Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

Featured Post

InATi IhAyi - ఈనాటి ఈ హాయి

చిత్రం : జయసింహ(jayasimha) (1955)
రచన : సముద్రాల జానియర్
సంగీతం : టి.వి.రాజు
గానం : ఘంటసాల, పి.లీల
31 May - నేడు సముద్రాల జానియర్ వర్ధంతి


పల్లవి :
ఈనాటి ఈ హాయి
కలకాదోయి నిజమోయి (2)॥
చరణం : 1
నీ ఊహతోనే పులకించిపోయే
ఈ మేను నీదోయి (2)
నీకోసమే ఈ అడియాసలన్నీ
నా ధ్యాస నా ఆశ నీవే కదా ॥
చరణం : 2
ఏ నోము ఫలమో ఏ నోటి వరమో
నీ ప్రేమ జవరాలా (2)
మనియేములే ఇక విరితావి లీల
మన ప్రేమకెదురేది లేదే సఖీ॥
చరణం : 3
ఊగేములే తులతూగేములే
ఇక తొలిప్రేమ భోగాలా (2)
మురిపాల తేలే మన జీవితాలు (2)
దరహాస లీలా విలాసాలులే॥


Special Note:
పూర్తిపేరు : సముద్రాల రామానుజాచార్యులు
జననం : 15-04-1923
జన్మస్థలం : పెదపులివర్రు గ్రామం, కృష్ణాతీరం
తల్లిదండ్రులు : రత్నమ్మ, సముద్రాల రాఘవాచార్యులు (సముద్రాల సీనియర్)
తోబుట్టువులు : తమ్ముడు వేంకట శేషాచార్యులు, చెల్లెళ్లు కుముద వల్లి తాయారు, అలివేలు మంగతాయారు
చదువు : బి.ఎస్సీ. (చెన్నైలో పచ్చయప్ప కాలేజీ)
వివాహం - భార్య :
16-10-1945 - ఆండాళమ్మ
పిల్లలు : ముగ్గురు కుమారులు (రంగపార్థసారథి, రాజగోపాల్, విజయ రాఘవాచార్యులు), నలుగురు కుమార్తెలు (రమాదేవి, యశోద, కీ.శే. నీల, శుభశ్రీ )
తొలిసినిమా : శాంతి (1952)
ఆఖరిపాట - సినిమా :
టైటిల్‌సాంగ్ - లక్ష్మణరేఖ (1975)
పాటలు : దాదాపు 150 చిత్రాలకు 300పైగా పాటలు
మాటలు అందించిన మొదటిచిత్రం :తోడుదొంగలు (1954)
చివరిచిత్రం : క్రాంతి (1981)
కథ-మాటలు-పాటలు అందించిన మొదటిచిత్రం : జయసింహ (1955)
ఇతరవిషయాలు : తండ్రిలాగానే చిన్నప్పటి నుండే సాహిత్యం, సంగీతం పట్ల మక్కువ ఏర్పరుచు కున్నారు. చెన్నై వాహినీ స్టూడియోలో శబ్దశాఖలో రికార్డిస్టుగా పనిచేశారు. ఘంటసాల, ఎన్‌టీఆర్‌లు సముద్రాల వారికి ఆప్తమిత్రులు. ఘంటసాల-సముద్రాల జూనియర్ కాంబినేషన్‌లో వచ్చిన గీతాలు హిట్‌గా నిలిచాయి. 1960 తర్వాత పాటల కన్నా సంభాషణలే ఎక్కువగా
రాశారు. విశ్వనాథనాయకుడు, సామ్రాట్ అశోక వంటి చిత్రాలకు స్క్రిప్టు అందించారు.
మరణం : 31-05-1985

rekkalu toDigi - రెక్కలు తొడిగి

చిత్రం : చుట్టాలొస్తున్నారు జాగ్రత్త(chuTTAlostunnAru jAgratta) (1980)
రచన : డా॥సి.నారాయణరెడ్డి
సంగీతం : ఎం.ఎస్.విశ్వనాథన్
గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల
31 May - కృష్ణ బర్త్‌డే(Krishna Birthday)


పల్లవి : రెక్కలు తొడిగి రెపరెపలాడి
రివ్వంటుంది కోరిక
దిక్కులు తోచక చుక్కలదారుల
చెలరేగింది వేడుక॥
వయసు దారి తీసింది
వలపు ఉరకలేసింది॥
మనసు వెంబడించింది
నిమిషమాగక॥
చరణం : 1
చెంతగా చేరితే...
చెంతగా చేరితే వింతగా ఉన్నదా
మెత్తగా తాకితే కొత్తగా ఉన్నదా (2)
నిన్న కలగా ఉన్నది
నేడు నిజమౌతున్నది (2)
అనుకున్నది అనుభవమైతే
అంతకన్న ఏమున్నది॥
చరణం : 2
కళ్లతో నవ్వకు...
కళ్లతో నవ్వకు ఝల్లుమంటున్నది
గుండెలో చూడకు గుబులుగా ఉన్నది
గుండెలో చూడకు గుబులుగా ఉన్నది
తొలిచూపున దాచింది
మలి చూపున తెలిసింది
ఆ చూపుల అల్లకతోనే
పెళ్లిపిలుపు దాగున్నది
వయసు దారి తీసింది
వలపు ఉరకలేసింది
మనసు వెంబడించింది
నిమిషమాగక (2)॥

dil sE dilsE - దిల్ సే దిల్ సే

చిత్రం : గబ్బర్‌సింగ్(gabbarsingh) (2012)
రచన : భాస్కరభట్ల
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గానం : కార్తీక్, శ్వేతామోహన్


పల్లవి :
దిల్ సే దిల్ సే నీ ఊహల్లో
ఎగసే ఎగసే ఆనందంలో
పడి దొర్లేస్తున్నా నీలాకాశంలో
మెరిసే మెరిసే నీ కన్నుల్లో
కురిసే కురిసే నీ నవ్వుల్లో
చెలి దూకేస్తున్నా తికమక లోయల్లో
తొలి తొలి చూపుల మాయా
తొలకరిలో తడిసిన హాయా
తనువుల తకధిమి చూశావా
ప్రియా... ఆ...
గుండె జారి గల్లంతయ్యిందే
తీరా చూస్తే నీ దగ్గర వుందే
నీలో ఏదో తియ్యని విషముందే
నా ఒంట్లోకి సర్రున పాకిందే॥సే॥
చరణం : 1

నా గుండెలోన మేండలీను మోగుతున్నదే
ఒళ్లు తస్సదియ్య స్ప్రింగులాగ
ఊగుతున్నదే
హో సనం... నాలో సగం
పైట పాలపిట్ట గుంపులాగ ఎగురుతున్నదే
లోన పానిపట్టు యుద్ధమేదో
జరుగుతున్నదే
నీ వశం... తేరే కసం
పిల్లికళ్ల చిన్నదాన్ని మళ్లి మళ్లి చూసి
వెల్లకిల్ల పడ్డ ఈడు ఈలవేసే
కల్లుతాగి కోతిలాగ పిల్లి మొగ్గలేసే
గుండె జారి గల్లంతయ్యిందే
తీరా చూస్తే నీ దగ్గర వుందే
నీలో ఏదో తియ్యని విషముందే
నా ఒంట్లోకి సర్రున పాకిందే
చరణం : 2
రెండు కళ్లలోన కార్నివాల్ జరుగుతున్నదే
వింత హాయి నన్ను వాలిబాల్ ఆడుతున్నదే
ఈ సుఖం... అదో రకం
బుగ్గ పోస్టుకార్డు
ముద్దు ముద్దరెయ్యమన్నదే
లేకపోతే సిగ్గు ఊరుదాటి వెళ్లనన్నదే
ఈ క్షణం... నిరీక్షణం
హే... చుక్కలాంటి చక్కనమ్మ
నాకు దక్కినాదే
చుక్క ఏసుకున్నా ఇంత కిక్కురాదే
లబ్బుడబ్బు మాని
గుండె డంకనక ఆడే... హో
గుండె జారి గల్లంతయ్యిందే
తీరా చూస్తే నీ దగ్గర వుందే
నీలో ఏదో తియ్యని విషముందే
నా ఒంట్లోకి సర్రున పాకిందే॥సే॥

Gabbar Singh Full Song - Dil Se Song With Lyrics


endukanO ninu - ఎందుకనో నిను

చిత్రం : సి.ఐ.డి. (C.I.D.)(1965)
రచన : పింగళి నాగేంద్రరావు
సంగీతం : ఘంటసాల
గానం : ఘంటసాల, పి.సుశీల
28 May - నేడు ఎన్.టి.ఆర్ జయంతి


పల్లవి :
ఎందుకనో
నిను చూడగనే
కవ్వించాలని ఉంటుంది (2)
కవ్వించీ నీవు
కలహమాడితే
నవ్వుకొనాలని ఉంటుంది...
ఎందుకనో...
ఎందుకనో నిను చూడగనే
ఏదో ఇదిగా ఉంటుంది (2)
నీ పెదవులపై నవ్వు చిందితే
మనసు చల్లగా ఉంటుంది
ఎందుకనో... ఎందుకనో...
చరణం : 1
అడుగడుగున నీ రాజసమంతా
ఒలికిస్తూ నువు కులుకుతుంటే॥
కొంగున కట్టుకు నిను తిప్పాలని
నా కొంగున కట్టుకు నిను తిప్పాలని
ఏదో వేడుక పుడుతుంది...
ఎందుకనో...
ఎందుకనో నిను చూడగనే
ఏదో ఇదిగా
ఉంటుంది
కవ్వించే నీవు
కలహమాడితే
నవ్వుకొనాలని
ఉంటుంది...
ఎందుకనో...
చరణం : 2
అణువణువున
నీ సొంపులు
ఒంపులు
నను మైకంలో ముంచుతు ఉంటే॥
నీలో ఐక్యం చెందాలంటూ (2)
ఏదో తహతహ పుడుతుంది... ఎందుకనో...॥
ఆ... ఆ... ఆ... ఓ... ఓ... ఓ...
ఆహా హో హో ఓ హో
ఓహో ఓహోహో

mA Uri dEvuDu - మా ఊరి దేవుడు

చిత్రం : అల్లుడా మజాకా(alluDA majAkA) (1995)
రచన : వేటూరి(vETUri)
సంగీతం : కోటి(kOTi)
గానం : ఎస్.పి.బాలు, బృందం(S.P.bAlu group)
28 May - కోటి బర్త్‌డే(kOti Birthday)


