి :
ముడి ఎట్టావేస్తావూ
ఆ ముడి ఒక కొంగుముడయ్యేదాకా
ఊరుకోవూ ప్రేమా... ఆ...॥మనసుతో॥
చరణం : 1
పసిపాపలో ముసినవ్వులా
కపటాలు లేని ప్రేమా
మునిమాపులో మరుమల్లెలా
మలినాలు లేని ప్రేమా
అరచేతిలో నెలవంకలా
తెరచాలుటోని ప్రేమా
నదిగొంతులో అలపాటలా
తడబాటులేని ప్రేమా
మనసుల కలివిడి ఫలితం ప్రేమ...
తనువుల తాకిడి కాదు సుమా
అనంత జీవయాత్రలోను
తోడు ప్రేమా...
ప్రేమా... ఆ... ॥మనసుతో॥
చరణం : 2
అధరాలలో తడి మెరుపులా
మెరిసేది కాదు ప్రేమా
హృదయాలలో ధృవతారలా
అలరారుతుంది ప్రేమా
పరువాలతో కరచాలనం
చేసేది కాదు ప్రేమా
ప్రాణాలలో స్థిరబంధనం
నెలకొల్పుతుంది ప్రేమా
మమతల అమృతవర్షిణి ప్రేమ
కోర్కెల అలజడి కాదు సుమా
నిశీధిలోనూ వీడిపోని నీడ ప్రేమా
ప్రేమా... ఆ ఆ ఆ ఆ ఆ...॥మనసుతో॥
E Abbayi Chala Manchodu - Oka Manasutho - Love Song
Listen Audio Songs:
Ee Abbai ChAla ManchODu | 1 |
sa~mkurAtri kODi - సంకురాత్రి కోడి
sa~mkurAtri kODi - సంకురాత్రి కోడి
చిత్రం : యువ(Yuva) (2004)రచన : వేటూరి
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
గానం : మధుశ్రీ, ఎ.ఆర్.రెహమాన్
పల్లవి :
కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా॥
చేయి వేస్తే చెంగు జారే కుయ్యో మొర్రో
నువ్వు రెండు మూరల పానుపెయ్యరా
జగడం వచ్చినా తాకవద్దయా॥
కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా
అయ్యా... కొంచెం కొంచెం
కొరుక్కు తినవయ్యా
అయ్యా... నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా
చరణం : 1
ఆకు వక్క వేసినా నోరు పండదేమి
ఒక్క పంటి కాటుకే ఎర్రనౌను సామీ
స్వర్గం సుఖం పొందేటి దారి చూపవేమి
ఆ... వీధి అరుగు మీదే దోచుకున్న వలపు
వడ్డీలాగ పెరిగే నెలలు నిండనివ్వు
కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా
అయ్యా... నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా॥
చరణం : 2
మేడ మిద్దెలేలా చెట్టు నీడ మేలు
మెత్త దిండు కన్నా ఉత్త చాప మేలు
ముక్కెర్ల వెలుగుల్లో రేయి తెలవారు
ఆ... చప్ప ముద్దు పెడితే ఒళ్లు మండిపోదా
సాహసాలు చే స్తే చ ల్లబడిపోనా
కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా
అయ్యా... నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా॥
kaLakaLalu kilakilalu - కళకళలు కిలకిలలు
kaLakaLalu kilakilalu - కళకళలు కిలకిలలు
చిత్రం : తమ్ముడు(tammuDu) (1999)రచన : చంద్రబోస్
సంగీతం : రమణగోగుల
గానం : ఎస్.పి.బాలు, బృందం
పల్లవి :
కొత్తగ చేరెను మా ఎదగూటికి
వెలుతురులు వెన్నెలలు
ఎదురుగా నిలిచెను మా కన్నులకి
రాముడికి జానకికి పెళ్లి కుదిరినది
ఈ సందడికి విందులకి
ఇల్లు మురిసినది
గల గల కళకళలు కిలకిలలు॥
చరణం : 1
నమ్మలేని లోకం నుంచి
మహాలక్ష్మిలాగా
అమ్మలేని మా ఇంట్లోకి
వదినమ్మ రాకా
ఎన్నడైన తన వెనకాలే
ఉంటాను కనకా
అన్నగారు తననేమన్నా
ఊరుకోను ఇంకా
నా చిన్ని అల్లర్లన్నీ భరించాలి
అంతా ఓర్పుగా
చరణం : 2
మెట్టినింటి దీపం నీతో వెలగాలి మళ్లీ
కూతురంటి రూపం నీదే నా చిట్టితల్లి
ఆశలన్నీ అక్షింతలుగా జరగాలి పెళ్లి
అందమైన జంటను చూసి
మురవాలి తాళి
విడిది నేను ఇస్తానంటూ
తపించాలి నింగిన జాబిలి॥
Thammudu Song With Lyrics - Kalakalalu (Aditya Music)
Watch remaining Songs With Lyrics:
"Made in Andhra student " (Lyrics: Chandra Bose; Singer: Ramana Gogula)
"Vayyari Bhama" (Lyrics: Sirivennela Sitaramasastri; Singer: Ramana Gogula)
"Edola vundi" (Lyrics: Surendra Krishna; Singer: Ramana Gogula)
"Pedavi datani matokati undi " (Lyrics: Sirivennela Sitaramasastri; Singers: Ramana Gogula, Sunitha)
"Travelling soldier" (Lyrics: Ramana Gogula; Singer:Ramana Gogula)
"College blues" (Lyrics: Ramana Gogula; Singer: Ramana Gogula)
"Kala kala ku Kila kila lu" (Lyrics: Chandra Bose; Singer: S.P. Balu)
love you chebutOndi - లవ్ యు చెబుతోంది
love you chebutOndi - లవ్ యు చెబుతోంది
చిత్రం : మేం వయసుకు వచ్చాం(mEm vayasuku vachAm) (2012)రచన : భాస్కరభట్ల రవికుమార్
సంగీతం : శేఖర్‌చంద్ర, గానం : రేవంత్
సాకీ :
లవ్ చేయవా లవ్ చేయవా
లవ్ యు చెబుతోంది మై హార్ట్ టు యు
దట్ మై లవ్ ఈజ్ ట్రూ
ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యూ
ప్లీజ్ లవ్ మీ...
దిసీజ్ మై లవ్ సాంగ్ ఫర్ యూ
లవ్ యు అంటోంది
హార్ట్ బీట్ పల్స్ రేట్ ైరె జ్ అయ్యి
మైండ్ జామ్ అయ్యి గిలగిల తిరిగిందే
ఐ లవ్ యు... లవ్ యు లవ్ యు లవ్ యు...