పల్లవి :
మా ఊరి దేవుడు అందాల రాముడు
మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు॥ఊరి॥
ఓ రామా రఘురామా
జగమేలే జయరామా
అది రావయ్యా కళ్యాణరామా
మనువు కోరింది సీతమ్మ
భళిరా భళిరా భళిరా... ॥ఊరి॥
చుక్కా చుక్కల లేడి రాంభజన
సూది కన్నుల లేడి రాంభజన ॥
రామయ్య నలుపంట సీతమ్మ తెలుపంట
పరువాల ఈ పంట ప్రజల కన్నుల పంట
శ్రీరాముడి కళ్యాణమే సీతమ్మకే ైవె భోగము
మాతల్లికే పేరంటము లోకాలకే ఆనందము
చైత్రమాస కోకిలమ్మ పూలమేళమెట్టెనంట
నింగి వంగి నేల పొంగి
జంట తాళమేసెనంట
చరణం : 1
చెల్లిపోని మమతలకి చెల్లెలు సీతమ్మ రా
తాళికట్టు బావయ్యే తారక రామయ్య రా
తుళ్లిపడ్డ కన్నెలకి పెళ్లీడు పాపలకి
వలచిన వరడంటే రామచంద్రుడే
రాతినైన నాతిగచేసి
కోతినైన దూతగ పంపే
మహిమే నీ కథ రామా...
ఓ మాట ఓ సీత ఓ బాణమన్నావు
ధర్మానికే నీవు దైవానివైనావు
అన్నంటే నీవంటు ఆదర్శమైనావు
కన్నోళ్లకే నీవు కన్నీళ్లు తుడిచావు
ఆకాశ పందిళ్లు భూలోక సందళ్లు
ఓ రామ నీ పెళ్లికే...
భళిరా భళిరా భళిరా... ॥ఊరి॥
బిందె పానకం బిరబిర తిప్పు
రామచరిత హరికథగా చెప్పు ॥
దేవుడి గుడిలో హారతి తిప్పు...
తిప్పు తిప్పు తిప్పు...
దేవుడి గుడిలో హారతి తిప్పు
దొరుకును దోసెడు వడపప్పు ॥
చరణం : 2
ఏదిరా లక్ష్మణ...
సీతా పర్ణశాలలో లేదెందు చేతా
విన్నాను మారీచకూతా వాడు
లంకేశుడి మాయదూత
లేడల్లె వచ్చాడు ఘాత వాణ్ణి
బాణానికేస్తాను మేతా ॥
నే నాడతా... నే పాడతా... (2)
వాడి అంతుచూసి నే నాడతా...
వాడి గొంతుపిసికి నే పాడతా...
నే నాడతా... నే పాడతా... (2)
రక్కసి బాధలేని పల్లెటూళ్లు మావూళ్లురా
మంథర మాటవినే కైకలేదురా
సీత సిరి పండించే మళ్లు ఉన్న మాగాణిరా
కలిమికి చోటు ఇదే కరువులేదురా
బుజ్జగింపు ఉడతకిచ్చి
పుణ్యమేమొ కప్పకిచ్చే
ఘనతే నీ కథ రామా...
కంచర్ల గోపన్న బంధాలు తెంచావు
శబరి ఎంగిలి పళ్లు నువ్వారగించావు
త్యాగయ్య గానాల తానాలు చేశావు
బాపూజీ ప్రాణాల కడమాటవైనావు
సీతమ్మ రామయ్య పెళ్లాడుకుంటుంటే
భూలోక కళ్యాణమే
భళిరా భళిరా భళిరా... ॥ఊరి॥


Another Link:

mA Uri dEvuDu - మా ఊరి దేవుడు

prANamA prANamA - ప్రాణమా ప్రాణమా

చిత్రం : డార్లింగ్(darling) (2010)
రచన : అనంత శ్రీరామ్
సంగీతం : జి.వి.ప్రకాష్‌కుమార్
గానం : రాహుల్ నంబియార్, బృందం


పల్లవి :
తాననాననానా... (2)
ప్రాణమా ప్రాణమా...
అరే సంద్రంలాగా పొంగావే
ఈరోజున
సిరి వర్షంలాగా కురిశావే
ఎద చాటున
చూపులతో ఏం చెప్పావే అంతగా
ఊపిరితో ముడిపెట్ట్టావే వింతగా
చరణం : 1
తాననాననానా...
నిన్నా మొన్నా లేని సంతోషాల బాణీ
వింటున్నానే మెల్లగా ఈ చోట
చిన్నా పెద్దా చేరి చూస్తూ ఉన్నా గానీ
ఆగేలాగ లేదిక నీ ఆట
దూరాన్ని దూరంగా
తోశావే మౌనంగా
ప్రాయాలు పులకించు ఈ మలుపులో
సపమప గమగా... (4)
నిదని పదమపా
సపమప గమగా... (2)
నిదని పదమపా
గమపని సాసానిరీ
సాసానిరీ నీదా సనీదా
సని సాసాని మరి సాసా
నిసరి నీద పమ దమారి మరినిరి
చరణం : 2
తాననాననానా...
గిల్లీక జ్జాలన్నీ మళ్లీ గుర్తొచ్చేలా
గడిచాయమ్మా రోజులు
హాయి హాయిగా
ఎన్నాళ్లైనా గానీ ఎపుడూ గుర్తుండేలా
నిలిచాయమ్మా నవ్వులు
తియతియ్యగా హో...
ఈ జన్మలోనైనా ఏ జన్మలోనైనా
తన జంటగా నన్ను నడిపించగా॥


Another Link:
prANamA prANamA - ప్రాణమా ప్రాణమా

nEnA nIvE nEnA - నేనా నీవే నేనా

చిత్రం : అనగనగా ఓ అమ్మాయి(anaganagA O ammAyi) (1999)
రచన : వేటూరి(vETUri)
సంగీతం : మణిశర్మ(maNiSarma)
గానం : ఎస్.పి.బాలు, కె.ఎస్. చిత్ర


పల్లవి :
నేనా నీవే నేనా...
నేనే నీలో లేనా...
నవ్వుతూ నాలో జల్లే పూలేవాన
యవ్వనాలెగసేవేళ రావే మైనా
నేనా నీవే నేనా...
నేనే నీలో లేనా...
చరణం : 1
వయ్యారాల మేన
సొగసుయ్యాలలూగుదానా
జాలువారు జుంటి తేనె జంట కోరి
పొరలి పొంగగా
సౌందర్యాల సోల
నను సోకే చూపులోనా
ప్రాణమల్లె జీవితాన ప్రాయమంతా
వెల్లి విరియగా
పచ్చగిల్లు నీ పాదాలే
పారాణి లేక నేనా
వెచ్చగిల్లు నీ ఒళ్లోనా
వేసంగి జల్లు కానా॥
చరణం : 2
సాయంకాలాలలో
నీ సాయం కోరుకోనా
ఎంకి పాట మీద ఆన
నిన్ను చేరి నీడనివ్వనా
పూలే ఇచ్చుకోనా
విరబూసే ఈడు దానా
అందమంతా హారతైనా
శ్రీమతల్లే వచ్చి నిలవనా
నీ కాలి మువ్వనే కాలేనా
పెనుగాలి దివ్వెనైనా
రాగమైనా ఈ బంధానా
నే పల్లవించిపోనా॥

చిత్రం : ఆర్య-2(Arya - 2) (2009)
రచన : కేదార్‌నాథ్ పరిమి, దేవిశ్రీ
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గానం : బాబా సెహగల్, రీటా, దేవిశ్రీ


పల్లవి :
హే... టి ప్పుటాపు దొర కదిలిండో
ఎవరికి వీడు దొరకడులెండో
ముదురండో గడుసండో
తొడిగిన ముసుగండో
ఉప్పుకప్పురంబునొక్క లుక్కు నుండో
వీడి లుక్కు చూసి మోసపోకండో
ఎదవండో బడవండో వలలో పడకండో
కమాన్ కమాన్ మోస్ట్ కన్నింగు
కమాన్ కమాన్ మస్తు టైమింగు
కమాన్ కమాన్ రైటులొలరంగు
ఏ యాయియమ్యో
కమాన్ కమాన్ కోతల కింగు
కమాన్ కమాన్ మార్చే తన రంగు
కమాన్ కమాన్ పక్కా ప్లానింగు
ఏ యాయియమ్యో
మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ హీస్ మిస్టర్ పర్ఫెక్ట్
లెన్సేసి వెతుకు దొరకదురా ఏ డిఫెక్ట్॥
వీడో పెద్ద వెధవ
ఈ మ్యాటర్ నాకు మాత్రం తెలుసు
వీడి గురించి చెప్పి చెప్పి
నాలికంతా కందిపోయింది
కానీ ఎవడూ నమ్మడు పైగా ఈ రోజుల్లో
ఇలాంటోళ్లకు డిమాండ్ కొంచెం ఎక్కువ
అయినా ఇంకోసారి టై చే స్తా
తప్పకుండా వీడి తాటతీస్తా
సారీ నేను గుడ్‌బాయ్‌లా
ఉండాలనుకొంటున్నాను
అందుకే అందరిముందు కాల్చను
చరణం :
హిప్పులూపుతున్న క్యాటు వాకులండో
క్రొకడైల్ వీలు కాలు జారకండో
బ్రూలండో బ్రైటండో లైఫే చూస్తుండో
మేడిపండులాంటి మ్యాన్ వీడండో
మ్యాన్ హోల్‌లాంటి మైండు వీడిదండో
చీటండో చీపండో గజిబిజి పజిలండో
కమాన్ కమాన్
హీస్ గాట్ ఎ బాగ్ ఆఫ్ ట్రిక్స్
కమాన్ కమాన్ బివేర్ యు ట్వెంటీ చిక్స్
కమాన్ కమాన్ హార్టు హైజాకరు నమ్మొద్దే
కమాన్ కమాన్ హీస్ ద జాదూగర్
కమాన్ కమాన్ హి గివ్స్ యు ఫీవర్
కమాన్ కమాన్
హీస్ ద కూల్ క్రాకర్ తాకొద్దే... హే..॥

మిస్టర్ పర్ఫెక్ మిస్టర్ పర్ఫెక్ మిస్టర్ పర్ఫెక్
మిస్టర్ పర్ఫెక్ మిస్టర్ పర్ఫెక్ మిస్టర్ పర్ఫెక్
కమాన్ కమాన్ ఓరి గోవిందో
కమాన్ కమాన్ వీడు గురివిందో
కమాన్ కమాన్ సందు దొరికిందో
దోచేస్తాడయ్యో
కమాన్ కమాన్ హరియవో శంభో
కమాన్ కమాన్ రేగింది పంబో
కమాన్ కమాన్
వీణ్ని ఆపాలి మేనకో రంభో॥

chilipi chilaka - చిలిపి చిలక

చిత్రం : అల్లరి ప్రేమికుడు(allari prEmikuDu) (1994)
రచన : వేటూరి(vETUri)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి(M.M.kIravANi)
గానం : ఎస్.పి.బాలు, చిత్ర(S.P.bAlu,chitra)


పల్లవి : చిలిపి చిలక ఐ లవ్ యూ అన్నవేళలో
కలికి చిలక కవ్వింతల తోరణాలలో
చిలక పచ్చ పైటకి కోకిలమ్మ పాటకి
రేపో మాపో కమ్మని శోభనం॥
చరణం : 1
సంపంగి రేకుల్లో కొంపేసుకున్నాక
కలికి వయ్యారాల ఒంపు
ఆ... కబురు పంపు
ఆ... గుబులు చంపు
వంగల్లి రెక్కల్లో ఒళ్లారబోశాక
వయసు గోదాట్లోకి దింపు
ఆ... మరుల గుంపు
ఆ... మగువ తెంపు
అహో ప్రియా మహోదయా
లయ దయ లగావో
సుహాసిని సుభాషిణి
చెలీ సఖీ చలావో
ఈ వసంతాల పూల వరదలా
నను అల్లుకోవే తీగ మరదలా
నూజివీడు మామిడో
మోజు పడ్డ కాముడో
ఇచ్చాడమ్మా తీయని జీవితం॥
చరణం : 2
నీలాల మబ్బుల్లో నీళ్లోసుకున్నాక
మెరిసిందిలే చుక్క రూపు
ఆ... కలల కాపు ఆ... కనుల కైపు
పున్నాల ఎన్నెల్లో పువ్వెట్టిపోయాక
తెలిసింది పిల్లాడి ఊపు
ఆ... చిలిపి చూపు ఆ... వలపు రేపు
వరూధిని సరోజిని ఏదే కులుమనాలి
ప్రియా ప్రియా హిమాలయా
వరించుకోమనాలి
కోనసీమ కోక మడతలా
చిగురాకు ైరె కు ఎత్తిపొడుపులా
కొత్తపల్లి కొబ్బరో
కొంగుపల్లి జబ్బరో
నచ్చిందమ్మా అమ్మడి వాలకం॥

నీ చరణం కమలం

చిత్రం : జానకి రాముడు (1988)
రచన : వేటూరి
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి
22 May - నేడు వేటూరి వర్థంతి


పల్లవి :
నీ చరణం కమలం మృదులం
నా హృదయం పదిలం పదిలం॥చరణం॥
నీ పాదాలే రసవేదాలు
నను కరిగించే నవనాదాలు
అవి ఎదలో ఉంచిన చాలు...
ఏడేడు జన్మాలు...॥చరణం॥
చరణం : 1
మువ్వలు పలికే మూగతనంలో
మోమున మోహన రాగాలు
కన్నులు పలికే కలికితనంలో
చూపున సంధ్యారాగాలు॥
అంగ అంగమున అందచందములు
ఒంపు ఒంపునా హంపి శిల్పములు॥
ఎదుటే నిలిచిన చాలు...
ఆరారు కాలాలు...॥చరణం॥
చరణం : 2
జతులే కలికే జాణతనంలో
జారే పైటల కెరటాలు
శ్రుతులే కలిసే రాగతనంలో
పల్లవించి నా పరువాలు॥
అడుగు అడుగునా రంగవల్లికలు
పెదవి అడుగునా రాగమాలికలు॥
ఎదురై నిలిచిన చాలు...
నీ మౌనగీతాలు...॥చరణం॥

EveTTi chESADE - ఏవెట్టి చేశాడే


చిత్రం : స్టూడెంట్ నెం:1(Student No.1) (2001)
రచన : చంద్రబోస్(chandrabOse)
సంగీతం : కీరవాణి(keeravANi)
గానం : ఉదిత్ నారాయణ్, చిత్ర(udit nArAyaN,chitra)

పల్లవి :
ఏవెట్టి చేశాడే ముద్దుగుమ్మ
నిను ఆ బ్రహ్మ
నీ ఒళ్లే నాజూకు
పూలరెమ్మ ॥
పాలతోనా పూలతోనా
వెన్నతోనా జున్నుతోనా
రంభ ఊర్వశి మేని చెమటతోనా
ఏవెట్టి ఏవెట్టి... టీ టీ టీ టీ॥
చరణం : 1
నిన్ను చూసినప్పుడే
కనకదుర్గకు నేను మొక్కుకున్నా
నీకు కన్ను కొట్టుకుంటానని
నిన్ను కౌగిలించుకుంటానని
నిన్ను కలిసినప్పుడే సాయిబాబాకు నేను మొక్కుకున్నా
నీతో సంధి చేసుకుంటానని
నీతో సందులోకి వస్తానని
రాఘవేంద్రస్వామికి మొక్కుకున్నా నీతో భాగస్వామినౌతానని
మూడుకళ్ల శివుడికి మొక్కుకున్నా నీతో మూడు రాత్రులవ్వాలని
ఆఖరికి... ఆఖరికి నీకే మొక్కుకున్నా నీ నౌకరుగా ఉంటానని
తీపి చాకిరులే చేస్తానని
ఏవెట్టి... ఏవెట్టి... టీ టీ టీ టీ...
ఏవెట్టి పెంచిందోయ్ ఓ మావా
నిను మీ అమ్మ
నీపైనే పుట్టిందోయ్
పిచ్చప్రేమ
ఉక్కుతోనా ఉగ్గుతోనా
నిప్పుతోనా పప్పుతోనా
కాముడు పంపిన
కోడి పులుసుతోనా ॥
చరణం : 2
నువ్వు కట్టుకొచ్చిన
గ ళ్ల చీరతో ఒకటి చెప్పుకున్నా
నేను చూడగానే జారాలని
ఆ మాటనోరు జారొద్దని
నువ్వు పెట్టుకొచ్చిన
కళ్లజోడుతో ఒకటి చెప్పుకున్నా
మేము అల్లుకుంటే చూడొద్దని
ఈ లొల్లి బైట చెప్పొద్దని
చెవులకున్న దుద్దులతో చెప్పకున్నా
చిలిపి మాటలన్ని వినొద్దేయని
కాలికున్న మువ్వలతో చెప్పుకున్నా
మసక చీకటేళ మూగ బొమ్మని
నీ కన్నెతనానికే చెప్పుకున్నా
తనకేవేవో చెబుతానని
అవి నీక్కూడా చెప్పొద్దని ॥

maNDapETa malakpETa - మండపేట మలకపేట

చిత్రం : ప్రేమికుడు (1995)
రచన : రాజశ్రీ, సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
గానం : సురేష్ పీటర్, షాహుల్ హమీద్, కుంజురామ్మ


పల్లవి :
మండపేట మలకపేట
నాయుడుపేట బేటరాప్
నేడేంటి రేపేంటి దినసరి అదే
రాత్రి ఏంటి పగలేంటి మార్పులేదులే
మర్చిపోదామే బాధలు మర్చిపోదామే
కోపం వస్తే కొంచెం ఆపుకొందామే
అరే గెట్ అప్ అండ్ డాన్స్ ఇక నీదే ఛాన్స్
నీ చేతిలో అన్నీ ఉన్నవిరా
తాక్ చిక్ టపాట పాడుదాం
ముందు ఎవరు ముందు ఎవరు
ముందు ముందు ముందు ముందు
బేటరాప్ బేటరాప్... (2)
అచ్చంపేట బుచ్చంపేట కొత్తపేట కొబ్బరిమట్ట (2)
చరణం : 1
హే... డబ్బులేంటి గిబ్బులేంటి ఉన్నది
ఒక లైఫ్ చాలయ్య దేవుడా నాకు ఒక వైఫ్
తెరచి ఉంచుదాం మనసు తెరచి ఉంచుదాం
వచ్చేది ఎవరో వేచిచూద్దాం
అరే నీకోసం పుట్టింది నీదేరా
దొరికింది అందుకోరా అంతేరా
జరిగింది జరిగేది ఉంటే తెల్లవారె తెల్లవారె
తెల్ల తెల్ల తెల్లవారే
బేటరాప్ బేటరాప్... బేటరాప్ బేటరాప్... (2)
చరణం : 2
వాటర్ కరెంట్ కళ్లాపి ప్యాకెట్ పాలు
పిల్లలు స్కూలుఫీజు చక్కెర చమురు రవ్వ రేషన్
పామాయిల్ పచ్చి బియ్యం గోధుమ చాలక చాలక
ఉన్న డబ్బులన్నీ చాలక
ఒక్కణా రెండణా హుండి పగలగొట్టి
పావలా అర్ధ అప్పుసొప్పు చేసి॥
చెంబు చాట తాకట్టు పెట్టి
ఐదు పది అడుక్కున్న అవసరాలు తీరలేదే॥॥

చరణం : 3
సారాయి ఎండుచేప బీడీముక్క
పండుగప్ప గుడిసె కుప్పతొట్టి పక్కనే టీ కొట్టు
రిక్షా గాలిపటం గాజుపెంకు మాంజా
గూటీబిళ్ల గోళికాయ గాలిపాట పాడుదాం
అగడం బగడం నెమలికి దంతం
సుబ్బరాయుడు సుబ్బలక్ష్మి నర్రా నాగమణి
ఎన్.టి.ఆర్. ఏ.ఎన్.ఆర్. చిరంజీవి బాలయ్య
పగలు గిగలు రాత్రి గీత్రి ఆల్ షోస్ హౌస్ ఫుల్లే॥

kalagaNTi kalagaNTi - కలగంటి కలగంటి

గానం : ఎస్.పి.బాలు, కె.ఎస్.చిత్ర(S.P.bAlu.chitra)
చిత్రం : అన్నమయ్య (annamayya)(1997)
రచన : అన్నమాచార్య(annamAchArya)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి(m.M.kIravANi)



పల్లవి :

కలగంటి కలగంటి... ఇప్పుడిటు కలగంటి
ఎల్లలోకములకు అప్పడగు తిరువేంకటాద్రీశు గంటి॥
చరణం : 1
అతిశయంబైన శేషాద్రి శిఖరము గంటి
ప్రతిలేని గోపుర ప్రభలు గంటి
శతకోటి సూర్యతేజములు వెలుగగ గంటి
చతురాశ్యు పొడగంటి...
చతురాశ్యు పొడగంటి చయ్యన మేలుకొంటి
ఇప్పుడిటు కలగంటి...
చరణం : 2
అరుదైన శంఖచక్రాదులిరుగడ గంటి
సరిలేని అభయ హస్తమును గంటి
తిరువేంకటాచలాధిపుని చూడగ కంటి
హరి గంటి గురుగంటి...
హరి గంటి గురుగంటి అంతట మేలుకంటి

mUsina mutyAlakElE - మూసిన ముత్యాలకేలే

గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
పల్లవి :
మొరగులు
ఆశల చిత్తానికేలే అలవోకలు॥
చరణం : 1
కందులేని మోమునకేలే... కస్తూరి...
చిందు నీ కొప్పున కేలే... చేమంతులు...
గమపప పపప నిపమ గసని
సగమమ మమమ గపద మపని దనిస
మందయానమునకేలే మెట్టెలమోతలు మందయానమునకేలే మెట్టెలమోతలు
గంధమేలే పై కమ్మని నీ మేనికి॥
చరణం : 2
ముద్దు ముద్దు మాటలకేలే...
ముదములు...
నీ అద్దపు చెక్కిలికేలే... అరవిరి...
ఒద్దిక కూటమికేలే... ఏలే ఏలే ఏలేలే
ఒద్దిక కూటమికే ఊర్పులు
నీకు అద్దమేలే తిరువేంకటాద్రీశుగూడి॥

చిత్రం : మెంచివునసులు(ma~nchi manasulu) (1962)
రచన : కొసరాజు(kosarAju)
సంగీతం : కె.వి.మహదేవన్(K.K.mahadEvan)
గానం : జమునారాణి(jamunArANi)


పల్లవి :
ఎంతా టక్కరివాడు నా రాజు
ఏ మూలనో నక్కినాడు
పంటచేను గట్టుమీద
ఒంటిగ నే పోతుంటే
వెంట వచ్చినట్టులున్నది
ఎవరో వెనక నిలిచినట్టులున్నది (2)
గుబులు గుబులుగా గుండె ఝల్లుమని
గుబులు గుబులుగా గుండె ఝల్లుమని
బిక్కు బిక్కుమని చూశాను
ఫక్కున పక్కనే నవ్వేను
ఎవరూ... నా నీడ ॥
చరణం : 1
పొర్లిపారు ఏటిలోన
బుటుకు బుటుకు మునుగుతుంటే
బుగ్గ తాకినట్టులున్నది
ఎవరో పైట లాగినట్టులున్నది
గిలిగింతలు పెట్టినట్లు
ఒడలంతా పులకరించే
నీళ్లంతా వెదికినాను
త్రుళ్లి త్రుళ్లి పారిపోయేనూ
ఎవరూ చేప... ॥
చరణం : 2
అర్ధరాత్రి వేళ నేను ఆదమరచి నిదురపోతే
వద్ద చేరినట్టులున్నది
ఎవరో ముద్దులాడినట్టులున్నది
చిక్కినాడూ దొంగయనుకొని
చేయి చాచి పట్టబోతే
కంటికేమి కానరాక
కరిగి కరిగి పోయెను
ఎవరూ... కల... ॥


Special Note:
పూర్తిపేరు : కోక జమునారాణి
జననం : 17-05-1938
జన్మస్థలం : చెన్నై
తల్లిదండ్రులు: ద్రౌపది, వరదరాజుల నాయుడు
తోబుట్టువులు : అన్నయ్య కె.వి.స్వామి
చదువు : 8వ తరగతి
తొలిచిత్రం-పాట : త్యాగయ్య (1946) - మధురానగరిలో...
పాటలు : సుమారు 6 వేలు (తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, సింహళం)
గౌరవ పురస్కారాలు : తమిళనాడు ప్రభుత్వం నుండి 1998లో కళైమామణి. శ్రీలంకలో సరసవ్య ఫెస్టివల్ తరఫున 2002లో మహేంద్ర రాజపక్ష చేతుల మీదుగా ‘అరింగర్ అన్నా’ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు, తెలుగులో ‘ఉగాది పురస్కారం’ అందుకున్నారు.
ఇష్టమైన వాయిద్యం : హార్మోనియం
ఇష్టమైన రాగం : శుభ పంతువరాళి
ఇతరవిషయాలు : జమునారాణి తల్లి సాంబమూర్తి ఆర్కెష్ట్రాలో వీణను వాయించేవారు. తల్లి వద్దే జమునారాణి సంగీతాన్ని నేర్చుకున్నారు. 4 ఏళ్ల వయసప్పుడు రైల్వే చిల్డ్రన్స్ ప్రోగ్రామ్‌లో పాల్గొని ఒక తమిళ సినిమా పాట పాడి మొదటి బహుమతి గెలుచుకున్నారు. మొదట జమునారాణి ‘తాసీల్దారు (1944)’ అనే సినిమాలో పాడారు. కానీ రికార్డులలో ఆవిడ పేరు వేయలేదు.
ఈమెను సంగీత దర్శకులు సుసర్ల దక్షిణామూర్తి ఎక్కువగా ప్రోత్సహించేవారు. 50వ దశకంలో తెలుగులో మాత్రమే ఐదు ప్రైవేటు గీతాలు పాడారు. ఇటీవల ‘మిథునం’ (రిలీజ్ కాలేదు) అనే సినిమాలో ‘ఎవరో గెలిచారిప్పుడు...’ అనే బ్యాక్‌గ్రౌండ్ సాంగ్‌ను పాడారు.