పల్లవి :
లవ్ యు చెబుతోంది నా మనసు నీకు (2)
లవ్ యు టూ అంటే ఏం పోద్దే నీకు॥ యు॥
హే... బుక్స్ చూసినా లుక్స్ నీ పైనే
రెండు రెళ్లు 143 అంటున్నానే
ఫస్ట్‌ర్యాంక్ కుర్రాడ్ని చెడగొట్టావే
హార్ట్‌లోన లవ్ బెల్లు మోగించావే
చరణం : 1
ఏం మాయ చేశావో నాలో నేనే మిస్సింగు
ఆదమరచి ఆల్వేస్ నీ గురించే థింకింగ్
బెస్ట్ బెస్ట్ ఫె్రండ్సంతా జస్ట్ లవ్వు బోరింగు
బాత్‌రూమ్‌లో కూడా నీ పేరే హమ్మింగ్
ఊ అని ఎప్పుడంటావో
అని వెయిటింగ్ ఓలమ్మీ॥ యు॥
లవ్ యు చెబుతోంది నా మనసు నీకెహే
ఓ లవ్ సేయవా లవ్ సేయవా
ఓసారి లవ్ సేయవా ॥సేయవా॥
లవ్ సేత్తే ఏం పోద్దే నీ సొమ్మేం పోతుందో
లవ్ సేత్తే ఏం పోదే ... ఒకసారి ఇటు సూడవే
చరణం : 2
ఆ... నా కళ్లు నీ కోసం డే అండ్ నైటు సెర్చింగ్
నువ్వు నాకు దూరమైతే ఆగిపోద్దే బ్రీతింగ్
ఫుడ్ మాని రాశానే బ్లడ్ తోటి గ్రీటింగు
సిగ్గు విడిచి చెబుతున్నా చిట్టి గుండె బెగ్గింగు
ఫిక్స్ నేను అయిపోయా నా డార్లింగ్ నువ్వనీ॥ యు॥
లవ్ యు చెబుతోంది నా మనసు
ఇదిగో నీకేనెహే...
sunday ananurA monday - సండే అననురా మండే
sunday ananurA monday - సండే అననురా మండే
చిత్రం : గ్యాంగ్‌లీడర్(gang leader) (1991)రచన : భువనచంద్ర, సంగీతం : బప్పీలహరి
గానం : ఎస్.పి.బాలు, చిత్ర
22 August - నేడు చిరంజీవి బర్త్‌డే
(Chiranjeevi Birth Day)
పని సాససా పని సాససా
సగ మామమా సగ మామమా ఆరె హా హా...
ఆ... సండే అననురా మండే అననురా
ఎన్నడూ నీ దానరా
నా రాజా రా ఇటు రా... (2)
చెట్టులెక్కమన్నానా పుట్టలెక్కమన్నానా
లవ్వాడమన్నాను రా
నా రాజా రా ఇటు రా... (2)
పని సాససా ఉహు..
పని సాససా హహ హాహహా
సగ మామమా హెహె హెహెహే
సగ మామమా ఓహొహో ఆరె హా హా...
చరణం : 1
బావయ్యో బావయ్యో ఎంచక్కా రావయ్యో
మన మధ్య తడికెందుకంటా బావోయ్
ముద్దుల్లో ముంచెత్తమంటా
ఓ ఓ హోయ్... గయ్యాళి గంగమ్మో
సిగపట్ల సింగమ్మో
న సమాని దయచేయమంట పిల్లా
నువ్వంటే నాకొళ్లు మంట
అదుగో పక్క... ఇదుగో చుక్క...
అసలే ఉక్క... పోవే తిక్క...
అరె హా హా... //పని సాససా// //సండే//
చరణం : 2
ఆ తట్టు వెడదామా ఓ పట్టు పడదామా
చిరుగాలి కొట్టిందిరయ్యో హయ్యో
ఒళ్లంతా సెగలే బావయ్యో
ఓ ఓ హోయ్... ఒళ్లంతా సెగలైతే
వగలెందుకే వనజమ్మా
నీ ఆట ఇక సాగదమ్మా గుమ్మ గుమ్మా గుమ్మా
నీ పిచ్చి కుదిరిస్తానమ్మో...
అయ్యో రాత... వినవా గీత...
ఆపై మోత... పెడతా వాత
అరె హా హా...
చక చాచచ ఉహు...
చక చాచచ హాహహా
ఛీఛీ ఛీఛీఛీ ఆరే రారరా
తుతు తూతుతు ఆరే హహ హాహ
అరె హ హ హ హ హ హ హాహా... //సండే//
sarisarI vagalu telisera - సరిసరీ వగలు తెలిసెర
sarisarI vagalu telisera - సరిసరీ వగలు తెలిసెర
రచన : డా॥సి.నారాయణరెడ్డి
సంగీతం: పి.ఆదినారాయణరావు, గానం: పి.సుశీల
21 August - నేడు పి.ఆదినారాయణరావు జయంతి
పల్లవి :
చిగురు సొగసులు నీవే లేరా... ఆ...॥
చెంతకు రమ్మన చేరనంటినా... ఆ...
చెక్కిలినొక్కిన కూడదంటినా... ఆ...॥
తొలిఝామైన కానిదే (2)
తొందర ఎందుకు ఎందుకంటిరా
చరణం : 1
ఆ... మంచిగంధం పూయకముందే
మల్లెమొగ్గలు చల్లకముందే (2)
కులుకుటందెలు మోగకముందే
కొత్త జావళి పాడకముందే
గరిస నిపమప ససని ససనిసని
నినిప నినిపనిప
మగప మనిపసని పపాని
పమగమ గపామగ సనిస
ఆ... ఆ... ఆ...
కొత్త జావళి పాడకముందే
కంటి గిలుపుల జంట తలపుల
కొంటి చేతల కవ్వింతలింకేల చాలించవేరా॥
చరణం : 2
ఆ... పండువెన్నెల
పానుపు చేసి
పైట కొంగున వీవన వీచీ
వేడిముద్దులు కానుక చేసి
విడని కౌగిట బందీచేసి
ఎన్నడెరుగని
వన్నెతరుగని
కన్నెవలపులు అందించి
అందాలు చిందింతులేరా॥
Bhakta Tukaram Movie Songs - Sari Sari Vagalu Thelipera Gadasari Song
chilakA O pa~nchara~mgula - చిలకా ఓ పంచరంగుల
chilakA O pa~nchara~mgula - చిలకా ఓ పంచరంగుల
చిత్రం : జాతకరత్న మిడతంభొట్లు(jAtakaratna miDatambhoTlu) (1971)రచన : అప్పలాచార్య
సంగీతం : ఎస్.పి.కోదండపాణి
గానం : మాధవపెద్ది సత్యం, ఎల్ .ఆర్ .ఈశ్వరి
20 August - నేడు పద్మనాభం జయంతి
PadranAbham Birthday
పల్లవి :
మొలకా చిరునవ్వుల బంగరుగిలకా॥
ముద్దుగ నీవు పలుక పులకరించునే నా పిలక
ముద్దుగ నీవు పలుక పులకరించునే నా పిలక
మిడతా ఓ పచ్చని రెక్కల మిడతా
విన్నాలే నగరములో నీ ఘనత॥
వలపుల తాయం పెడితే నీ వలలో నేనే పడతా
వలపుల తాయం పెడితే నీ వలలో నేనే పడతా
చిలకమ్మా... అహ మిడతయ్యా...
చరణం : 1
అయ్యయ్యో ఏమిటిది అమ్మా నాన్నా వస్తారూ
అబ్బబ్బో వాళ్లొకరూ మనపాలిటి దెయ్యాలూ॥
తిట్టకు తిట్టకు మన గుట్టు బయటపెట్టకు
గుట్టు రట్టు చేశావంటే
నాన్నకు వచ్చును కోపం
మన ప్రేమకు తెచ్చును మోసం॥
మీ అబ్బకు కోపం రానీ
మీ అమ్మకు తాపం కానీ
జేజెమ్మను తీసుకురానీ
పెళ్లి ఔతుంది దిగులేం నీకు
రాత్రి వచ్చింది కల ఒకటి నాకు
చిలకమ్మా... అహ మిడతయ్యా...
చరణం : 2
ఆ లోకంలో బ్రతుకే చాలా కష్టము
ఈ లోకంలో ఏమిచేసినా మన ఇష్టము॥లోకంలో॥
చిలక మిడతల కళ్యాణం చూతము రారండీ
చిలక మిడతల కళ్యాణం చూతము రారండీ
మల్లెపువ్వులే తలంబ్రాలుగా
పళ్లు ఫలాలు భోజనాలుగా
ముది ఏనుగులే ముత్తైలుగా
నీ కూతురు కులుకుతు ఉన్నది చూడు
చక్కగ దొరికెను అల్లుడుగారూ
కనులకు చెవులకుhttp://www.blogger.com/img/blank.gifhttp://www.blogger.com/img/blank.gif విందే నేడూ
బాతుల కచ్చేరీ ఉన్నదట
మన కోతుల నాట్యం జరుగునట
మిడతయ్యా... చిలకమ్మా...
Watch Remaining Songs:
Ammammo Ayyayyo Talaleni badhara
Ika Naa Paata Vinavaa O priyaa
Bangaru talli Naa Chellelu
Nee Cheyi Naa Cheyi Penavesi basa cheyi
Sanidapa Daya choodave Gadidaa
Chinnari Rani Sirimalle Puvu
Chilaka O Panchavannela Chilakaa
Cheliya Sakhiya Emee
Watch Full Movie:
Jatakaratna Midathambotlu
Jatakaratna Midathambotlu
mee intiki mundO gate - మీ ఇంటికి ముందో గేటు
mee intiki mundO gate - మీ ఇంటికి ముందో గేటు
చిత్రం : జులాయి(julAyi) (2012), రచన : శ్రీమణిసంగీతం : దేవిశ్రీ ప్రసాద్, గానం : సాగర్, రనీన రెడ్డి
పల్లవి :
అది దూకాలంటే డౌటు
మీ రోడ్లో వెలగదు లైటు
నాకసలే తెలియని చోటు
ఆ గేటుకు ముందో డాగు
అది అంది బాబు ఆగు
దాని నోట్లో ఎన్నో పళ్లు
అది చూస్తే వణికెను ఒళ్లు
మీ ఇంటికి ముందో బెగ్గర్
అడొంటికి చిల్లుల నిక్కర్
ఆడి కంటికి నేనో జోకర్‌లాగా కనిపిస్తున్నానే
నువు మేల్కొని బాల్కని గోడని దూకేస్తే
తీసేద్దాం తీసేద్దాం ప్రేమ తాట తీసేద్దాం
చేసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం॥
చరణం : 1
హే... కోఠిలో ఉందో కాఫీ హౌస్
క్యాప్చినోకి అది ఫేమస్
నురగలు కక్కే కాఫీ కప్స్
తగిలాయో నీ చె ర్రీ లిప్స్
టేబుల్ కింద చేతులు
చేస్తాయి ఎంతో రొమాన్స్
ఓయ్ కాఫీ తాగేదా నీ ఫేస్
నీ ఎదవ ఐడియా
నాకు తెలుసు
జబ్బలు దాచని స్లీవ్ లెస్
మోకాలు దాటని
మినీ స్కర్ట్స్
ఆకలి నిండిన నీ చూపులతో ఎంతో న్యూసెన్స్
హేయ్ అట్టా కాదే చిట్టీ నాకో నాటీ థాటే తట్టి
అందరి ముందర పట్టి నీకో ఫ్రెంచ్ ముద్దే పెట్టి
నా ఊపుకి షాప్‌కి టాప్ లేచిపోయేలా॥
చరణం : 2
ఓల్డ్ సిటీలో ఉందో సినిమా హాలు
అక్కడ ఆడేవన్ని లవ్‌స్టోరీలు
పాప్‌కార్న్ తింటూ ఒకటో రీలు
పావ్‌బాజీతో ఇంటర్వెల్
పావుగంటకో డ్యూయెట్ చూస్తూ
దిద్దేద్దాం ప్రేమ అ ఆ లు
ఆపరా బాబు కహానీలు
పెట్టకు నాకు చెవిలో పూలు
ఖాళీ హాల్లో కార్నర్ సీటు
ఒకే కూల్ డ్రింక్ రెండు స్ట్రాలు
అక్కడ ఇక్కడ చేతులు వేస్తూ
చేస్తావెన్నో ఎక్స్‌ట్రాలు
హేయ్ అల్లా కాదే పిల్ల నీతో నేనే వేగేదెల్లా
అల్లా జీసస్ మళ్లా పుట్టి నిన్నే నమ్మించాలా
నా మాటిని మ్యాట్నీ ఆటకు వచ్చేస్తే॥
Julayi Full Songs With Lyrics - Mee intiki Mundhu Song
hEy takadimi tOm - హేయ్ తకదిమి తోం
hEy takadimi tOm - హేయ్ తకదిమి తోం
చిత్రం : ఆర్య(Aarya)(2004), రచన : సురేంద్రకృష్ణసంగీతం : దేవిశ్రీ ప్రసాద్, గానం : టిప్పు
పల్లవి :
చిందులు వేసే వయసుకి తకదిమి తోం
తకదిమి తోం తకదిమి తోం
సరిగమ పదమని తకదిమి తోం
ఉరకలు వేసే మనసుకు తకదిమి తోం
కష్టం నష్టం ఎదురైన నచ్చినదె చేసేద్దాం
అలవాటైతే చేదైనా తకదిమి తోం
తప్పో ఒప్పో చేసేద్దాం
తొలి అడుగే వేసేద్దాం
అనుభవమైతే ఏదైనా తకదిమి తోం
కృషి ఉంటే నీ వెంటేరా ఈ లోకం
గాయేంగె జోష్ కరియె
జీయేంగె ప్యార్ కరియె॥తోం॥
చరణం : 1
చిరునవ్వుతో అటు చీకటిని
ఇటు ఓటమిని తరిమెయ్యరా
ఆ ఓర్పుకి తకదిమి తోం
ఉల్లాసమె ఓ వెల్లువల
ఓ ఉప్పెనలా ఉరకాలిరా
ఆ జోరుకి తకదిమి తోం
పరిగెడదాం పరిగెడదాం
గెలిచే వరకు పరిగెడదాం
గురి చూశాక మనకింక తిరుగేది
గాయేంగె జోష్ కరియె॥తోం॥
చరణం : 2
నీ మాటతో అటు నిశ్శబ్దం
ఇటు ఓ యుద్ధం ఆగాలిరా
ఆ నేర్పుకి తకదిమి తోం
నా ప్రేమతో ఆ శత్రువునె
ఓ మిత్రునిగా మార్చాలిరా
ఆ గెలుపుకి తకదిమి తోం
ఒకటౌదాం ఒకటౌదాం
ప్రేమను పంచగ ఒకటౌదాం
ప్రేమించే మనసుంటే మహరాజే
జీయేంగె ప్యార్ కరియె॥తోం॥
hEy takadimi tOm takadimi tOm tarikiTa tarikiTa takadimi tOm
chindulu vEsE vayasuki takadimi tOm
takadimi tOm takadimi tOm sarigama padamani takadimi tOm
urakalu vEsE manasuku takadimi tOm
kashTam nashTam yeduraina nacchinade chEsEddaam
alavaaTainaa chEdainaa takadimi tOm
tappO voppO chEsEddaam toli aDugE vEsEddaam
anubhavamaitE Edainaa takadimi tOm
kRushi vunTE nee venTEraa ee lOkam
gaayEnge jOsh kariye jeeyEnge pyaar kariye
chirunavvutO aTu cheekaTini iTu OTamini tarimeyyaraa
aa Orpuki takadimi tOm
ullaasame O velluvala O uppenalaa urakaalira
aa jOruki takadimi tOm
parigeDadaam parigeDadaam gelichE varaku parigeDadaam
guri choosaaka manakinka tirugEdi
gaayEnge jOsh kariye
nee maaTato aTu nissyabdam iTu O yuddham aagaaliraa
aa nErpuki takadimi tOm
naa prEmato aa Satruvune O mitrunigaa maarchaaliraa
aa gelupuki takadimi tOm
okaToudaam okaToudaam prEmanu panchaga okaToudaam
prEminchE manasunTE maharaajE
jeeyEnge pyaar kariye
EllElama - ఏల్లేలమా
EllElama - ఏల్లేలమా
చిత్రం: 7 సెన్స్(7th sense) (2011), రచన: భువనచంద్ర, సంగీతం: హారీస్ జయరాజ్గానం: విజయ్ ప్రకాష్, కార్తీక్, షాలిని, రీటా
సాకీ :
ఏ మల్లాయిమ్మ మల్లాయిమ్మ మమ్మమమ్మా
వావాక్కా...