పల్లవి :

ఎంతా టక్కరివాడు నా రాజు
ఏ మూలనో నక్కినాడు
పంటచేను గట్టుమీద
ఒంటిగ నే పోతుంటే
వెంట వచ్చినట్టులున్నది
ఎవరో వెనక నిలిచినట్టులున్నది (2)
గుబులు గుబులుగా గుండె ఝల్లుమని గుబులు గుబులుగా గుండె ఝల్లుమని
బిక్కు బిక్కుమని చూశాను
ఫక్కున పక్కనే నవ్వేను
ఎవరూ... నా నీడ ॥

చరణం : 1

పొర్లిపారు ఏటిలోన
బుటుకు బుటుకు మునుగుతుంటే
బుగ్గ తాకినట్టులున్నది
ఎవరో పైట లాగినట్టులున్నది
గిలిగింతలు పెట్టినట్లు
ఒడలంతా పులకరించే
నీళ్లంతా వెదికినాను
త్రుళ్లి త్రుళ్లి పారిపోయేనూ
ఎవరూ చేప... ॥

చరణం : 2

అర్ధరాత్రి వేళ నేను ఆదమరచి నిదురపోతే
వద్ద చేరినట్టులున్నది
ఎవరో ముద్దులాడినట్టులున్నది
చిక్కినాడూ దొంగయనుకొని
చేయి చాచి పట్టబోతే
కంటికేమి కానరాక
కరిగి కరిగి పోయెను
ఎవరూ... కల... ॥

చిత్రం : వుంచివునసులు (1962)
రచన : కొసరాజు
సంగీతం : కె.వి.వుహదేవన్
గానం : జమునారాణి


పూర్తిపేరు : కోక జమునారాణి
జననం : 17-05-1938

జన్మస్థలం : చెన్నై

తల్లిదండ్రులు: ద్రౌపది, వరదరాజుల నాయుడు

తోబుట్టువులు : అన్నయ్య కె.వి.స్వామి

చదువు : 8వ తరగతి

తొలిచిత్రం-పాట : త్యాగయ్య (1946) - మధురానగరిలో...

పాటలు : సుమారు 6 వేలు (తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, సింహళం)

గౌరవ పురస్కారాలు : తమిళనాడు ప్రభుత్వం నుండి 1998లో కళైమామణి. శ్రీలంకలో సరసవ్య ఫెస్టివల్ తరఫున 2002లో మహేంద్ర రాజపక్ష చేతుల మీదుగా ‘అరింగర్ అన్నా’ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు, తెలుగులో ‘ఉగాది పురస్కారం’ అందుకున్నారు.

ఇష్టమైన వాయిద్యం : హార్మోనియం

ఇష్టమైన రాగం : శుభ పంతువరాళి

ఇతరవిషయాలు : జమునారాణి తల్లి సాంబమూర్తి ఆర్కెష్ట్రాలో వీణను వాయించేవారు. తల్లి వద్దే జమునారాణి సంగీతాన్ని నేర్చుకున్నారు. 4 ఏళ్ల వయసప్పుడు రైల్వే చిల్డ్రన్స్ ప్రోగ్రామ్‌లో పాల్గొని ఒక తమిళ సినిమా పాట పాడి మొదటి బహుమతి గెలుచుకున్నారు. మొదట జమునారాణి ‘తాసీల్దారు (1944)’ అనే సినిమాలో పాడారు. కానీ రికార్డులలో ఆవిడ పేరు వేయలేదు.

ఈమెను సంగీత దర్శకులు సుసర్ల దక్షిణామూర్తి ఎక్కువగా ప్రోత్సహించేవారు. 50వ దశకంలో తెలుగులో మాత్రమే ఐదు ప్రైవేటు గీతాలు పాడారు. ఇటీవల ‘మిథునం’ (రిలీజ్ కాలేదు) అనే సినిమాలో ‘ఎవరో గెలిచారిప్పుడు...’ అనే బ్యాక్‌గ్రౌండ్ సాంగ్‌ను పాడారు.

ADakUturA nIku - ఆడకూతురా నీకు

చిత్రం : కంటే కూతుర్నే కను(ka~mTE kUturnE kanu) (1998)
రచన : సుద్దాల అశోక్‌తేజ(suddAla ashok tEja)
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్(vandEmAtaram SrInivAs)
గానం : కె.ఎస్.చిత్ర(K.S.chitra)


పల్లవి :
ఆడకూతురా నీకు
అడుగడుగున వందనం
అనునిత్యం కరుగుతున్న
నీవు రక్తచందనం
//ఆడకూతురా//
చరణం : 1
మహరాజులే
మగాళ్లు అందరు
తెల్లవారినా నిదుర లేవరు
కంటినిండ కునుకు
కనలేదు నీవెప్పుడు
సగము నిదురలోనే
నినులేపేను చీపురు
మగబిడ్డల యోగమేమిటో
లేవగానే భోగ మేమిటో
ఎగతాళిగ నిన్నేగని
నవ్వే పాచి గిన్నెలు
ఆడకూతురా
నీకు అడుగడుగున వందనం
అనునిత్యం కరుగుతున్న
నీవు రక్తచందనం
చరణం : 2
బండచాకిరి రేబవలు చేసినా
గుండె బరువని నీ పేరు పెట్టిరి

పదహారవ ఏట ఇక మొదలు
వరుడి వేట
నీ బరువు దించుకోవడమే
తల్లిదండ్రి ముచ్చట
పుటక నుండి చావు మధ్యనా
బతుకునంత అరగదీసినా
ఏ జీతము ఏ సెలవు
ఎరుగని ఒక దాసివి
//ఆడకూతురా//
చరణం : 3
పెళ్లిపీటపై కంఠాన్ని ముడేసి
నాతిచరామి అంటాడు ఒట్టేసి
అక్షింతలతోనే మంత్రాలు నేలపాలు
మరునాటి నుండే నీ బతుకు
బూటు కాలు
ఇంటికి దీపం ఇల్లాలు
అత్తమామ కాదంటే చీకటి పాలు
మగవాడే నీనొసటన రాసే
మనువు రాతలు
//ఆడకూతురా//

machilIpaTnam mAviDi - మచిలీపట్నం మావిడి

చిత్రం : మెరుపుకలలు(merupu lkalalu) (1997)
రచన : వేటూరి(vETUri)
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్(A.R.rEhamAn)
గానం : చిత్ర, ఉన్నిమీనన్, శ్రీని(chitra,unni mInan,SrIni)


పల్లవి :
హు లలల్లా ఉహు లలల్లా
ఉహు లల్లల్లాల్లల్లాల్లల్లాలల్లా (2)
మచిలీపట్నం మావిడి చిగురులో
పచ్చని చిలక అలిగి అడిగిందేవిటంటా
నాకంటి కెంపు అలకా నా రెక్క నునుపు తళుకా
చిలకా దేవి కన్నుగీట సాగే నా పల్లవి ॥లలల్లా॥
అనుపల్లవి :
మెట్టదారి ఇదే బండికి వాలు ఇదే
ఓ పోంకాల పోరీ ఒకతీ
కోరికట్టుకున్న చీర పొగరు చూశా
వానవిల్లు వర్ణం వాహా
మలసిన మల్లెవాన చింది చింది
సుధ చిలికే నయగానం
మది ఎద వాలి గిల్లి
కొత్త తాళమడిగినదే చెలగాటం॥లలల్లా॥
చరణం : 1
తందానా తందానా తాకి మరీ తందాన
ఏ తాళం వాయించాడే
తందానా తందానా పాట వరస తందాన
ఏ రాగం పాడిస్తాడే
సిరివలపో మతిమరుపో అది హాయిలే
సిరిపెదవో విరి మధువో ప్రియ మేనులే
తందాన తందాన కన్నెప్రేమ తందాన
వచ్చిపోయే వాసంతాలే
మనసిజ మల్లివేళ సిగ్గు సిగ్గు లయలొలికే వ్యవహారం
అది అలవాటు కొచ్చి గుచ్చి చూసే
మనసడిగే చెలగాటం ॥లలల్లా॥
చరణం : 2
తందానా తందానా
ఊసు కనుల తందానా
ఊరించే పెట్టు తేనె
తందానా తందానా పాటకొక్క తందానా
చెవి నిండా గుమ్మెత్తేనె
వయసులలో వరసలలో తెలియందిదే
మనసుపడే మౌన సుఖమె విరహానిదే
ఏ... తందానా తందానా
మేఘరాగం తందానా
వచ్చె వచ్చె వానజల్లే
మధురస మాఘవేళ కన్నుగీటి
కథనడిపే సాయంత్రం
తొలి చెలిగాలి సోలి కొత్త తోడు కలిసినదే చెలగాటం
॥లలల్లా॥

hE udayinchina - హే ఉదయించిన

చిత్రం : కలుసుకోవాలని(kalusukOvAlani) (2002),
రచన , సంగీతం, గానం : దేవిశ్రీ ప్రసాద్(dEviSrI prAsAd)


పల్లవి :
హే... ఉదయించిన సూర్యుడినడిగా
కనిపించని దేవుడినడిగా
నా గుండెలో నీ గుడినడిగా
నువ్వెక్కడనీ
చలి పెంచిన చీకటినడిగా
చిగురించిన చంద్రుడినడిగా
విరబూసిన వెన్నెలనడిగా
నువ్వెక్కడనీ
చెప్పవే... హే ఓ చెలీ నువ్వెక్కడే నా జాబిలి
ఇక్కడే ఎక్కడో ఉన్నావు అన్న
కబురు తెలుసులే
వెచ్చని నీ కౌగిలి చిత్రాలు చేసే నీ చెక్కిలి
ఇప్పుడూ ఎప్పుడూ నే మరువలేని
తీపి గురుతులే
ధీం తకిటతక్ తక్ తకిటతక్
తధీం తకిటతక్
తాంకిటతక తరికిటతక తరికిటతక॥తకిటతక్‌॥
చరణం : 1
మనసు అంతా నీ రూపం
నా ప్రాణమంతా నీకోసం
నువ్వెక్కడెక్కడని వెతికి వయసు
అలిసిపోయే పాపం
నీ జాడ తెలిసిన నిమిషం అహ అంతులేని సంతోషం
ఈ లోకమంతా నా సొంతం ఇది
నీ ప్రేమ ఇంద్రజాలం
అడుగు అడుగున నువ్వే నువ్వే
నన్ను తాకెనే నీ చిరునవ్వే
కలల నుండి ఓ నిజమై రావే నన్ను చేరవే
హోయ్ ప్రేమ పాటకు పల్లవి నువ్వే
గుండెచప్పుడుకి తాళం నువ్వే
ఎదను మీటు సుస్వరమై రావే
నన్ను చేరవే