పల్లవి :
ఏల్లేలమా ఏలే ఏలమా
నా లోపల నువ్వే ప్రాణమా
సింగారమా నవ సింగారమా
మందారమై ఒళ్లో చేరుమా
నా గుండె కొలనులో
నువు పాదం పెడితే కులాసా
మొగమాటం చెదిరితే
మగవాడికి ఎంతో దిలాసా
సయ్యాటకు హద్దు లేదే మరి శిరీషా...
ఏల్లేలమా ఏలే ఏలమా
నా లోపల నువ్వే ప్రాణమా
శృంగరమా నవ శృంగరమా
భూకంపమై ఒళ్లో వాలుమా
నా గుండె కొలనులో
నీ పాదం పెడితే కులాసా
బులపాటం రగిలితే
ప్రియురాలికి ఎంతో దిలాసా
సరదాకే హద్దులేదు మరి చలోనా...
చరణం : 1
అరె న్యూటన్ చెప్పాడుగా
భూమి సూపర్ మ్యాగ్నెట్టని
ఇక నేను అంటానులే
నువ్వు నా లవ్ మ్యాగ్నెట్ అనీ
మూనై ఓ నేస్తమా ఇక చేస్తా ప్రదక్షిణం
నా ఎదలో సంగీతమై అలరించే అనుక్షణం
సెక్సీ వింటర్‌లో నా బాడీ హీటర్ నువ్వేగా
బర్నింగ్ సమ్మర్‌లో నా లవ్లీ కూలర్ నువ్వేగా
హోలీ హాంకాంగ్ సడిలో మిక్సైపోదాం పోరీ॥॥మల్లాయిమ్మ॥
చరణం : 2
సుడిగాలై కమ్మేయనా
చిరు ముద్దై చంపేయనా
ఎద పొంగే ఆనందమై
పరువాన్నే గుప్పేయనా
ఔనా ప్రియా ప్రియా నీ సొగసే హిమాలయ
పట్టేస్తే నీ కొంగుతో
చుట్టేయనా తస్సాదియ్యా
ఇరువురం మరో కొత్త ప్లానెట్‌లోకి పోదామా
డేలైట్‌నంతా మాయం చేసిhttp://www.blogger.com/img/blank.gif
మూన్‌లైట్‌లోనే ఉందామా
బిడియాలన్నీ రద్దే చేసి
ఎంజాయ్ చేద్దాం రావే ॥
Yellelama 7th sense Telugu Full song hd
Audio:
7th Sense Songs | Link |
vaddurA kannayyA - వద్దురా కన్నయ్యా
vaddurA kannayyA - వద్దురా కన్నయ్యా
చిత్రం : అర్ధాంగి(arthAngi) (1955), రచన : ఆత్రేయసంగీతం : బి.నరసింహారావు-అశ్వత్థామ
గానం : జిక్కి
16 August - నేడు జిక్కి వర్ధంతి
పల్లవి :
ఈ పొద్దు ఇలు వదిలి పోవద్దురా అయ్యా...॥
చరణం : 1
పశువులింటికి తిరిగి పరువులెత్తే వేళ (2)
పసిపాపలను బూచి పట్టుకెళ్లే వేళ (2)॥
చరణం : 2
పట్టు పీతాంబరము మట్టిపడి మాసేనూ (2)
పాలుగారే మోము గాలికే వాడేను (2)
వద్దురా... వద్దురా కన్నయ్యా...
చరణం : 3
గొల్లపిల్లలు చాల అల్లరివారురా (2)
గోలచేసి నీపై కొండెములు చెప్పేరు
ఆడుకోవలెనన్న పాడుకోవలెనన్న (2)
ఆడటను నేనున్న (2) అన్నిటను నీదాన
వద్దురా... వద్దురా... వద్దురా... వద్దురా
కన్నయ్యా... కన్నయ్యా
Special Note:
అసలుపేరు : పిల్లవలు గజపతి కృష్ణవేణి
జననం : 03-11-1935
జన్మస్థలం : చిత్తూరులోని చంద్రగిరి
తల్లిదండ్రులు : రాజకాంతమ్మ,గజపతినాయుడు, తోబుట్టువులు : నలుగురు తమ్ముళ్లు, నలుగురు చెల్లెళ్లు
చదువు : బి.ఏ., వివాహం : 26-06-1958
భర్త : గాయకుడు ఎ.ఎం.రాజా
సంతానం : ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు (అందరూ సంగీతంలో కృషి చేస్తున్నవారే)
తొలిపాట-చిత్రం : ఈ తీరని నిన్నెరిగి పలుకగా నా తరమా జగదేకకారణా - పంతులమ్మ (1943)
ఆఖరిపాట-చిత్రం : అలనాటి రామచంద్రుడికన్నింటా సాటి - మురారి (2001)
పాటలు : దాదాపు పదివేలు (తెలుగు, తమిళ , మలయాళ, కన్నడ, హిందీ, సింహళ భాషలలో)
నటించిన సినిమాలు : పంతులమ్మ (1943), మంగళసూత్రం (1946)
అవార్డులు : తమిళనాడు నుండి ‘కళైమామణి’, తమిళనాడు రాష్ట్ర అవార్డు, తెలుగు ఉగాది పురస్కారం, మరికొన్ని సంగీత అవార్డులు అందుకున్నారు. ఇతరవిషయాలు : కృష్ణవేణి తన 7వ ఏట నుండే పాటలు పాడడం మొదలుపెట్టారు. చిన్నప్పటి నుండే స్టేజి ప్రోగ్రామ్స్‌లో చురుకుగా పాల్గొనేవారు. గూడవల్లి రామబ్రహ్మం సహాయంతో గాయకురాలిగా, నటిగా చిత్రసీమకు పరిచయం అయ్యారు. సంగీతం నేర్చుకోకుండా దేవుడు ప్రసాదించిన గొంతుతో ఎన్నో ఆణిముత్యాలను పలికించి సంగీత ప్రియులను అలరించారు. దేశవిదేశాలలో ఎన్నో స్టేజి ప్రోగ్రామ్స్‌లో పాల్గొన్నారు. అసలు పేరు కృష్ణవేణి అయినా ఆమె జిక్కిగా ప్రసిద్ధికెక్కారు.
మరణం : 16-08-2004
egarAli jAtIya patAkam - ఎగరాలి జాతీయ పతాకం
egarAli jAtIya patAkam - ఎగరాలి జాతీయ పతాకం
చిత్రం : మోసగాడు(monagADu) (1980), రచన : వేటూరిసంగీతం : చక్రవర్తి, గానం : ఎస్.పి.బాలు
పల్లవి :
గగనం ఉన్నాళ్లదాకా కాలం కడతేరుదాకా
ఎగరాలి జాతీయ పతాకం ఎగరాలి
చరణం : 1
జాతి నిదుర లేచిన సమయం
జనానికిది పండుగ ఉదయం
అదిగో మన తపస్సు ఫలితం
అదే అదే మన స్వాతంత్య్రం
తరతరాల చీకటి ఇల్ల్లే
కటకటాల కౌగిట గుళ్ల్లే
బానిసలకు వారసులం
బ్రతికి ఉన్న పీనుగులం
ఎక్కడుంది స్వాతంత్య్రం
మాకేదీ ఆ స్వాతంత్య్రం
ఓ... మహామహుల త్యాగఫలం
మరిచిపోకు స్వాతంత్య్రం
యుగయుగాల పోరాటంలో
ఉదయించిన అమృతభాండం
స్వాతంత్య్రమే నీ జన్మహక్కని తెలుసుకో
అది అందుకునే అర్హత నీలో పెంచుకో
//ఎగరాలి//
చరణం : 2
ఇదిగిదిగో నా దేశంలో వెలిగిన
శతకోటి ఉషస్సులు
అదిగదిగో ఆకాశంలో
మువ్వన్నెల ఇంద్రధనుస్సులు
జైలన్నది భూతల నరకం
ఇది సజీవ శవాల దహనం జరిగే
మహా శ్మశానం
ఎక్కడుంది స్వరాజ్యం
రాబందుల రావణ రాజ్యం
ఓ... ఇది జగన్నాటక సూత్రధారి
శ్రీకృష్ణుడు జన్మించిన చోటు
రామదాసు మొరలే విని శరణే
శ్రీరాముడు విడిపించిన చోటు
ఇదే జాతిపిత బాపూజీ స్వరాజ్యాన్ని
సాధించిన చోటు
ఈ దేశం సందేశం నెహ్రూజీ వినిపించిన చోటు
//స్వాతంత్య్రమే// //ఎగరాలి//
mudinEpalli maDichElO - ముదినేపల్లి మడిచేలో
mudinEpalli maDichElO - ముదినేపల్లి మడిచేలో
చిత్రం : జెంటిల్‌మెన్ (gentle man) (1993)రచన : రాజశ్రీ, సంగీతం : ఎ.ఆర్.రెహవూన్
గానం : సాహుల్ హమీద్, స్వర్ణలత, మాల్గాడి శుభ
14 August - నేడు రాజశ్రీ వర్ధంతి
నీ కొంగు పొంగు నా గుండె కోసెనమ్మా //ముదినేపల్లి//
బుట్ట మీద బుట్టపెట్టి బుగ్గ మీద చుక్కపెట్టి
వాగల్లే నడిచావే
నీ బుట్టలోన పువ్వులన్నీ గుట్టులన్నీ రట్టుచేసి
నన్నీడ పిలిచేనే //ముదినేపల్లి//
పల్లి పల్లి ముదినేపల్లి (2)
చరణం : 1
కాటుక కళ్ల వాడల్లో కట్టుకుంటా గుడిసెంటా
పసుపుతాడు పడకుండా ఆగడాలే వద్దంటా
చింతపల్లి చిన్నోణ్ని చూడు నీకు వరసంటా
వరస కాదు నాకంట మనసు ఉంటే చాలంటా
పగలు రేయి... నీతో ఉంటా
ఉన్నావంటే... అది తప్పంట
కలిసి వస్తే వెన్నెలమాసం
చెయ్యలి జాగారం
ముదినేపల్లి మడిచేలో
ముద్దుగుమ్మ
నువ్వు ఓరకంట చూశావో
నెల తప్పేనమ్మా //ముదినేపల్లి// //నువ్వు//
బుట్టమీద బుట్టపెట్టి నేను పువ్వులమ్ముతుంటే
కనుసైగ చేస్తావే
ముట్టుకుంటే కందిపోవు ముద్దరాలి సొగసుకు
గాలాలే యేస్తావే
చరణం : 2
తమలపాకు తడిలోన పండెనే నీ నోరంటా
నోటి పంట కాదంటా
పాడిపంట చూడంటా
నాకు నువ్వే తోడుంటే
సంబరాలే నట్టింట
ఆశపడిన మావయ్యది
అందమైన మనసంట
అందం చందం నీకే సొంతం
వెన్నోల్లోనే యేస్తా మంచం
పైరగాలుల పందిరిలోన
కరిగిపోదాం మనం //ముదినేపల్లి//
Watch Gentleman Movie Songs:
1 "Kontegadni Kattuko" S. P. Balasubrahmanyam, S. Janaki 5:15
2 "Chikbuk Raile" Suresh Peters, G. V. Prakash 5:24
3 "Naa Intimundunna" S. P. Balasubrahmanyam, Sujatha 5:15
4 "Mavele Mavele" Minmini, Srinivas, Noel James 4:29
5 "Mudinepalli" Shahul Hameed, Malgudi Subha, Swarnalatha 4:40
tellA tellAni chIra - తెల్లా తెల్లాని చీర
tellA tellAni chIra - తెల్లా తెల్లాని చీర
చిత్రం : దేవీపుత్రుడు(dEvI putruDu) (2001)రచన : జొన్నవిత్తుల
సంగీతం : మణిశర్మ
గానం : ఉదిత్ నారాయణ్, సుజాత
తెల్లా తెల్లాని చీర జారుతున్నాది సందెవేళ
తెల్లా తెల్లారి దాకా
చెయ్యమన్నాది కుంభమేళ
తాకితే సితారా శృంగార శుక్ర తార
నడుము ఏక్ తార కసి పదనిస పలికేరా //తెల్లా//
చరణం : 1
ప్రేమ గురువా ఊగరావా
పూల పొద ఉయ్యాలా
హంస లలనా చేరుకోనా కోరికల తీరాన
గొడవే నిరంతరం
ఇరువురి దరువే సగం సగం
పిలుపే ప్రియం ప్రియం
తకధిమి తపనే తళాంగు తోం తోం తోం
ఇంద్రధనసు మంచం
ఇమ్మంది వయసు లంచం
పిల్ల నెమలి పింఛం
అది అడిగెను మరి కొంచె //తెల్లా//
చరణం : 2
ప్రియ వనితా చీర మడత
చక్కచేసి ఒక్కటవనా
మీద పడనా మీగడవనా
కన్నె ఎద రాగాలా
రగిలే గులాబివే
మదనుడి సభకే నవాబువే
తగిలే సుఖానివే బిగువుల బరిలో
విహారివే... హోయ్ హోయ్ హోయ్
శోభనాల బాల ముందుందే ఇంక చాలా
జాజులా మజాలా పూగంధం పూయాలా //తెల్లా//
Another Link:
tellA tellAni chIra - తెల్లా తెల్లాని చీర
nAnEDa puDitE - నానేడ పుడితే
nAnEDa puDitE - Julayi title song - నానేడ పుడితే
చిత్రం : జులాయి(julayi) (2012)రచన : రామజోగయ్యశాస్త్రి
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గానం : సుచితా సురేశన్, ప్రియ హిమేష్
పల్లవి :
నానెట్టగుంటే నీకేటన్నాయ్
నానేటిసేత్తే నీకేటన్నాయ్...
సిర్రాకు పెట్టకన్నాయ్
నే దమ్ము కొడితే నీకేటన్నాయ్...
నే డప్పు కొడితే నీకేటన్నాయ్
నే కన్నుకొడితే నీకేటన్నాయ్...
కొట్టానో పళ్లురాల్తాయ్
నా షర్టుకెన్ని బొత్తాలున్నాయ్...
ఒంటికెన్ని టీకాలున్నాయ్
నా జీన్స్‌కెన్ని కన్నాలున్నాయ్...
సెల్ నంబర్‌కెన్ని సున్నాలున్నాయ్
మా నాన్నకెన్ని బాకీలున్నాయ్...
చెల్లికెన్ని రాఖీలున్నాయ్
ఈ తిక్క తిక్క ప్రశ్నలన్ని తొక్కేసెయ్
నేనో పక్క జులాయ్ ఐతే నీకేంటన్నాయ్
ఉళ్లాయిళ్లాయి మై హూ జులాయి (4)
చరణం : 1
ఏ పోస్టరెనక ఏ బొమ్ముందో...
ఏ ప్లాస్టరెనక ఏ దెబ్బుందో
ఏ బంతి ఎనక ఏ సిక్సరుందో...
కొట్టాకే చూడగలవు
ఏ లేబులెనక ఏ సరుకుందో...
ఏ టేబులెనక ఏ సొరుగుందో
ఎహే ముట్టకుండా చెయ్యెట్టకుండా
నువ్వెట్టా చెప్పగలవు
తెల్లగుంటె జున్ను కాదూ...