హే... ఉదయించిన సూర్యుడినడిగా
కనిపించని దేవుడినడిగా
నా గుండెలో నీ గుడినడిగా
నువ్వెక్కడనీ
చరణం : 2
నువ్వు లేక చిరుగాలి
నావైపు రాను అంటోంది
నువ్వు లేక వెన్నెల కూడా ఎండల్లే
మండుతోంది
కాస్త దూరమే కాదా
మన మధ్యనొచ్చి వాలింది
దూరాన్ని తరిమివేసే గడియ
మన దరికి చేరుకుంది
ఏమి మాయవో ఏమో గానీ
నువ్వు మాత్రమే నా ప్రాణమనీ
నువ్వు ఉన్నా నా మనసంటుందే
నిన్ను రమ్మని
హాయ్ నువ్వు ఎక్కడున్నావో గానీ
నన్ను కాస్త నీ చెంతకు రానీ
నువ్వు లేక నేనే లేను అని నీకు తెలుపనీ

హే... ఉదయించిన సూర్యుడినడిగా
కనిపించని దేవుడినడిగా
నా గుండెలో నీ గుడినడిగా
నువ్వెక్కడనీ

hE udayinchina sooryuDinaDiga kanipinchani devuDinaDiga

naa gunDelo nee guDi naDiga nuvvekkaDaa ani

chali penchina cheekaTi naDiga
chigurinchina chandruDinaDiga
viraboosina vennela naDiga nuvvekkaDa ani
chikkavE O cheli nuvvekkaDE naa jaabili
ikkaDe ekkaDO unnaavu anna kaburu telusulE
vecchani nee kougili chitraalu chEsE nee chekkili
ippuDuu yeppuDu nE maruva lEni teepi gurutulE

manasu anta nee roopam na praaNamanta neekOsam
nuvvekkaDa ekkaDa ani vetiki vayasu alasipOye paapam
nee jaaDa telisEnannu nimisham aha antulEni santOsham
ee lOkamanta naa sontam idi nee prEma indrajaalam
aDugu aDuguna nuvvE nuvvE nannu taakEnE nee chirunavvE
kaLalaa nunDi O nijamai raave nannu chEraave
hOy prEma paaTaku pallavi nuvve gunDe chappuDiki taLam nuvvE
yedanu meeTu suswaramai raave nannu chErave

nuvvu lEka chirugaali naa vaipu raanu anTondi
nuvvu lEka vennela kooDa yenDalle manDutondi
kaasta dooramE kaada mana madhyanocchi vaalindi
dooraanni tarimi vEsE gaDiya mana dariki chErukondi
yEmi mayavo emO gaani nuvvu maatramE naa praaNamani
nuvvu unna naa manasanTundi ninnu rammani
hOy nuvu ekkaDunaavO gaani nannu kaasta nee chentaku raani
nuvvu lEkanE lEnElEnani kaasta telupani

ammanu mi~nchi - అమ్మను మించి

చిత్రం : 20వ శతాబ్దం(20th Century) (1990)
రచన : డా॥సి.నారాయణరెడ్డి(C.nArAyaNa reddy)
సంగీతం : జె.వి.రాఘవులు(J.V.sOmayAjulu)
గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల(S.P.bAlu, P.suseela)
13 May - నేడు మదర్స్ డే(Mothers Day)

పల్లవి :
అమ్మను మించి దైవమున్నదా
ఆత్మను మించి అద్దమున్నదా
అమ్మను మించి దైవమున్నదా
ఆత్మను మించి అద్దమున్నదా
జగమే పలికే శాశ్వత సత్యమిదే
అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే
అవతార పురుషుడైనా
ఓ అమ్మకు కొడుకే
అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే
అవతార పురుషుడైనా
ఓ అమ్మకు కొడుకే ॥
చరణం : 1
రఘురాముడిలాంటి కొడుకు ఉన్నా
తగిన కోడలమ్మ లేని లోటు తీరాలి
సుగుణ రాశి సీతలాగ తాను
కోటి ఉగాదులేనా గడపకు తేవాలి
మట్టెలతో నట్టింట్లో తిరుగుతుంటే
మట్టెలతో నట్టింట్లో తిరుగుతుంటే
ఈ లోగిలి కోవెలగా మారాలి
అమ్మను మించి దైవమున్నదా
ఆత్మను మించి అద్దమున్నదా
జగమే పలికే శాశ్వత సత్యమిదే
అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే
అవతార పురుషుడైనా
ఓ అమ్మకు కొడుకే
చరణం : 2
తప్పడడుగులేసిన చిననాడు
అయ్యో తండ్రీ అని
గుండె కద్దుకున్నావు
తప్పడడుగులేస్తే ఈనాడు
నన్ను నిప్పుల్లో నడిపించు ఏనాడు
నింగికి నిచ్చెనలేసే మొనగాడినే (2)
ఐనా నీ ముంగిట
అదే అదే పసివాడినే॥

kalagA kammani kalagA - కలగా కమ్మని కలగా

చిత్రం : శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం(SrI ve~mkaTESwara mahAtmyam) (1960)
రచన : ఆచార్య ఆత్రేయ(AchArya AtrEya)
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు(penDyAla nAgEswararAo)
గానం : ఘంటసాల, పి.సుశీల(ghanTasAla,P.suseela)


పల్లవి :
కలగా కమ్మని కలగా
మన జీవితాలు
మనవలెగా
కలగా కమ్మని కలగా
అనురాగమే
జీవన జీవముగా
ఆనందమె
మనకందముగా
కలగా కమ్మని కలగా
చరణం : 1
రాగవశమున మేఘమాలిక
మలయ పవనుని
కలిసి తేలగా... ఆ... ఆ... ఆ... ఆ...॥
ఆ... కొండను తగిలి గుండియ కరిగి
నీరై ఏరై పారునుగా
కలగా కమ్మని కలగా
మన జీవితాలే ఒక కలగా
కలగా కమ్మని కలగా
చరణం : 2
వెలుగు చీకటుల కలబోసినవి
కాలము చేతిలో
కీలుబొమ్మలం
భావనలోనే
జీవనమున్నది
మమతే జగతిని నడుపునది (2)
కలగా కమ్మగా కలగా
చరణం : 3
తేటికోసమై
తేనియ దోచే
విరి కన్నియకా సంబరమేమో
వేరొకరిని చేరిన ప్రియుని
కాంచినప్పుడా కలత ఏమిటో
ప్రేమకు శోకమే ఫలమేమో
రాగము త్యాగము జతలేమో
కలగా కమ్మగా కలగా... ఆ... ఆ...

Special Note:
సి.ఎస్.ఆర్.ఆంజనేయులు, శాంతకుమారితో ‘వేంకటేశ్వర మహాత్మ్యం’ (1939) సినిమా తీసిన పి.పుల్లయ్యే... ‘శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం’ సినిమాకి కూడా దర్శకత్వం వహించారు.

dEkhO dEkhO gabbar singh - దేఖో దేఖో గబ్బర్‌సింగ్

చిత్రం : గబ్బర్‌సింగ్(gabbar singh) (2012)
రచన : రామజోగయ్యశాస్త్రి, బాబా సెహగల్ (Rap)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గానం : బాబా సెహగల్, నవీన్ మాధవ్


పల్లవి :
Ladies And Gentlemen Boys And Girls
And All The Fans
Here Comes The Power King
We Call Him As Gabbar Singh
దేఖో దేఖో గబ్బర్‌సింగ్
ఆల్ ఇండియాకే హైపర్ సింగ్
వీడి పేరు వింటే
గూండాల గుండెలోన గుళ్ల సౌండింగ్
వీడి బాడీ స్టీల్‌కే సింగ్
వీడి నరం నైలాన్ స్ట్రింగ్
వీడి కేరెక్టర్ ఖాకీ డ్రెస్సుకే కొత్త కలరింగ్
సత్తాకే స్పెల్లింగు... ఎలేలేలే
కొట్టాడో స్వెల్లింగు... ఎలేలేలే
కళ్లల్లో ఫైరింగు... ఎలేలేలే
ఏ విలన్‌కైనా డెత్ వార్నింగు
బైబర్తే పుడింగు... ఎలేలేలే
పవర్‌కే బ్రాండింగు... ఎలేలేలే
హై ఎండు స్టైలింగు... ఎలేలేలే
గబ్బర్‌సింగ్ గబ్బర్‌సింగ్...
He's On The Way To Do Something
గబ్బర్‌సింగ్ గబ్బర్‌సింగ్
It's Brand New Sound To Sing ॥
గబ్బర్... గబ్బర్... గబ్బర్...
చరణం : 1
మన జోలికొస్తే బ్రదరు
మంటెత్తిపోద్ది వెదరు
మన చేతిదెబ్బ తిని పడుకున్నోళ్లు
మళ్లీ లెగరు
మంచోణ్ణి గిల్లగలరు
ఎహే... చెడ్డోణ్ని గిచ్చగలరు
ఏలెక్కకందని నాలాంటోణ్ణి కెలికేదెవరు
మెగ్గావాట్ మొగ్గోడు... ఎలేలేలే
ర ప్ఫోడు టప్ఫోడు... ఎలేలేలే
కూసింత తిక్కోడు... ఎలేలేలే
ఇట్టా పుట్టేశాడు వాట్ టూ డూ
జో డర్ గయా సమ్‌ఝో మర్ గయా॥
రెన్‌డెజ్‌వస్ మసాలా మ్యాన్ గబ్బర్
ఇస్‌కో మిలేగీ తో ఖా జావోగీ చక్కర్
బాంగే దేశీ రాక్ జాజ్ కోయీ భాంగ్డా
ఇస్‌కో జైసే నహీ బన్ కోయీ పగ్‌డా
నహీ పాయా కభీ ఐసే జైసా కింగ్
దట్స్ వై దే కాల్ హిమ్ గబ్బర్‌సింగ్
చరణం : 2
మన ఫేసు పిచ్చ క్లాసు
మన పంచ్ ఊర మాసు
ఏ డేంజైరె నా సరే ఎదురెళతాయి
మనలో గట్సు
మన ఒంటిమీద డ్రెస్సు
నిప్పుకు గాలిలాంటి ప్లస్సు
చెమడాలు ఒలిచి ఉతికారేస్తాది
గాడ్ ప్రామిస్సు
రయ్యంటూ రైడింటూ... ఎలేలేలే
తుఫానై కుమ్మింగు... ఎలేలేలే
తూటాలా స్ట్రయికింగు... ఎలేలేలే
వీడి పోలీసింగే రూల్సు బ్రేకింగు
జో డర్ గయా సమ్‌ఝో మర్ గయా॥

gabbar singh gabbar singh - గబ్బర్‌సింగ్ గబ్బర్‌సింగ్

చిత్రం : గబ్బర్‌సింగ్(gabbar singh) (2012)
రచన : రామజోగయ్యశాస్త్రి, బాబా సెహగల్ (Rap)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గానం : బాబా సెహగల్, నవీన్ మాధవ్