నల్లగుంటే మన్ను కాదూ
మెరిసిపోతే గోల్డు కాదూ...
మాసిపోతే ఓల్డు కాదూ
పై లక్కు చూసి లెక్కలేస్తే తప్పన్నాయ్
నన్ను ఆరా తియ్యడాలు మానెయ్యన్నాయ్
ఉళ్లాయిళ్లాయి మై హూ జులాయి (2)
నా పేరు పిప్పరమెంటు నా ఒళ్లంతా కరెంటు
నా షేపే ట్రంపెట్టు నా చూపే బుల్లెట్ట్టు
అరె... సక్కెరకన్నా స్వీటు
నా లిక్కరుకన్నా ఘాటు
నా ఫేసే ఫ్లడ్‌లైటుఎలిగిస్తా మిడ్‌నైటు
హే... ఊరంతా గందరగోళం
రాత్రైతే రంగుల మేళం
సీకటి సిందుల గజ్జెల తాళం నాలో హైలైటు
ఉళ్లాయిళ్లాయి రావో జులాయి...
ఉళ్లాయిళ్లాయి సూపిస్తా హాయి...
చరణం : 2
నీ లెక్కకేమొ నే బే వార్సు...
నా లెక్కలోన నే అ క్లాసు
నీ గోల నీది నా గొడవ నాది
మనకెందుకంట క్లాషు
నేనెటెళ్లాంది నాకే తెల్సు
నీ చూపుకేమొ అది టైం పాసు
ఏ లెన్సు పెట్టి నువు చూడగలవు
నా సీరియస్‌నెస్సూ
టెన్తు ఫెయిల్ మరి టెండూల్కర్
క్రికెట్ మాస్టరయిపోలేదా
పేపర్‌బాయ్ టు ప్రెసిడెంటు
అబ్దుల్ కలాము కథ వినలేదా
ఎవడి ఫేటుhttp://www.blogger.com/img/blank.gif ఏటవుద్దొ జాంతా నై
అది తేల్చాలంhttp://www.blogger.com/img/blank.gifటే నువు సరిపోవన్నాయ్
ఉళ్లాయిళ్లాయి http://www.blogger.com/img/blank.gifమై హూ జులాయి (2)
Watch Julayi songs with Lyrics:
1. "Julayi" Ramajogayya Sastry Suchith Suresan, Priya Himesh
2. "O Madhu" Devi Sri Prasad Adnan Sami
3. "Osey Osey" Srimani Jassie Gift
4. "Chakkani Bike Undi" Srimani Tippu, Megha
5. "Mee Intiki Mundhu" Srimani Sagar, Ranina Reddy
6. "Pakado Pakado" Ramajogayya Sastry Malgadi Subha, Devi Sri Prasad
O vENugAnammu - ఓ వేణుగానమ్ము
O vENugAnammu - ఓ వేణుగానమ్ము
చిత్రం : సిరిసంపదలు (siri sampadalu) (1962)రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : మాస్టర్ వేణు
గానం : సుశీల, జానకి, జిక్కి
పల్లవి : ఓ... ఓ... ఓ... ఓ...
వేణుగానమ్ము వినిపించెనే
చిన్ని కృష్ణయ్య కనిపించడే
' వేణుగానమ్ము'
చరణం : 1
దోరవయసున్న కన్నియల
హృదయాలను
దోచుకున్నాడని విన్నాను చాడీలను
'దోరవయసున్న'
అంత మొనగాడటే... ఒట్టి కథలేనటే...
ఏడి కనబడితే నిలవేసి అడగాలి వానినే
' వేణుగానమ్ము'
చరణం : 2
మన్ను తిన్నావని యశోదమ్మ
అడిగిందట లేదు
లేదనుచు లోకాలు చూపాడట
'మన్ను'
అంత మొనగాడటే...
వింత కథలేనటే...
ఏడి కనబడితే కనులారా
చూడాలి వానినే
'వేణుగానమ్ము'
చరణం : 3
దుడుకు కృష్ణయ్య
మడుగులోన దూకాడట
జడిసి రేపల్లె ప్రజలంతా మూగారట
'దుడుకు'
ఒళ్లు ఝల్ ఝల్లన ...
తాను ఫణిరాజు పడగపై
తారంగమాడేనట
'వేణుగానమ్ము'
Listen Audio song:
O vENugAnammu - ఓ వేణుగానమ్ము
E SwAsalO chEritE - ఏ శ్వాసలో చేరితే
E SwAsalO chEritE - ఏ శ్వాసలో చేరితే
చిత్రం : నేనున్నాను (nEnunnAnu) (2004), రచన : సిరివెన్నెలసంగీతం : ఎం.ఎం.కీరవాణి, గానం : కె.ఎస్.చిత్
పల్లవి :
ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో
ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో
ఏ మోవిపై వాలితే మౌనమేమంత్రమౌతున్నదో
ఆ శ్వాసలో నే లీనమై ఆ మోవిపై నే మౌనమై
నిను చేరనీ మాధవా... ఆ...॥శ్వాసలో॥
చరణం : 1
మునులకు తెలియని జపములు జరిపినదా...
మురళీ సఖి వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా
తనువున నిలువున తొలిచిన గాయమునే
తన జన్మకి
తరగని వరముల సిరులని తలచినదా
కృష్ణా నిన్ను చేరింది అష్టాక్షరిగా మారింది
ఎలా ఇంత పెన్నిధి వెదురు తాను పొందింది
వేణుమాధవా నీ సన్నిధి...॥శ్వాసలో॥
చరణం : 2
చల్లని నీ చిరునవ్వులు కనబడక కనుపాపకి
నలువైపుల నడిరాతిరి ఎదురవదా
అల్లన నీ అడుగుల సడి వినబడక
హృదయానికి అలజడితో అణువణువు
తడబడదా... ఆ... ఆ...
నువ్వే నడుపు పాదమిది నువ్వే మీటు నాదమిది
నివాళిగా నా మది
నివేదించు నిమిషమిది
వేణుమాధవా నీ సన్నిధి
గాగ రిగరి సరి గాగ
రీరి సరి
గపద సాస దప గరి సరీ
గగ దపదా గప దసదా
ద ప గ రి గ
దపద సాస దపద సాస
దపద రీరి దపద రీరి
దస రిగరి సరీ
గరిసరీ ద రి గారి సరిగా రిస దప
గగగ పాప గగగ దాద గగగ సాస
దప గప గస రిసరిసరి గరిస దసరీ గదప సగరీ
పగ పదసరీ సరి గపగరీ
సద పద పస దస పద పస దస
పదప రిసరి పదప రిసరి
పద సరి గరి సద
పదస గదస రిగస
సరిగప దసరిగా
ఆ... రాధికా హృదయ రాగాంజలి...
నీ పాదముల వ్రాలు కుసుమాంజలి... ఈ గీతాంజలి...
ayyayyO chEtilO - అయ్యయ్యో చేతిలో
ayyayyO chEtilO - అయ్యయ్యో చేతిలో
చిత్రం : పిల్ల జమీందార్(pilla zamIndAr) (2011), రచన : శ్రీమణిసంగీతం : సెల్వ గణేష్, గానం : సోలార్ సాయి
అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయెనే
అయ్యయ్యో కార్లు బంగళా పోయెనే
అయ్యయ్యో క్రెడిట్ కార్డులు మాయమే
ఉన్నది కాస్తా ఊడింది
సర్వమంగళం పాడింది
మేటర్ క్వార్టరుకొచ్చింది
పరువును వీధికి తెచ్చింది
పిజ్జా బర్గర్ తినే జీవికి
పచ్చడి టచ్చింగ్ ఇచ్చింది
అయ్యయ్యో కార్లు బంగళా పోయెనే
అయ్యయ్యో క్రెడిట్ కార్డులు మాయమే
ఆ జమీందారుకే ఏలినాటి
శని షరతులు పెట్టిందే
విధి వీణ్ణి ఉతికారేసిందే
చేతికి చీపురు ఇచ్చిందే
పోజుకు బూజే దులిపిందే
ఫ్లైటులోన తెగ తిరిగే బతుకుని
బస్టాండ్‌గా మార్చే
గాడిద చాకిరి చేయించే
అయ్యయ్యో రాజభోగం పోయెనే
అయ్యయ్యో రాజన్న
జ్వరమే వచ్చెనే
షవరు బాతులు స్విమ్మింగ్‌పూల్
ఎండమావులాయే
అయ్యని ఎండకట్టినాయే
గోవిందా... గోవిందా...