పల్లవి :
Ladies And Gentlemen Boys And Girls
And All The Fans
Here Comes The Power King
We Call Him As Gabbar Singh
దేఖో దేఖో గబ్బర్‌సింగ్
ఆల్ ఇండియాకే హైపర్ సింగ్
వీడి పేరు వింటే
గూండాల గుండెలోన గుళ్ల సౌండింగ్
వీడి బాడీ స్టీల్‌కే సింగ్
వీడి నరం నైలాన్ స్ట్రింగ్
వీడి కేరెక్టర్ ఖాకీ డ్రెస్సుకే కొత్త కలరింగ్
సత్తాకే స్పెల్లింగు... ఎలేలేలే
కొట్టాడో స్వెల్లింగు... ఎలేలేలే
కళ్లల్లో ఫైరింగు... ఎలేలేలే
ఏ విలన్‌కైనా డెత్ వార్నింగు
బైబర్తే పుడింగు... ఎలేలేలే
పవర్‌కే బ్రాండింగు... ఎలేలేలే
హై ఎండు స్టైలింగు... ఎలేలేలే
గబ్బర్‌సింగ్ గబ్బర్‌సింగ్...
He's On The Way To Do Something
గబ్బర్‌సింగ్ గబ్బర్‌సింగ్
It's Brand New Sound To Sing ॥
గబ్బర్... గబ్బర్... గబ్బర్...
చరణం : 1
మన జోలికొస్తే బ్రదరు
మంటెత్తిపోద్ది వెదరు
మన చేతిదెబ్బ తిని పడుకున్నోళ్లు
మళ్లీ లెగరు
మంచోణ్ణి గిల్లగలరు
ఎహే... చెడ్డోణ్ని గిచ్చగలరు
ఏలెక్కకందని నాలాంటోణ్ణి కెలికేదెవరు
మెగ్గావాట్ మొగ్గోడు... ఎలేలేలే
ర ప్ఫోడు టప్ఫోడు... ఎలేలేలే
కూసింత తిక్కోడు... ఎలేలేలే
ఇట్టా పుట్టేశాడు వాట్ టూ డూ
జో డర్ గయా సమ్‌ఝో మర్ గయా॥
రెన్‌డెజ్‌వస్ మసాలా మ్యాన్ గబ్బర్
ఇస్‌కో మిలేగీ తో ఖా జావోగీ చక్కర్
బాంగే దేశీ రాక్ జాజ్ కోయీ భాంగ్డా
ఇస్‌కో జైసే నహీ బన్ కోయీ పగ్‌డా
నహీ పాయా కభీ ఐసే జైసా కింగ్
దట్స్ వై దే కాల్ హిమ్ గబ్బర్‌సింగ్
చరణం : 2
మన ఫేసు పిచ్చ క్లాసు
మన పంచ్ ఊర మాసు
ఏ డేంజైరె నా సరే ఎదురెళతాయి
మనలో గట్సు
మన ఒంటిమీద డ్రెస్సు
నిప్పుకు గాలిలాంటి ప్లస్సు
చెమడాలు ఒలిచి ఉతికారేస్తాది
గాడ్ ప్రామిస్సు
రయ్యంటూ రైడింటూ... ఎలేలేలే
తుఫానై కుమ్మింగు... ఎలేలేలే
తూటాలా స్ట్రయికింగు... ఎలేలేలే
వీడి పోలీసింగే రూల్సు బ్రేకింగు
జో డర్ గయా సమ్‌ఝో మర్ గయా॥

ruler ruler - రూలర్ రూలర్

చిత్రం : దమ్ము(dammu) (2012)
రచన : చంద్రబోస్(chandrabOse)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి(M.M.keeravANi)
గానం : ఫృథ్వీచంద్ర, గీతామాధురి,రేవంత్, జి.సాహితి
10 May - నేడు చంద్రబోస్ పుట్టినరోజు


సాకీ :
అంగ వంగ కేరళ కళింగ గౌడ కుంతల
విదర్భ మగధ సింహళ సాళ్వ గౌళ బర్బర
అవంతి చోళ లాట పాండ్య చేరి మద్ర
చక్రవర్తులెందరున్నా వీడు ఏకవీరుడు
ఏకైక క్షాత్రవీరుడు
కావ్య చిత్రలేఖనం సంగీత శిల్ప నాటకం
సాముద్రికం ఉచ్ఛాటనం
ఆకర్షణం విద్వేషణం
అగ్ని జల వయస్తంభం
బహుకళాప్రవీణుడు
ప్రవీణుడు నవీనుడు...
బాణ ఖడ్గ చేరి శక్తి యష్టి ప్రాశ గద పాశ
వజ్ర దండ కుంత శూల
ధనుర్విద్యా ప్రపూర్ణుడు
ఘనఘనఘన ఘనుడు
అగిణిత గుణ ఘనుడు
జనగణమున ఘనుడు
రూలర్... రూలర్...
పల్లవి :
ప్రచండ చండ మార్తాండ తేజా...
రాజాధి రాజాధిరాజా
అఖండ మండలానంద భోజా...
రాజధి రాజాధిరాజా
చరితలో వెలుగుతున్న జ్యోతి నీదే
జగతిలో ఎగురుతున్న కీర్తి నీదే
పోరు నీది పేరు నీది...
భువన భవన కరుణ కిరణ
ప్రభువు నువ్వులే
రూలర్... రూలర్...॥ప్రచండ ॥
చరణం : 1
ముందు నుండి ముంచుకొచ్చు
మృగాలనైనా
పిడికిలితో ఫెళఫెళఫెళ కూల్చేస్తా
వెనక నుండి తరుముకొచ్చు జ్వాలలనైనా
పాదంతో దబదబదబ తొక్కేస్తా
అందుకే మరందుకే మరందుకే
అందాలని అరచేతిలో పెడుతున్నా
నీకే అందాలని ఆరాట పడుతున్నా
కెరటమై ఉరుకుతున్న చురుకు నీదే
కదనమై దుముకుతున్న దుడుకు నీదే
ఆట నీది వేట నీది...
భువన భవన కరుణ కిరణ
ప్రభువు నువ్వులే
రూలర్... రూలర్...॥
చరణం : 2
బీద ధనిక అంతరాలు అంతం చేసి
అందరిపై సమభావం చూపాలి
బంధుప్రీతి వర్గప్రీతి దూరం చేసి
అనునిత్యం సమధర్మం చాటాలి
అందుకే మరందుకే మరందుకే
ప్రాణంలో సగభాగం ఇస్తున్నా
నీ ప్రణయంతో సంపూర్ణమౌతున్నా
శిఖరమే శిరసు వంచు గెలుపు నీదే
గగనమే మెలిక తిరుగు మెరుపు నీదే
నీతి నీది ఖ్యాతి నీది...
భువన భవన కరుణ కిరణ
ప్రభువు నువ్వులే
రూలర్...

prachaNDa chaNDa - ప్రచండ చండ మార్తాండ

చిత్రం : దమ్ము(dammu) (2012)
రచన : చంద్రబోస్(chandrabOse)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి(M.M.keeravANi)
గానం : ఫృథ్వీచంద్ర, గీతామాధురి,రేవంత్, జి.సాహితి
10 May - నేడు చంద్రబోస్ పుట్టినరోజు

సాకీ :
అంగ వంగ కేరళ కళింగ గౌడ కుంతల
విదర్భ మగధ సింహళ సాళ్వ గౌళ బర్బర
అవంతి చోళ లాట పాండ్య చేరి మద్ర
చక్రవర్తులెందరున్నా వీడు ఏకవీరుడు
ఏకైక క్షాత్రవీరుడు
కావ్య చిత్రలేఖనం సంగీత శిల్ప నాటకం
సాముద్రికం ఉచ్ఛాటనం
ఆకర్షణం విద్వేషణం
అగ్ని జల వయస్తంభం
బహుకళాప్రవీణుడు
ప్రవీణుడు నవీనుడు...
బాణ ఖడ్గ చేరి శక్తి యష్టి ప్రాశ గద పాశ
వజ్ర దండ కుంత శూల
ధనుర్విద్యా ప్రపూర్ణుడు
ఘనఘనఘన ఘనుడు
అగిణిత గుణ ఘనుడు
జనగణమున ఘనుడు
రూలర్... రూలర్...
పల్లవి :
ప్రచండ చండ మార్తాండ తేజా...
రాజాధి రాజాధిరాజా
అఖండ మండలానంద భోజా...
రాజధి రాజాధిరాజా
చరితలో వెలుగుతున్న జ్యోతి నీదే
జగతిలో ఎగురుతున్న కీర్తి నీదే
పోరు నీది పేరు నీది...
భువన భవన కరుణ కిరణ
ప్రభువు నువ్వులే
రూలర్... రూలర్...॥ప్రచండ ॥
చరణం : 1
ముందు నుండి ముంచుకొచ్చు
మృగాలనైనా
పిడికిలితో ఫెళఫెళఫెళ కూల్చేస్తా
వెనక నుండి తరుముకొచ్చు జ్వాలలనైనా
పాదంతో దబదబదబ తొక్కేస్తా
అందుకే మరందుకే మరందుకే
అందాలని అరచేతిలో పెడుతున్నా
నీకే అందాలని ఆరాట పడుతున్నా
కెరటమై ఉరుకుతున్న చురుకు నీదే
కదనమై దుముకుతున్న దుడుకు నీదే
ఆట నీది వేట నీది...
భువన భవన కరుణ కిరణ
ప్రభువు నువ్వులే
రూలర్... రూలర్...॥
చరణం : 2
బీద ధనిక అంతరాలు అంతం చేసి
అందరిపై సమభావం చూపాలి
బంధుప్రీతి వర్గప్రీతి దూరం చేసి
అనునిత్యం సమధర్మం చాటాలి
అందుకే మరందుకే మరందుకే
ప్రాణంలో సగభాగం ఇస్తున్నా
నీ ప్రణయంతో సంపూర్ణమౌతున్నా
శిఖరమే శిరసు వంచు గెలుపు నీదే
గగనమే మెలిక తిరుగు మెరుపు నీదే
నీతి నీది ఖ్యాతి నీది...
భువన భవన కరుణ కిరణ
ప్రభువు నువ్వులే
రూలర్...

andananta ettA - అందనంత ఎత్తా

చిత్రం : క్షణ క్షణం(kshaNa kshaNam) (1991)
రచన : సిరివెన్నెల(sirivennela)
సంగీతం : ఎం.ఎం. కీరవాణి(M.M.keeravANi)
గానం : ఎస్.పి.బాలు, చిత్ర(S.P.bAlu, chitra)


పల్లవి :
అందనంత ఎత్తా తారాతీరం
సంగతేంటో చూద్దాం దా
ఆ అందమంతా కొత్తా తాళం తీస్తే
సందె విందు సొంతం కాదా //అందనంత//
చిందే సరదా పొంగే వరదా
స్వర్గం మన సమీపయ్యేంత //అందనంత//
చరణం : 1
గువ్వ నీడలో గూడు కట్టుకో
కుర్ర వేడిలో కుకూ కూత పెట్టుకో
దిక్కులన్నీ తెగించే వేగంతో
రెక్క విప్పు నిషాలెన్నో
గుప్పెడంత కులాసా గుండెల్లో
గుప్పుమన్న ఖుషీలెన్నో
తోటమాలి చూడకుండ
ఏటవాలు పాటవెంట
మొగ్గనవ్వు చేరుకుంటే
చుక్కలింట పండగంట //అందనంత//
చరణం : 2
కొంటె కోనలో కోట కట్టుకో
కొత్త కోకలో కో కో కోరికందుకో
కోనకళ్ల గులాబీ గుమ్మంలో
కాచుకున్న కబుర్లెన్నో
కప్పుకున్న కిలాడీ కొమ్మల్లో
గుచ్చుకున్న గుణాలెన్నో
లాగుతున్న గాలి వెంట
సాగుతున్న పూలమంట
తాకుతుంటే దాగదంట
ఆకాశాన పాలపుంత //అందనంత//

idiyE hAyi kalupumu - ఇదియే హాయి కలుపుము

చిత్రం : రోజులు మారాయి (1955)
రచన : తాపీ ధర్మారావు
సంగీతం : మాస్టర్ వేణు
గానం : ఘంటసాల, జిక్కి
08 May - నేడు తాపీ ధర్మారావు వర్ధంతి


పల్లవి :
ఇదియే హాయి కలుపుము చేయి
వేయి మాటలేలనింక... (2) ॥
చరణం : 1
ఓ... ఆ చూపులోనే కురియును తేనె
చిరునగవాహా వెలుగున వాలి
మనసుకు హాయి సోలునే... (2)
నీవాడిన మాట సాటిలేని పూలబాట
సాటిలేని పూలబాట... ఓ... ॥
చరణం : 2
అందాలలోన నడివడిలోన
తొలుతను నీవే తెలియగరావే
బ్రతుకున మేలు చూపవే... (2)
నీ చూపే చాలు అదే నాకు వేనవేలు
అదే నాకు వేనవేలు... ఓ... ॥
చరణం : 3
ఈ లోకమేమో మరో లోకమేమో
మనసులతోనే తనువులు తేలే
బ్రతుకిక తూగుటూయలే... (2)
ఈనాటి ప్రేమ లోటులేని మేటి సీమ
లోటులేని మేటి సీమ... ఓ... ॥