ప్యాలెస్ నుండి పాయిఖానాకు బాబే దిగివచ్చే
దెబ్బకు దేవుడు కనిపించే
అబ్బాయిని అబ్బా అనిపించే
ఏసి బారులో ఓసీ లైఫుకి షేకే వచ్చింది
షేఖ్‌కి షాకే ఇచ్చింది
అయ్యయ్యో డాబుసరి సిరి దూరమే
అయ్యయ్యో బాబు పని ఇక ఘోరమే
జల్సా లైఫులు సల్సా డాన్సులు
స్వాహా అయ్యాయి
కష్టాల్ కవాతు చేశాయి
గర్వపు కీళ్లే విరిచాయి
కాళ్లకు పుండ్లే అయ్యాయి
నిష్ట దరిద్రపు లాటరీ వీణ్ణి లాగి కొట్టింది
కొడితే...
చిప్ప చేతికొచ్చే కూటికి తిప్పలెన్నో తెచ్చే
అయ్యయ్యో మేళ్లు మిద్దెలు మాయమే
అయ్యయ్యో పేళ్లో బతుకైపాయెనే
gOvindA gOvindA - గోవిందా గోవిందా
gOvindA gOvindA - గోవిందా గోవిందా
చిత్రం : ఖడ్గం(khaDgam) (2002)రచన : చిర్రావూరి విజయ్‌కుమార్
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, గానం : శ్రీ, దేవిశ్రీ
పల్లవి :
నుదుటిరాతను మార్చేవాడా
ఉచితసేవలు చేసేవాడా
లంచమడగని ఓ మంచివాడా
లోకమంతా ఏలేవాడా
స్వార్థమంటూ లేనివాడా బాధలన్నీ తీర్చేవాడా
కోర్కెలే నెరవేర్చేవాడా నాకు నువ్వే తోడూనీడా
గోవిందా గోవిందా... గోవిందా గోవిందా...
అరె బాగుచెయ్ నను గోవిందా
బాగుచెయ్ నను గోవిందా
జూబ్లీహిల్స్‌లో బంగ్లా ఇవ్వు
లేనిచో హైటెక్‌సిటీ ఇవ్వు
హైజాకవ్వని ఫ్లైటొకటివ్వు
వెంటతిరిగే శాటిలైటివ్వు
పనికిరాని చవటలకిచ్చి
పరమ బేవార్స్‌గాళ్లకిచ్చి
నాకు ఎందుకు ఇయ్యవు పిలిచి
కోట్లకధిపతి చెయ్‌రా మెచ్చి
గోవిందా గోవిందా... గోవిందా గోవిందా...
బాగుచెయ్ నను గోవిందా...
పైకి తే నను గోవిందా గోవిందా గోవిందా
అరె గోవిందా గోవిందా...
చరణం : 1
పెట్రోలడగ ని కారు ఇవ్వు
బిల్లు ఇవ్వని బారు ఇవ్వు
కోరినంత ఫుడ్డు పెట్టి
డబ్బులడగని హోటలు ఇవ్వు
అసెంబ్లీలో బ్రోకర్ పోస్టో
రాజ్యసభలో ఎంపీ సీటో
పట్టుపడని మ్యాచ్‌ఫిక్సింగ్
స్కాముల సంపాదనివ్వు
ఓటమెరుగని రేసులివ్వు లాసురాని షేరులివ్వు
సింగిల్ నంబర్ లాట్రీలివ్వు
ట్యాక్స్ అడగని ఆస్తులివ్వు ॥
గో గో గో గో... గోవిందా గోవిందా...
బాగుచెయ్ నను గోవిందా...
చరణం : 2
వందనోట్ల తోటలివ్వు గోల్డ్ నిధుల కోటలివ్వు
లేకపోతే వెయ్యిటన్నుల
కోహినూర్ డైమాండ్స్ ఇవ్వు
మాస్ హీరో ఛాన్సులివ్వు
హిట్టు సినిమా స్టోరీలివ్వు
స్లిమ్ముగున్న సొమ్ములున్న
హీరోయిన్నే వైఫుగా ఇవ్వు
హాలీవుడ్‌లో స్టూడియోనివ్వు
స్విస్సుబ్యాంక్‌లో బిలియన్లివ్వు
కోట్లుతెచ్చే కొడుకులనివ్వు
హీరోలయ్యే మనవలనివ్వు
నన్ను కూడా సీఎం చెయ్యి
లేకపోతే పీఎం చెయ్యి
తెలుగుతెరపై తిరుగులేని
తరిగిపోని లైఫునియ్యి॥
అరె పైకి తే నను గోవిందా...
గోవిందా గోవిందా...
లక్కుమార్చి నన్ను కరుణిస్తే
తిరుపతొస్తా త్వరగా చూస్తే
ఏడుకొండలు ఏసి చేస్తా
ఎయిత్ వండర్ నీ గుడి చేస్తా
గోవిందా గోవిందా... ఏడుకొండలు ఏసి చేస్తా
బాగుచెయ్ నను గోవిందా...
ఎయిత్ వండర్ నీ గుడి చేస్తా ॥
అయ్యబాబోయ్ దేవుడు
మాయమైపోయాడే ంటీ..?
gAli chirugAli ninu - గాలీ చిరుగాలీ నిను
gAli chirugAli ninu - గాలీ చిరుగాలీ నిను
చిత్రం : వసంతం(vasantam) (2003)రచన : సిరివెన్నెల
సంగీతం : ఎస్.ఎ.రాజ్‌కుమార్
గానం : కె.ఎస్.చిత్ర
పల్లవి :
వెళ్లే నీ దారి అది ఎవరికి తెలుసమ్మా
రూపమే ఉండనీ ఊపిరే నువ్వనీ
ఎన్నడూ ఆగని పయనమే నీదని॥
చరణం : 1
కనురెప్ప మూసి ఉన్న నిదరొప్పుకోను అన్న
నిను నిలువరించినా ఓ స్వప్నమా
అమావాసలెన్నైనా గ్రహణాలు ఏవైనా
నీ కలను దోచిన ఓ చంద్రమా
తన ఒడిలో ఉన్నది రాయో రత్నమొ
పోల్చదు నేలమ్మా
ఉలి గాయం చేయకపోతే
ఈ శిల శిల్పం కాదమ్మా
మేలుకో మిత్రమా
గుండెలో జ్వాలలే జ్యోతిగా మారగా
చీకటే దారిగా వేకువే చేరదా...॥
చరణం : 2
చలి కంచె కాపున్నా పొగమంచు పొమ్మన్నా
నీ రాక ఆపినా వాసంతమా
ఏ కొండ రాళ్లైనా ఏ కోన ముళ్లైనా
బెదిరేనా నీ వాన ఆషాడమా
మొలకెత్తే పచ్చని ఆశే నీలో ఉంటే చాలుసుమా
కలకాలం నిన్ను అణచదు మన్ను
ఎదిగే విత్తనమా
సాగిపో నేస్తమా
నిత్యము తోడుగా నమ్మకం ఉందిగా
ఓరిమే సాక్షిగా ఓటమే ఓడగా...॥
hE mantrAlaya deepA - హే మంత్రాలయ దీపా
hE mantrAlaya deepA - హే మంత్రాలయ దీపా
సాకీ :శ్రీరాఘవేంద్ర గురునాథా...