Special Note:
పూర్తిపేరు : తాపీ ధర్మారావు నాయుడు
జననం : 19-09-1887
జన్మస్థలం : ఒరిస్సాలోని బరంపురం
తల్లిదండ్రులు : నరసమ్మ, డాక్టర్ అప్పన్న
చదువు : బి.ఏ.(పచ్చయ్యప్ప కాలే జ్ , చెన్నై)
తోబుట్టువులు : అన్నయ్య (నరసింగరావు), తమ్ముడు (తులసీరావు), చెల్లెళ్లు (వెంకటనరసమ్మ, తిరుపతమ్మ)
వివాహం : 1902
భార్య : అన్నపూర్ణమ్మ
పిల్లలు : కుమార్తెలు (లక్షుమమ్మ, బంగారమ్మ), తర్వాత కవలలు పుట్టి చనిపోయారు. కుమారులు (మోహనరావు, కీ॥అహోబలరావు, చాణక్య)
పాటలు రాసిన తొలిచిత్రం : రైతుబిడ్డ (1939)
ఆఖరిచిత్రం : భీష్మ (1962)
పాటలు : సుమారు 250
గౌరవ పురస్కాలు : శృంగేరీ పీఠాధిపతులు జగద్గురు చంద్రశేఖర భారతీ శంకరాచార్యుల వారి నుండి 1926లో ‘ఆంధ్రవిశారద’ బిరుదు, చేమకూరి వెంకటకవి రచించిన ‘విజయవిలాసం’ కావ్యానికి చేసిన ‘హృదయోల్లాస వ్యాఖ్య’ కు 1971లో కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు. మరెన్నో సాహిత్య అవార్డులు.
ఇతర విషయాలు : ‘తాతాజీ’ గా అందరికీ సుపరిచితులు. ఈయన గిడుగు రామమూర్తి పంతులు గారి శిష్యులు. కొండెగాడు, సమదర్శిని, జనవాణి, కాగడా వంటి పత్రికలలో పనిచేశారు. కళాశాల, సర్వే డిపార్ట్‌మెంట్‌లలో పలు ఉద్యోగాలు చేశారు. ఈయన తొలి రచన 1911లో ‘ఆంధ్రులకొక మనవి’ అనే పేరుతో వెలువడింది. తరువాత అనేక రచనలు చేశారు. మాలపిల్ల (1938) సినిమా రచనతో సినీరంగ ప్రవేశం జరిగింది. 1943లో జరిగిన మొదటి అభ్యుదయ రచయితల సమావేశానికి అధ్యక్షత వహించారు. రచయితగా, భాషాపండితుడిగా, హేతువాదిగా, సంఘసంస్కర్తగా ప్రసిద్ధులు.
మరణం : 08-05-1973

chEtilO cheyyEsi - చేతిలో చెయ్యేసి చెప్పు

చిత్రం : దసరా బుల్లోడు(dasarA bullODu) (1971)
రచన : ఆచార్య ఆత్రేయ(achArya atrEya)
సంగీతం : కె.వి.మహదేవన్(K.V.mahadEvan)
గానం : పి.సుశీల(P.suSeela)
07 May - నేడు ఆత్రేయ జయంతి


పల్లవి :
చేతిలో చెయ్యేసి చెప్పు బావా (2)
చేసుకున్న బాసలు చెప్పుకున్న ఊసులు
చెరిపివేస్తానని మరచిపోతానని॥
చరణం : 1
పాడుకున్న పాటలు పాతవనీ ఊరుకో (2)
ఆ మాటలన్నీ మాపేసి కొత్తపాట పాడుకో॥
చరణం : 2
మాట తప్పిపోయినా
మనిషి బ్రతికితే చాలు (2)
మన మమత చంపుకున్నా
ఒక మంచి మిగిలితే చాలు॥
చరణం : 3
తెలియక మనసిచ్చినా
తెలిసి కుమిలిపోతున్నా (2)
మిమ్ము కలపమని ముక్కోటి దేవతలకు
మొక్కుతున్నా॥

Special Note:
అసలు పేరు :కిళాంబి వేంకట నరసింహాచార్యులు
జననం : 07-05-1921
జన్మస్థలం : నెల్లూరు జిల్లా, సూళ్లూరుపేట తాలుకా మంగళంపాడు
స్వస్థలం : సూళ్లూరుపేట తాలుకా ఉచ్చూరు
తల్లిదండ్రులు : సీతమ్మ, కృష్ణమాచార్యులు
చదువు : ఎస్.ఎస్.ఎల్.సి.
వివాహం - భార్య : 1940 - పద్మావతి
తొలిచిత్రం - పాట : దీక్ష (1951) -పోరా బాబూ పో పోయి చూడు లోకం పోకడ
ఆఖరిచిత్రం - పాట : ప్రేమయుద్ధం (1990) - ఈ మువ్వలగానం మన ప్రేమకు ప్రాణం
పాటలు : సుమారు 1400
దర్శకునిగా : వాగ్దానం (1961)
నటించిన సినిమా : కోడెనాగు (1974)
గౌరవ పురస్కారాలు : 1989 మే లో అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేటు పొందారు. తొలి కోడి కూసింది (1981) లో ‘అందమైన లోకమనీ’ పాటకు నంది అవార్డు అందుకున్నారు.
ఇతరవిషయాలు : గోత్రనామం ఆత్రేయను, పేరులో ఆచార్యను కలిపి ‘ఆచార్య ఆత్రేయ’ అని పెట్టుకున్నారు. చిన్నప్పుటి నుండే చదువు మీద కన్నా నాటకాల మీదనే మక్కువ చూపేవారు. రాజన్ అనే మిత్రుని సాయంతో మద్రాసు చేరుకున్నారు ఆత్రేయ. అక్కడ ఒకసారి వీధి దీపం కింద కూర్చొని ‘గౌతమబుద్ధ’ అనే నాటకం రాసి దానిని యాభైరూపాయలకు అమ్మి, దానితో తన అవసరాలను తీర్చుకున్నారు. ‘తెనాలి రామకృష్ణ’ సినిమాలో చిన్న వేషానికి అవకాశమొచ్చినా అది నచ్చక వెనక్కి వ చ్చేశారు. ఆ తర్వాత షావుకారు చిత్రానికి డైలాగులు రాసే అవకాశం వచ్చినా అప్పుడు ఆరోగ్యం సహకరించలేదు. కొన్నాళ్ల తర్వాత ‘మనోహర’ అనే చిత్రానికి డైలాగ్ అసిస్టెంట్‌గా మాటసాయం చేశారు. చివరికి ‘దీక్ష’ సినిమాతో ఆత్రేయ సినీరంగంలోకి తెరం గేట్రం చేశారు. చాలా పద్యాలు, నాటకాలు, నాటికలు రచించారు. దాదాపు 400 చిత్రాలకు రచన చేశారు. వివిధ విశ్వవిద్యాలయాల్లో ఆత్రేయ మీద 12 మంది పరిశోధనలు చేశారు. ‘మనస్విని’ సంస్థ ఆత్రేయ సాహిత్యాన్ని 7 సంపుటులుగా 1990లో ప్రచురించారు, ఆయన ‘మనసుకవి’గా ప్రజల మన్ననలు పొందారు.
మరణం : 13-09-1989

చిత్రం : భాగ్యచక్రము(bhAgyachakramu) (1968)
రచన : పింగళి(pi~ngaLi)
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు(peNDyAla nAgEswararAo)
గానం : ఘంటసాల, పి.సుశీల(ghanTasAla,P.suSeela)
06 May - నేడు పింగళి వర్ధంతి


పల్లవి :
నీవులేక నిముసమైన నిలువజాలనే (2)
నీవె కాదా ప్రేమ నాలో విరియచేసినది (2)
మ్మ్... విరియ చేసినది...
ఈ... విరియ చేసినది...
నీవులేక నీముసమైన నిలువజాలనే
చరణం : 1
లోకమంతా నీవుగానే నాకు తోచెనుగా (2)
మరువరాని మమతలేవో
మదిని పూసెనుగా (2)
ఆ... మదిని పూసెనుగా...
నీవులేక నీముసమైన నిలువజాలనే
చరణం : 2
ఒకరికోసం ఒకరమనిన ఊహ తెలిసెనుగా
ఒకరికోసం ఒకరమనిన ఊహ తెలిసెనుగా
వీడిపోని నీడవోలే కూడి ఉందుముగా (2)
ఆ... కూడి ఉందుముగా...॥

Special Note:
పూర్తిపేరు : పింగళి నాగేంద్రరావు
జననం : 29-12-1901
జన్మస్థలం : బొబ్బిలి తాలుకా రాజాం
తల్లిదండ్రులు : మహాలక్ష్మమ్మ,గోపాలకృష్ణయ్య
చదువు : మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లమో
తొలిచిత్రం - పాట : భలేపెళ్లి (1942) - మనోహరీ అని అనేక కన్నెల
ఆఖరిచిత్రం - పాట : నీతి నిజాయితీ (1972) - భలే మజాలే భలే ఖుషీలే
పాటలు: సుమారు 300 (28 చిత్రాలు)
కథ, మాటలు, పాటలు అందించిన తొలిచిత్రం : భలేపెళ్లి (1942)
ఆఖరిచిత్రం : శ్రీకృష్ణసత్య (1971)(ఆయన మరణాంతరం విడుదలైంది)
మాటలు అందించిన ఆఖరిచిత్రం : చాణక్య చంద్రగుప్త (1977)
ఇతరవిషయాలు : పింగళికి రెండేళ్ల వయసు ఉన్నప్పడు కుటుంబం బందర్‌కు వలసి వచ్చింది. అక్కడ పింగళి వారి బాల్యం, విద్యాభ్యాసం కొనసాగింది. పింగళి తల్లి కవయిత్రి కావడంతో భారత భాగవత రామాయణా దులలు పింగళికి ఒంటబట్టాయి. సినిమాలకు రాక ముందు టీచర్‌గా, రైల్వే ఉద్యోగిగా ‘కృష్ణాపత్రిక’, ‘శారద పత్రిక’లలో ఉపసంపాదకునిగా పనిచేశారు. శారద పత్రిక నిలిచిపోగానే, తర్వాత డి.వి.సుబ్బా రావు గారి ఇండియన్ డ్రమెటిక్ కంపెనీలో చేరి 1946 వరకు సెక్రటరీగా పనిచేశారు. పింగళి జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండిపోయారు. రామ్మూర్తి అనే అబ్బాయిని దత్తత తీసుకున్నారు. 1941లో ‘భలేపెళ్లి- తారుమారు’ జోడు చిత్రాలకు పనిచేసే అవకాశం వచ్చింది. కాని రెండో ప్రపంచ యుద్ధం జరగడంతో మద్రాస్‌లో సినీ నిర్మాణం కుంటుపడింది. తర్వాత 1946లో డా. దుర్గా నాగేశ్వరరావు, డి.వి.సుబ్బారావులు పింగళిని పిలిచి ఆయన రాసిన ‘వింధ్యారాణి’ నాటకాన్ని చిత్రంగా తీశారు. అది పరాజయం అంచున ఉండిపోయింది. ఆ సమయంలో మిత్రుడైన బందర్ వాస్తవ్యులు కమలాకర కామేశ్వరరావు పింగళికి ధైర్యం చెప్పి, కె.వి.రెడ్డికి పరిచయం చేశారు. వారి కలయిక ఇక పింగళివారి పేరును తారస్థాయికి తీసుకొని వెళ్లింది. సినీ జగత్తును తన మాటల, పాటల మాయాజాలంతో ఆశ్చర్యం కల్పించిన మాంత్రికుడు పింగళి అనటంలో ఎటువంటి అతిశయోక్తిలేదు.
మరణం : 06-05-1971