ప్రభో పాహిమాం...
శ్రీరాఘవేంద్ర గురునాథా (9)
పల్లవి :
నమ్మిన నా మది మంత్రాలయమేగా... ఓ...
న మ్మని వారికి తాపత్రయమేగా
శ్రీగురు బోధలు అమృతమయమేగా... ఓ...
చల్లని చూపులు సూర్యోదయమేగా
గురునాథ రాఘవేంద్ర శ్రీకృష్ణ పారిజాతా
హనుమంత శక్తిసాంద్రా
హరినామ గాన గీతా
నీ తుంగభద్ర మా పాపాలే కడగంగా
తుంగదళాల సేవ తులసీదళాల పూజ
అందుకో...
చరణం : 1
నిరాశ మూగేవేళా మా దురాశ రేగేవేళా
నీ భజనే మా బ్రతుకైపోనీవా
పదాలవాలే వేళ నీ పదాలు పాడే వేళ
నీ చరణం మా శరణం కానీవా
మనసు చల్లని హిమవంతా
భవము తీర్చరా భగవంతా
మహిని దాల్చిన మహిమంతా
మరల చూపుమా హనుమంతా
నీ వీణతీగలో యోగాలే పలుకంగా
తుంగదళాల సేవ తులసీదళాల పూజ
అందుకో... ॥
చరణం : 2
వినాశ కాలంలోన ధనాశపుడితేలోనా
నీ పిలుపే మా మరుపై పోతుంటే
వయస్సు పాడేవేళా వసంతమాడే వేళా
నీ తలపే మా తలుపే మూస్తుంటే
వెలుగు చూపరా గురునాథ
వెతలు తీర్చరా యతిరాజా
ఇహము బాపెనే హితబోధ
పరము చూపెనే ప్రియగాథ
నీ నామ గానమే ప్రాణాలై పలుకంగా
తుంగదళాల సేవ తులసీదళాల పూజ
అందుకో... ॥
చిత్రం : రాఘవేంద్ర (2003), రచన : వేటూరి
సంగీతం : మణిశర్మ, గానం : శ్రేయాఘోషల్, కల్పన
swAgatam OhO chilipi - స్వాగతం ఓహో చిలిపి
swAgatam OhO chilipi - స్వాగతం ఓహో చిలిపి
చిత్రం : ఆత్మీయులు(Atmeeyulu) (1969)రచన : ఆరుద్ర
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు
గానం : పి.సుశీల
03 August - నేడు వాణిశ్రీ బర్త్‌డే
పల్లవి :
ఓహో చిలిపి నవ్వుల శ్రీవారు
సోగకనులు సైగచేస్తే
ఆగలేని దొరగారు॥
చరణం : 1
కొంగు తగిలిందా పొంగిపోతారు కొంగు తగిలిందా పొంగిపోతారు
కోరి రమ్మంటే బిగిసిపోతారు
ఎందుకో! ఎందుకో ఈ బింకము
అలిగినకొలది అందము
అబ్బాయిగారి కోపము (2)
పిలిచిన ప్రేయసికి కానుక!
నీ కానుక
బెట్టుచాలును దొరగారు...॥
చరణం : 2
అందమంతా విందుచేస్తే
అదిరిపడతారే (2)
పొందుకోరి చెంతచేర
బెదిరిపోతారే
సరసమొ విరసమొ ఈ మౌనము
అందిన చిన్నది చులకన
అందనిదెంతో తియ్యన (2)
అవతల పెట్టండి
తమాషా పోజులు...
మహారాజులు
అధిక చక్కని దొరగారు...॥
External Link:
Aathmeeyulu (1969)Audio Songs | 1 |
kannayyalANTi annayya - కన్నయ్యలాంటి అన్నయ్య లేని
kannayyalANTi annayya - కన్నయ్యలాంటి అన్నయ్య లేని
చిత్రం : బంగారుబాబు (1973)రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : ఘంటసాల, పి.సుశీల
పల్లవి :
కన్నులెందుకు
ఆ అన్నయ్య చల్లగ నవ్వకపోతే
వెన్నెలెందుకు॥
చరణం : 1
నా మాటకు పలికే దేవుడు
నా మనసుకు తెలిసిన చంద్రుడు
॥మాటకు॥
అలిగాడమ్మా ఈనాడు... (2)
నా బ్రతుకే చీకటి చేశాడు (2)॥
చరణం : 2
నా ఆశలు తీర్చే తండ్రే తాను
తన ఆకలి ఎరిగిన తల్లిని నేను॥ఆశలు॥
నా కనుపాపడు పలుకని నాడు (2)
కన్నులొచ్చినా కబోదినే
నేను కన్నులొచ్చినా కబోదినే
అమ్మా... చెల్లెమ్మా... అన్నయ్యా...
కన్నమ్మలాంటి చెల్లెమ్మ ఉంటే
అన్నమెందుకు
నా చెల్లెమ్మ చల్లగ నవ్వుతూ ఉంటే
వెన్నెలెందుకు
కన్నయ్యలాంటి అన్నయ్య ఉంటే
కన్నులెందుకు
ఆ అన్నయ్య చల్లగ నవ్వుతూ ఉంటే
వెన్నెలెందుకు॥
viNTunnAvA viNTunnAvA - వింటున్నావా వింటున్నావా
viNTunnAvA viNTunnAvA - వింటున్నావా వింటున్నావా
చిత్రం : ఏమాయ చేసావె(yE mAya chEsAve) (2010)రచన : అనంత శ్రీరామ్
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
గానం : కార్తీక్, శ్రేయాఘోషల్, బృందం
పలుకులు నీ పేరే తలచుకున్నా
పెదవుల అంచుల్లో అనుచుకున్నా
మౌనముతో నీ మదిని బంధించా
మన్నించు ప్రియా...
పల్లవి :
తరిమే వరమా తడిమే స్వరమా
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా
వింటున్నావా వింటున్నావా వింటున్నావా
//తరిమే//
విన్నా వేవేల వీణల సంతోషాల సంకీర్తనలు
నా గుండెల్లో ఇప్పుడే వింటున్నా
తొలిసారి నీ మాటల్లో
పులకింతలా పదనిసలు విన్నా
చాలు చాలే చెలియా చెలియా
బ్రతికుండగా నీ పిలుపులు నేను విన్నా
ఓ... బ్రతికుండగా నీ పిలుపులు నేను విన్నా
చరణం : 1
ఏమో ఏమో ఏమవుతుందో
ఏదేమైనా నువ్వే చూసుకో
విడువను నిన్నే ఇకపైనా వింటున్నావా... ప్రియా
గాలిలో తెల్ల కాగితంలా నేనలా తేలి ఆడుతుంటే
నన్నే ఆపీ నువ్వే రాసినా ఆ పాటలనే వింటున్నా
//తరిమే//
ఆద్యంతం ఏదో ఏదో అనుభూతి
ఆద్యంతం ఏదో అనుభూతి
అనవరగం ఇలా అందించేది
గగనం కన్నా మునుపటిది
భూతలం కన్నా ఇది వెనుకటిది
కాలంతోనా పుట్టింది
కాలంలా మారే మనస్సే లేనిది ప్రేమ
చరణం : 2
రా ఇలా కౌగిళ్లలో నిన్ను దాచుకుంటా
నీదానినై నిన్నే దారి చేసుకుంటా
ఎవరినీ కలువని చోటులలోన
ఎవరినీ తలువని వేళలలోన
//తరిమే//