చిత్రం : దేవరాగం(dEvarAgam) (1996)
రచన : వేటూరి(vETUri)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి(M.M.keeravANi)
గానం : ఎస్.పి.బాలు, ఎం.ఎం.శ్రీలేఖ

పల్లవి :
యా యా యా యా
నెమలి కన్నుల కలయా
యా యా యా యా
మురళీమోహన కళయా
చిలిపిగా ఓలమ్మో ఏదో తాళం
కడవలో పాలన్నీ తోడే రాగం
తన్నా... తన్నా...
జతై కలిసిన లయా కౌగిళ్ల నిలయా
కవ్వించుకోవయ్యా ॥యా॥
చరణం : 1
నీ లీలలే నా డోలలై
వేడి ఈల వేసే వేణుగానమల్లే
వాలు సందెవేళ చందనాలు జల్లే
మోమాటమే పెపైదవిలో
తేనెటీగలొచ్చి కుట్టినట్టు గిల్లే
లేత చెక్కిలింక ఎర్రముగ్గు జల్లే
గోపిక మనువాడే గోవుల కన్నుల్లో
వెన్నెల తెరవేసే పొన్నల నీడల్లో
విరిసిన పూలే జల్లి దీవుల్లోన
తడిపొడి తానాలాడించే
ప్రియా చిలికిన దయా
చిలిపి హృదయా కౌగిళ్ల నిలయా॥యా॥
చరణం : 2
ఈనాటిదా ఈ సంగమం
చూసీ చూడలేని
చూపులమ్మ చుంబనం
కంటిరెప్ప చాటు రేతిరమ్మ శోభనం
నీ మాటలే సయ్యాటలై
కొల్లగొట్టనేల కోకమాటు వగలే
కన్నుకొట్టనేల కాముడల్లే పగలే
యదుకుల గోపెమ్మ
ముసిముసి మురిపాలు
యమునల వరదమ్మా
అడిగెను రాధమ్మ
అతి సుఖ రాగాలెన్నో ఆలపించే
సాయంత్రాల నీడల్లో జతై
కలిసిన లయా కౌగిళ్ల నిలయా
కవ్వించుకోవయ్యా॥యా॥

చిత్రం : దేవరాగం(dEvarAgam) (1996)
రచన : వేటూరి(vETUri)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి(M.M.keeravANi)
గానం : ఎస్.పి.బాలు, ఎం.ఎం.శ్రీలేఖ

పల్లవి :
యా యా యా యా
నెమలి కన్నుల కలయా
యా యా యా యా
మురళీమోహన కళయా
చిలిపిగా ఓలమ్మో ఏదో తాళం
కడవలో పాలన్నీ తోడే రాగం
తన్నా... తన్నా...
జతై కలిసిన లయా కౌగిళ్ల నిలయా
కవ్వించుకోవయ్యా ॥యా॥
చరణం : 1
నీ లీలలే నా డోలలై
వేడి ఈల వేసే వేణుగానమల్లే
వాలు సందెవేళ చందనాలు జల్లే
మోమాటమే పెపైదవిలో
తేనెటీగలొచ్చి కుట్టినట్టు గిల్లే
లేత చెక్కిలింక ఎర్రముగ్గు జల్లే
గోపిక మనువాడే గోవుల కన్నుల్లో
వెన్నెల తెరవేసే పొన్నల నీడల్లో
విరిసిన పూలే జల్లి దీవుల్లోన
తడిపొడి తానాలాడించే
ప్రియా చిలికిన దయా
చిలిపి హృదయా కౌగిళ్ల నిలయా॥యా॥
చరణం : 2
ఈనాటిదా ఈ సంగమం
చూసీ చూడలేని
చూపులమ్మ చుంబనం
కంటిరెప్ప చాటు రేతిరమ్మ శోభనం
నీ మాటలే సయ్యాటలై
కొల్లగొట్టనేల కోకమాటు వగలే
కన్నుకొట్టనేల కాముడల్లే పగలే
యదుకుల గోపెమ్మ
ముసిముసి మురిపాలు
యమునల వరదమ్మా
అడిగెను రాధమ్మ
అతి సుఖ రాగాలెన్నో ఆలపించే
సాయంత్రాల నీడల్లో జతై
కలిసిన లయా కౌగిళ్ల నిలయా
కవ్వించుకోవయ్యా॥యా॥

చిత్రం : పెళ్లిసందడి(peLli sandaDi) (1996)
రచన : వేటూరి(vETUri)
సంగీతం : కీరవాణి(keeravANi)
గానం : ఎస్.పి.బాలు, చిత్ర(S.P.bAlu,chitra)

పల్లవి :
అభ్రపథమ్మున విభ్రమ విలసిత
శుభ్రకౌముదీ దీపికా...
దుగ్ధాంభోనిధి జనిత లలిత
సౌందర్య ముగ్ధశ్రీ నాయికా...
చెమ్మచెక్క చెమ్మచెక్క
చారెడేసి మొగ్గా ఎర్రబడ్డ కుర్రబుగ్గ
ముద్దుపేరు సిగ్గా
లేత పెదవులే పగడ కాంతులు బొట్టు ఎరుపులే పొద్దు పొడుపులు
రామచిలక ముక్కుపుడక రమణిపాప... ఓఓఓ... //చెమ్మచెక్క//
చరణం : 1 తారలెన్ని ఉన్నా
ఈ తళుకే నిజం చలనచిత్ర మేమో
నీ చక్కని చక్కెర శిల్పం
మనసు తెలుసుకుంటే
అది మంత్రాలయం
కనులు కలుపుకుంటే
అది కౌగిలికందని ప్రణయం
ముందు నువ్వు పుట్టి తరువాత
సొగసుపట్టి పరువానికి పరువైన
యువతీ
వయసు కన్నుకొట్టి నా మనసు వెన్నుతట్టి మనసిచ్చిన మరుమల్లెకు
మరిదీ
దోరసిగ్గు తోరణాల తలుపుతీసి... ఓఓఓ... //చెమ్మచెక్క//
చరణం : 2 చిలిపి మనసు ఆడే
ఒక శివతాండవం పులకరింత కాదు
అది పున్నమి వెన్నెల కెరటం
పెదవి చాటు కవిత
మన ప్రేమాయణం
వలపు ముసురు పడితే
పురివిప్పిన నెమలిపింఛం
అందమారబెట్టే అద్దాల చీరకట్టే
తడియారిన బిడియాల తరుణీ
మనసు బైటపెట్టే
మౌనాలు మూటకట్టే
మగసిరిగల దొరతనమెవరిదనీ
గట్టుకాడ బొంగరాలు
ఆడనేల.. ఓఓఓ... //చెమ్మచెక్క//

External Link: chemma chekka chemma chekka

చిత్రం : మీ శ్రేయోభిలాషి(mee SrEyObhilAshi) (2007)
రచన : వెనిగళ్ల రాంబాబు(venigaLla rAmbAbu)
సంగీతం : కోటి(kOTi)
గానం : ఎస్.పి.బాలు(S.P.bAlu)

Audio song:



సాకీ : ఆత్మీయత కరువైనా అంధకారం ఎదురైనా
బ్రతకడమే బరువైనా స్థితిగతులవి ఏవైనా
పల్లవి :
చిరునవ్వులతో బ్రతకాలి
చిరంజీవిగా బ్రతకాలి (3)
ఆనందాలను అన్వేషిస్తూ
అందరికోసం బ్రతకాలి
అందరినీ బ్రతికించాలి ॥
చరణం : 1
బ్రతుకే నీకు బరువైతే ఆ భారం దించుకో
బరువేదైనా గురితో ఓ నలుగురితో పంచుకో
కలతే లేని జీవితమంటే విలువే లేదులే
అలుపే లేక అవలీలగా ఏ గెలుపూ రాదులే
నింగినంటే ఎవరెస్టైనా
నేలనుండి మొదలౌతుంది
నమ్ముకోకు అదృష్టాన్ని నమ్ముకో ధైర్యాన్ని
మెరుపులే పిడుగులై ఉరుముతున్నా
ఉరకలు వేసే కిరణం జీవితం
చిరునవ్వులతో బ్రతకాలి
చిరుదివ్వెలుగా వెలగాలి (2)
లోకం నిండిన శోకం తుడిచే
వేకువలా ఉదయించాలి
వెన్నెలనే కురిపించాలి ॥
చరణం : 2
ఎదిగే పక్షిరెక్కకు సహజం ఎగిరే లక్షణం
వదిలేస్తుంది నిన్నటి గూటిని కదిలే ఆ క్షణం
ఏదీ నీది కాదని అనుకో ఏదోనాటికి
అయినా రేపు మిగిలే ఉంది ఆశావాదికి
కొమ్మలన్నీ చుక్కలవైపే కోరికోరి చూస్తున్నా
మట్టితోటి అనుబంధాన్ని
చెట్టు మరువగలదా
చీడలే నీడలై వీడకున్నా
అందరి బృందావనమే జీవితం
చిరునవ్వులతో బ్రతకాలి
శ్రీకారంలా బ్రతకాలి (2)
గతమంతా కనుమరుగవుతున్నా
నిన్నటి స్వప్నం నిలవాలి
నీ సంకల్పం గెలవాలి ॥
చరణం : 3
ఆశే నిన్ను నడిపిస్తుంది ఆకాశానికి
ఆశే దారి చూపిస్తుంది అవకాశానికి
ఆశే నీకు లక్ష్యం చేరే అస్త్రం మిత్రమా
ఆశే నీకు ఆయువు పెంచే అమృతం నేస్తమా
ఆశ వెంట ఆచరణుంటే
అద్భుతాలు నీ సొంతం
ఆదమరచి నిదురిస్తుంటే అందదే వసంతం
నిప్పులే గుండెలో నిండుతున్నా
ఉప్పొంగే జలపాతం జీవితం
చిరునవ్వులతో బ్రతకాలి
చిగురాశలతో బ్రతకాలి (2)
అంతిమ విజయం అనివార్యమని
ఆశిస్తూ నువు బ్రతకాలి
ఆశయాన్ని బ్రతికించాలి ॥
చరణం : 4
నీడే నిన్ను భయపెడితే ఆ నేరం వె లుగుదా
నలుసే బాధపెడుతుంటే ఆ దోషం కంటిదా
నేస్తం చూడు జీవితమంటే నిత్యం సమరమే
సమరంలోనే కనుమూస్తే ఆ మరణం అమరమే
పారిపోకు ఏ ఓటమికీ ప్రపంచాన్ని విడిచి
జారిపోకు పాతాళానికి బ్రతుకుబాట మరచి
వరదలా మృత్యువే తరుముతున్నా
ఆరని అగ్నిజ్వాలే జీవితం
చిరునవ్వులతో బ్రతకాలి శిఖరంలా పెకైదగాలి
చిరునవ్వులతో బ్రతకాలి శిఖరంలా పెకైదగాలి
చావుకు చూపే ఆ తెగింపుతో
జీవించాలనుకోవాలి
నువు జీవించే తీరాలి ॥
చరణం : 5
విజయం తలుపు తెరచేవరకూ విసుగే చెందకు
విసుగే చెంది నిస్పృహతో నీ వెనుకే చూడకు
చిందే చెమటచుక్కకు సైతం ఉందీ ఫలితమే
అది అందేవరకు సహనంతో
సాగాలి పయనమే
అంతరాత్మ గొంతే నులిమి
శాంతి కోరుకుంటావా
అల్లుకున్న అనుబంధాలే తల్లిడిల్లిపోవా
అలజడే నిలువునా అలుముకున్నా
అలుపెరుగని చైతన్యం జీవితం॥


External Link:
chirunavvulatO bratakAli - చిరునవ్వులతో బ్రతకాలి